అందరూ ఎక్కువ ఆలోచిస్తున్నారు. ధురంధర్2 సైలెన్స్ పై దీపికా క్లారిటీ
బాలీవుడ్‌లో భారీ విజయాన్ని సాధించిన ధురంధర్: ది రివెంజ్ చుట్టూ తాజాగా మరో ఆసక్తికర చర్చ చెలరేగింది.
By: Sravani Lakshmi Srungarapu | 8 April 2026 11:42 AM ISTబాలీవుడ్‌లో భారీ విజయాన్ని సాధించిన ధురంధర్: ది రివెంజ్ చుట్టూ తాజాగా మరో ఆసక్తికర చర్చ చెలరేగింది. రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ సినిమా మార్చి 19న రిలీజై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధిస్తుండగా, ఆయన భార్య మరియు స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఈ విషయంలో మౌనంగా ఉండటం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.
సినిమా రిలీజైన తర్వాత బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు ఈ సినిమాను ప్రశంసలతో ముంచెత్తుతుండగా, దీపిక మాత్రం సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చేయకపోవడం కొందరిలో అనుమానాలకు కారణమైంది. ఆమె మౌనం ఏదైనా సంకేతమా? లేక సోషల్ మీడియా ఓవర్ రియాక్షనా? అనే చర్చలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో దీపిక తాజాగా స్పందిస్తూ ఈ విషయమై స్పష్టత ఇచ్చారు.
సోషల్ మీడియాలో ఆమె సైలెన్స్ పై వచ్చిన కామెంట్స్ కు రియాక్ట్ అవుతూ.. ఈ విషయం గురించి అందరూ ఎక్కువగా ఆలోచిస్తున్నారని, ఈ సినిమాను నేను మీ అందరికంటే ముందే చూశానని, ఆ విషయం మీకు తెలియదని, ఇప్పుడు ఎవరు ఎవరిని విమర్శించాలో చెప్పండంటూ అడిగి, సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలకు ఆమె గట్టి చెక్ పెట్టారు.
దీపిక రియాక్షన్ కు ఆమె ఫ్యాన్స్ కూడా బలంగా మద్దతు తెలిపారు. దీపికా రణ్‌వీర్ తోనే ఉంటుందని, దీనికి ఇంకా ఎలాంటి ప్రూఫ్ కావాలంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు మాత్రమే వ్యక్తిగత మద్దతుకు ప్రమాణం కాదని ఈ సంఘటన మరోసారి ప్రూవ్ చేసింది. కాగా రణ్‌వీర్, దీపికా బాలీవుడ్ లోని ప్రముఖ సెలబ్రిటీ కపుల్స్ లో ఒకరు.
రూ.1000 కోట్ల పైగా కలెక్షన్లు
ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ధురంధర్ ఫ్రాంచైజ్ సినిమాలు రెండూ ఒకదాన్ని మించి ఒకటి సక్సెస్ ను అందుకున్నాయి. ఈ సినిమాలో అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించారు. సంగీత పరంగా కూడా ఈ సినిమా మంచి గుర్తింపును అందుకుంది. ముఖ్యంగా ఆరి ఆరి సాంగ్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుని సినిమా సక్సెస్ కు తోడ్పడింది. బాక్సాఫీస్ పరంగా కూడా ఈ సినిమా మరో మైల్‌స్టోన్ ను చేరుకుంది. దేశవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు సాధించి, ఇటీవల కాలంలో అత్యంత భారీ హిట్‌గా నిలిచింది. 20వ రోజుకే బాహుబలి2 రికార్డులను దాటేసి, పుష్ప2 తర్వాత సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అలాగే దంగల్ లాంటి సినిమాల రికార్డులను ఈ సినిమా సవాల్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది. మొత్తంగా ధురంధర్2 విషయంలో జరుగుతున్న చర్చలకు దీపికా ఇచ్చిన ఆన్సర్ ముగింపుని ఇచ్చినట్టైంది.
