Begin typing your search above and press return to search.

IMDb ర్యాంకింగ్స్‌లో ఎదురే లేని నంబ‌ర్ వ‌న్‌ నటి?

2007లో సినీరంగంలో ఆరంగేట్రం చేసిన దీపికా పదుకొనే IMDb మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్ ఆఫ్ ది లాస్ట్ డికేడ్ (2014- 2024) జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.

By:  Sivaji Kontham   |   1 Oct 2025 8:58 AM IST
IMDb ర్యాంకింగ్స్‌లో ఎదురే లేని నంబ‌ర్ వ‌న్‌ నటి?
X

2007లో సినీరంగంలో ఆరంగేట్రం చేసిన దీపికా పదుకొనే IMDb మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్ ఆఫ్ ది లాస్ట్ డికేడ్ (2014- 2024) జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా ఒక యూనిక్ వేలో కెరీర్ మార్గాన్ని రూపొందించుకున్న న‌టిగా దీపిక‌కు ఈ గుర్తింపు ద‌క్కింది. దీపిక న‌టించిన 10 సినిమాల‌ను ఐఎండిబి గుర్తించి నంబ‌ర్ వ‌న్ ర్యాంక్ ని క‌ట్ట‌బెట్టింది.

ఐశ్వర్య రాయ్ బచ్చన్, అలియా భట్ టాప్ 5 లో క‌నిపించారు. భారతీయ నటీమణులు దేశీయ, అంతర్జాతీయ గుర్తింపును సమతుల్యం చేస్తూ కెరీర్‌ను న‌డిపించ‌డం కూడా ప్ర‌త్యేక గుర్తింపును ఇస్తోంది. న‌టీమ‌ణులుగా, వ్య‌వ‌స్థాప‌కులుగా, అంత‌ర్జాతీయ స్థాయి ప్రాజెక్టుల్లో న‌టించే వారిని ఐఎండిబి గుర్తించింది. భార‌త‌దేశంలోనే కాకుండా దేశం ఆవ‌ల కూడా రాణించే క‌థానాయిక‌ల‌కు, న‌టీన‌టుల‌కు ఈ గుర్తింపు ద‌క్కుతుంది.

ఐఎండిబి ర్యాంకింగ్స్ లో దీపిక అగ్రస్థానంలో నిల‌వ‌గా, షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కొత్త వేవ్ నుంచి అలియా భట్ 4వ స్థానంలో నిలిచింది. 2010 ఎందిర‌న్ స‌మ‌యం నుంచి ఐఎండిబి ప్రజాదరణ జాబితాలో ఐశ్వ‌ర్యారాయ్ క్రమం తప్పకుండా కనిపిస్తూనే ఉన్నారు. అదే సమయంలో అలియా `హైవే` (2014) , గంగూబాయి కతియావాడి (2022) చిత్రాలలో అద్భుతమైన పాత్రలతో తనదైన ముద్ర వేసింది. ప్రియాంక చోప్రా జోనాస్ ఆరు చిత్రాలతో క‌థానాయిక‌ల జాబితాలో టాప్ 10లో నిలిచింది.

ద‌క్షిణాది నుంచి ఈ జాబితాలో టాప్ 10లో ఎవ‌రూ లేరు. స‌మంత‌13, ప్ర‌భాస్ 29, ధ‌నుష్ 30, చ‌ర‌ణ్ 31, అల్లు అర్జున్ 47, ఎన్టీఆర్ 67 స్థానాల్లో నిలిచారు. ద‌క్షిణాది సూప‌ర్ స్టార్లు పాన్ ఇండియాలో రాణిస్తున్నారు. పెరుగుతున్న గుర్తింపుతో పాటు, మునుముందు మ‌న స్టార్ల ర్యాంకింగులు జాబితాలో మెరుగుప‌డ‌తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.