దీపికా పదుకొణే మళ్లీ టచ్ లోకి వచ్చేది ఎప్పుడంటే?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె మరో సుందరమైన ఘట్టానికి సిద్ధమవుతున్నారు. ఇటీవలే ఆమె రెండవ సారి గర్భం దాల్చిన సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 6 Aug 2026 1:38 PM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె మరో సుందరమైన ఘట్టానికి సిద్ధమవుతున్నారు. ఇటీవలే ఆమె రెండవ సారి గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ విషయం బయటకొచ్చి రెండు మూడు నెలలు అవుతుంది. దీంతో దీపిక సినిమాలకు పూర్తిగా విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్మంలో దీపిక వృత్తిగత బాధ్యతలను పూర్తి చేసుకుంటూ విశ్రాంతి దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో `కింగ్` సినిమా షూటింగ్‌ను దీపికా సకాలంలో పూర్తి చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం `రాకా` షూటింగ్ షెడ్యూల్‌ను కూడా త్వరలోనే ముగించనున్నారు.
ఈ సినిమాకు సంబంధించి కీలక భాగాలను పూర్తి చేసే పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. `రాకా` షూటింగ్ పూర్తయిన వెంటనే అమ్మడు పూర్తిగా ఇంటికే పరిమితం కానున్నారు. దీంతో ఈ ఏడాది మిగిలిన కాలం ...వచ్చే ఏడాది ప్రారంభంలో దీపికా పదుకొణె కెరీర్ పరంగా ఎలాంటి కొత్త షూటింగ్స్‌లోనూ పాల్గొనే అవకాశం లేదు. ఆమె పూర్తిగా ఆరోగ్యం, మాతృత్వ విరామం , కుటుంబానికి మాత్రమే సమయం కేటాయించనున్నారు. దీపికా పదుకొణె మళ్లీ పూర్తి స్థాయిలో వెండితెరకు ..మీడియా ముందుకు టచ్‌లోకి వచ్చేది 2027వ సంవత్సరంలోనేనని తెలుస్తోంది.
అయితే ఈ గ్యాప్‌లో `కింగ్` సినిమా రిలీజ్ డేట్ వస్తే? ఆ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌లో పాల్గొనే అవకాశః ఉంది. గర్బిణీగా ఉండి ప్రచారంలో పాల్గొనడం పరిపాటే. `కల్కి` రిలీజ్ సమయంలో కూడా గర్భంతోనే ముంబైలో మీడియా మీట్ కు దీపిక హాజరైన సంగతి తెలిసిందే. అంతకు ముందు కరీనా కపూర్, అలిమాభట్, రాణీ ముఖర్జీ లాంటి నటీమణులు కూడా గర్భంతోనే ప్రచార కార్యక్రమాలకు హాజరయ్యారు. కాబట్టి `కింగ్` ప్రచారంలో దీపిక తప్పక పాల్గొంటుంది. అలాగని ప్రతీ ఈవెంట్ కు అటెండ్ అవ్వదు. ఒక్క ఈవెంట్‌కు మాత్రమే పరిమితం కానుందని తెలుస్తోంది.
నిరంతరం బిజీ షెడ్యూల్స్, గ్లోబల్ ప్రాజెక్ట్‌లతో క్షణం తీరిక లేకుండా గడిపిన దీపిక మెటర్నిటీ బ్రేక్‌ను వ్యక్తిగత జీవితానికి అత్యంత ప్రశాంతంగా కేటాయించాలని భావిస్తున్నారు. అభిమానులు ఎంతగానో ఇష్టపడే నటి వెండి తెరకు కొద్ది నెలల పాటు దూరంగా ఉండటం ఓవైపు అభిమానులను బాధిస్తున్నా? ఆమె ఆరోగ్యమే ప్రధానమని అంతా భావిస్తున్నారు. గ్లామర్ ప్రపంచానికి బ్రేక్ ఇచ్చి మాతృత్వాన్ని ఆస్వాదించబోతున్న దీపికా పదుకొణె 2027లో మరింత ఫ్రెష్‌గా, సరికొత్త ఉత్సాహంతో తిరిగి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అప్పటి వరకు దీపిక రికవరీ ..ఫ్యామిలీ లైఫ్ గురించిన అప్‌డేట్స్ మాత్రమే సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది.
