ప్రభాస్ ను నింధిస్తే ఎలా?
ఈ పరిస్థతికి కారణం ప్రభాసే అంటూ కొందమంది దీపిక ఫ్యాన్స్ ఆరోపణలు చేస్తున్నారు. తొలుత స్పిరిట్, ఇప్పుడు కల్కి ప్రాజెక్ట్ ల నుంచి దీపికను తప్పించడానికి ముఖ్య కారణం ప్రభాసే అని విమర్శిస్తున్నారు.
By: M Prashanth | 23 Sept 2025 11:08 AM ISTఇండస్ట్రీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె పేరు హాట్ టాపిక్ అయ్యింది. కల్కి 2 సినిమా నుంచి ఆమెను తీసివేయడం సోషల్ మీడియాలో ఇప్పటకీ చర్చనీయంగానే ఉంది. కల్కి తొలి భాగంలో దీపిక పోషించిన సుమతి పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు రెండో భాగంలో ఆ పాత్ర అత్యంత కీలకం కానుంది. ఈ నేపథ్యంలో దీపికను తీసివేయడం పెద్ద ఆనుమానాలకే దారి తీసింది.
తక్కువ వ్యవధిలోనే టాలీవుడ్ లో ఆమె రెండు భారీ ప్రాజెక్ట్ లు కోల్పోయింది. తొలుత సందీప్ రెడ్డి- ప్రభాస్ కాంబో స్పిరిట్, ఆ తర్వాత కల్కి సినిమాల అవకాశాలను కోల్పోయింది. ఈ రెండూ కూడా ప్రభాస్ సినిమాలే కావడం గమనార్హం. అయితే ఈ వ్యవహారంపై దీపిక సైలెంట్ గానే ఉన్నప్పటికీ.. ఆమె ఫ్యాన్స్, పీఆర్ టీమ్ మాత్రం తమతమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వెల్లడిస్తూనే ఉన్నారు.
ఈ పరిస్థతికి కారణం ప్రభాసే అంటూ కొందమంది దీపిక ఫ్యాన్స్ ఆరోపణలు చేస్తున్నారు. తొలుత స్పిరిట్, ఇప్పుడు కల్కి ప్రాజెక్ట్ ల నుంచి దీపికను తప్పించడానికి ముఖ్య కారణం ప్రభాసే అని విమర్శిస్తున్నారు. ఒకవేళ ఈ వ్యవహారంలో ప్రభాస్ గనుక ఎంటర్ అయి ఉంటే.. దీపికను తప్పించేందుకు డైరెక్టర్లు, నిర్మాతలు ధైర్యం చేసేవారు కాదని వారి వాదన. ఆమెపై నెగిటివిటి జరగడానికి ఇన్ డైరెక్ట్ గా ప్రభాసే కారణం అని అంటున్నారు.
కానీ, దీపికను తప్పించడంలో ప్రభాస్ పాత్ర ఉంది అనేది అర్థం లేని వాదని అని తెలుస్తోంది. ఎందుకంటే తన సినిమాల్లో ప్రభాస్ ఏనాడూ కాస్టింగ్ విషయంలో జోక్యం చేసుకోరట. ఈ వ్యవహారాల్లోకి తాను అస్సలు ఎంటర్ ఫియర్ కారని, నటీనటుల విషయంలో పూర్తి ఛాయిస్ డైరెక్టర్, ప్రొడ్యూసర్లపైనే వదిలేస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో చెబుతున్న మాట. అందుకే ఈ విషయంలో ప్రభాస్ ను బ్లేమ్ చేయాలనుకుంటే అది దీపికకే రివర్స్ లో బూమరంగ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు.
ఇక దీపికను తప్పించడంతో ఆ పాత్రను ఎవరు చేస్తారనేది ఆసక్తిగా మారింది. కీలకమైన ఆ క్యారెక్టర్ కోసం డైరెక్టర్ నాగ్ అశ్విన్ మళ్లీ బీ టౌన్ భామలను సంప్రదిస్తారా.. లేదా సౌత్ నుంచే ఇంకెవరికైనా అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాలి. ఏదేమైనా క్యాస్టింగ్ విషయంలో వైజయంతి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. బడ్జెట్ లెక్కల్లో కూడా ఎంతో అనుభవం ఉన్న అశ్వినీ దత్ రెమ్యునరేషన్స్ విషయంలో కూడా చాలానే ఆలోచిస్తారు. బహుశా దీపికా ఎక్కువ డిమాండ్ చేయడం వల్ల ఆమెను తప్పించి ఉండవచ్చు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.
