స్టార్ హీరోయిన్‌కి రెండు వ్యానిటీ వ్యాన్‌ల కథేమి?
తాజా పాడ్ కాస్ట్ లో ఇంటీరియర్ డిజైనర్ వినితా చైతన్య దీపిక వ్యానిటీల గురించి వివరించారు. తన ఇంటి కోసం ఇంటీరియర్ డిజైనర్ గా పని చేసిన వినీతాను వ్యానిటీ వ్యాన్‌లు డిజైన్ చేయాల్సిందిగా దీపిక కోరింది.
By: Sivaji Kontham | 19 Dec 2025 9:40 AM ISTస్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే ఇటీవలే టాలీవుడ్ లో వరుసగా రెండు పెద్ద అవకాశాల్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా- స్పిరిట్, నాగ్ అశ్విన్ - కల్కి 2898 ఏడి చిత్రాల నుంచి దీపికను నిరభ్యంతరంగా తొలగించారు. 6 గంటల పనిదినం డిమాండ్ సహా చాలా అదనపు ప్యాకేజీలు, కోరికల కారణంగా దీపికను తొలగించారని కూడా ప్రచారమైంది.
అదంతా అటుంచితే దీపిక పదుకొనే గురించి మరో కొత్త ఆసక్తికర విషయం తెలిసింది. స్టార్ హీరోయిన్ గా పరిశ్రమను ఏల్తున్న దీపిక పదుకొనేకు రెండు వ్యానిటీ వ్యాన్‌లు సెట్లో అవసరం. వీటిని అత్యంత విలాసవంతంగా భారీ సౌకర్యాలతో డిజైన్ చేయించుకున్నారు. దీనికోసం కోట్లకు కోట్లు ఖర్చు చేసారట. ఈ వ్యాన్ లను ఆన్ లొకేషన్ టేక్ ల మధ్య వేచి ఉండటానికి లేదా రిలాక్స్ అవ్వడానికి దీపిక ఉపయోగిస్తుంది.
తాజా పాడ్ కాస్ట్ లో ఇంటీరియర్ డిజైనర్ వినితా చైతన్య దీపిక వ్యానిటీల గురించి వివరించారు. తన ఇంటి కోసం ఇంటీరియర్ డిజైనర్ గా పని చేసిన వినీతాను వ్యానిటీ వ్యాన్‌లు డిజైన్ చేయాల్సిందిగా దీపిక కోరింది. తన వ్యానిటీ వ్యాన్ లో సౌకర్యాలు ఎలా ఉండాలో, మోడిఫికేషన్ ఎలా చేయాలో కూడా దీపిక స్వయంగా సూచించింది. దీపిక పూర్తిగా తన వ్యక్తిగత ఆసక్తులకు తగ్గట్టుగా తన వ్యాన్‌లను డిజైన్ చేయించుకున్నారు. అందులో ఒకటి పెద్ద వ్యాన్. అది భారీ షూటింగుల కోసం సెట్లలోకి వెళుతుంది. మరొకటి చిన్న వ్యాన్.. అక్కడికక్కడే అటూ ఇటూ లొకేషన్లు మారినప్పుడు ఉపయోగించే వ్యాన్. ఈ రెండిటికీ వినీతా ఇంటీరియర్ డిజైన్ చేసానని తెలిపారు.
ఇంతకుముందు షారూఖ్ ఖాన్ వ్యానిటీ వ్యాన్‌ని పరిశీలించిన వినీత.. సౌలభ్యం, ప్రాక్టికాలిటీని అనుసరించి తన వ్యాన్ ని డిజైన్ చేయించుకున్నారని కూడా తెలిపారు. దీపిక అందుకు భిన్నంగా వ్యక్తిగత ఎంపికలతో వ్యాన్ ని డిజైన్ చేయించుకున్నారని వినీత వెల్లడించారు. అపార్ట్ మెంట్లు, విల్లాలు, కార్యాలయాలతో పాటు వ్యానిటీ వ్యాన్లను డిజైన్ చేసిన అనుభవం వినీతా సొంతం. దీపికకు చెందిన రెండు వ్యాన్లను తానే డిజైన్ చేసానని తెలిపారు.
దీపిక తన ఇళ్ల డిజైన్‌ల మాదిరిగానే తన వానిటీ వ్యాన్‌ల డిజైన్‌ను కూడా అదే స్పష్టత తో రూపొందించాలని తనను సంప్రదించినట్టు తెలిపారు. తన వ్యాన్ ఎలా ఉండాలో దీపికకు పూర్తి అవగాహన ఉంది. అది ఒక నిర్దిష్ట పద్ధతిలో ఉండాలని కోరుకుంది. నాకు అది చాలా సరదాగా అనిపించింది - కాకపోతే.. టెక్నీషియన్లతో కలిసి వ్యాన్‌పై పని చేయడానికి నేను నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. ఇలాంటివి డిజైన్ చేయాలంటే, ముఖ్యంగా నటీనటులు తమ వ్యాన్‌లను ఎలా ఉపయోగిస్తారో తెలుసుకోవడం అవసరమని వినీతా తెలిపారు. షారూఖ్ ఖాన్ వ్యానిటీలో అయితే చిన్న జిమ్ కూడా ఉందని వెల్లడించారు.
