ఈ సూపర్‌స్టార్ దీపిక పదుకొనేకు బద్ధ శత్రువు?
అయితే దీపిక పదుకొనే బ్యాడ్ టైమ్ గురించి చర్చ సాగుతున్న ఇలాంటి సమయంలోనే మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా దీపికకు విలన్ గా మారాడంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.
By: Sivaji Kontham | 23 Sept 2025 9:28 AM ISTబాలీవుడ్ అగ్ర కథానాయిక దీపిక పదుకొనేను బ్యాక్ టు బ్యాక్ ప్రభాస్ సినిమాల నుంచి తొలగించడంతో ఈ వార్తలు సంచలనంగా మారాయి. మొదట సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న `స్పిరిట్` నుంచి దీపికను తొలగించారని కథనాలొచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు వైజయంతి మూవీస్ సంస్థ కల్కి 2898 ఏడి నుంచి దీపికను తొలగిస్తున్నామని ప్రకటించి పెద్ద షాకిచ్చింది. దీపికకు బ్యాడ్ టైమ్ పీక్స్ కి చేరుకుందని ఇది ప్రూవ్ చేసింది. సౌత్ లో ఇక అల్లు అర్జున్ - అట్లీ మూవీ తప్ప నెక్ట్స్ సినిమాకి ఛాన్సే లేదు అంటూ ప్రచారం సాగుతోంది.
దీపిక తన పారితోషికాన్ని కల్కి 2898ఏడి- మొదటి భాగం కంటే చాలా ఎక్కువ పెంచేసిందని, 25 శాతం పెంపుతో పాటు 7 గంటల పని షిఫ్ట్ డిమాండ్ చేస్తున్నందున తనను తొలగించాలని `కల్కి 2` నిర్మాతలు నిర్ణయించుకున్నారని కథనాలొచ్చాయి. ఈ రెండు డిమాండ్లను దీపికతో చర్చించడానికి మేకర్స్ ప్రయత్నించారు. కానీ దీపిక కఠినంగా వ్యవహరించిందని కూడా గుసగుసలు వినిపించాయి. దీనికి తోడు తన పరివారానికి కూడా భారీ సౌకర్యాలు కావాలని దీపిక కోరారని, గొంతెమ్మ కోర్కెలు ఎక్కువయ్యాయని కూడా గుసగుస వినిపించింది.
అయితే దీపిక పదుకొనే బ్యాడ్ టైమ్ గురించి చర్చ సాగుతున్న ఇలాంటి సమయంలోనే మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా దీపికకు విలన్ గా మారాడంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. ఇటీవల అమీర్ ఖాన్ ఇంటర్వ్యూ క్లిప్ ఒకటి వైరల్ గా మారుతోంది. ఈ క్లిప్ దీపిక డిమాండ్లకు కౌంటర్ వేసినట్టుగా కనిపిస్తోంది.
అమీర్ ఖాన్ తన తాజా ఇంటర్వ్యూలో నిర్మాతల కష్టం గురించి ప్రస్థావిస్తూ, అసలు నటీనటుల పరివారానికి నిర్మాత ఎందుకు చెల్లించాలి? అని ప్రశ్నించారు. తన డ్రైవర్, వ్యక్తిగత పనివాళ్లకు సొంతంగా జీతం ఇస్తానని అమీర్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. నిర్మాతల కష్టాన్ని అర్థం చేసుకుని ఆర్టిస్టు పని చేయాలని సూచించారు. అయితే ఇది దీపిక పదుకొనే లాంటి కఠిన నిబంధనలను అనుసరించే స్టార్ కి కౌంటర్ వేసినట్టేనని నెటిజనులు భావిస్తున్నారు. సరిగ్గా కల్కి2 నుంచి దీపికను తొలగించారు! అన్న వార్తలు వస్తున్న సమయంలోనే టైమింగ్ లీ అమీర్ ఇంటర్వ్యూ క్లిప్ బయటపడటంతో ఇప్పుడు దానిని ప్రభాస్ అభిమానులు జోరుగా షేర్ చేస్తున్నారు.
