Begin typing your search above and press return to search.

ఒంటరి అవుతున్న దీపిక.. ఇప్పటికైనా మాట్లాడుతుందా?

దీపికా పదుకొనే.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈమె పేరే హాట్ టాపిక్ గా మారింది. గత రెండు రోజులుగా దీపికా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసిందని చెప్పవచ్చు

By:  Madhu Reddy   |   19 Sept 2025 5:00 PM IST
ఒంటరి అవుతున్న దీపిక.. ఇప్పటికైనా మాట్లాడుతుందా?
X

దీపికా పదుకొనే.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈమె పేరే హాట్ టాపిక్ గా మారింది. గత రెండు రోజులుగా దీపికా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కల్కి2 సినిమా నుంచి తప్పిస్తున్నట్లు ఆ సినిమా నిర్మాతలు వైజయంతి మూవీస్ బ్యానర్ అధికారికంగా సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించడంతో దీపికాపై పెద్ద ఎత్తున నెగిటివిటీ ఏర్పడింది. ముఖ్యంగా నిబద్ధతలేని వ్యక్తులు అవసరం లేదు అంటూ వైజయంతి మూవీస్ ప్రకటించడంతో దీపిక అత్యధిక పారితోషకం డిమాండ్ చేసిందని, అటు పని దినాలలో కూడా కండిషన్లు పెట్టిందని, అందుకే ఇప్పుడు ఈమెను భరించలేక సినిమా నుండి తప్పించారేమో అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

దీనికి తోడు గతంలో స్పిరిట్ మూవీ విషయంలో కూడా ఇలాంటి వార్తలే వినిపించిన విషయం తెలిసిందే. స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గా సందీప్ రెడ్డివంగా ఈమెను ఎంపిక చేసుకున్నారు. పైగా కథను కూడా వివరించారు. కానీ ఈమె అధిక పారితోషకం డిమాండ్ చేయడం, ఎనిమిది గంటల పని దినాలు కోరడంతో ఈమె డిమాండ్లను నెరవేర్చలేక ఈమెను తప్పించి ఈమె స్థానాన్ని యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీతో భర్తీ చేస్తున్నట్లు సందీప్ రెడ్డివంగా ప్రకటించారు. అయితే దీపిక పదుకొనేను సినిమా నుండి తప్పించడంతో ఆమె పీ ఆర్ టీమ్ కథను కొద్దిగా లీక్ చేయడమే కాకుండా ఆడవారిపై కనీస సానుభూతి చూపించలేదు అంటూ సందీప్ రెడ్డి వంగా పై నెగిటివిటీ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. దీనితో సందీప్ కూడా "డర్టీ పి ఆర్ గేమ్స్" అంటూ దీపికాపై ఇండైరెక్టుగా కామెంట్లు చేశారు

అయితే ఆ సమయంలో దీపికాకి అప్పుడే కూతురు పుట్టడం, కూతురు బాధ్యతను, ఇంటి నిర్వహణను దృష్టిలో పెట్టుకొని దీపిక అడిగిన దాంట్లో తప్పు లేదని చాలామంది దీపికాకు అండగా నిలిచారు. సెలబ్రిటీలు కూడా ఆమె కోసం సపోర్టు పలికారు. అయితే మళ్లీ దీపికను అదే కారణాల చేత కల్కి 2 నుంచి కూడా తప్పిస్తూ అధికారిక ప్రకటన చేయడంతో ఇప్పుడు దీపికాపై ఎక్కడలేని నెగిటివిటీ పెరిగిపోయింది. అడగడం తప్పు కాదు కానీ డిమాండ్ చేయడమే తప్పు ఇలాంటి డిమాండ్లకు ఎవరు ఒప్పుకుంటారు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

ముఖ్యంగా చాలామంది దీపికాదే తప్పు అని.. ప్రభాస్ లాంటి హీరోలతో సినిమాలు చేయాలి అంటే కొన్ని కొన్ని షరతులను కూడా పక్కన పెట్టాల్సి ఉంటుంది అంటూ దీపికాకు సలహాలు ఇస్తున్నారు. ఇలా మొత్తానికైతే అటు సెలబ్రిటీల నుండి ఇటు సోషల్ మీడియాలో కూడా దీపికాకు నెగిటివిటీ పెరిగిపోతోంది. దీన్ని బట్టి చూస్తే అటు దీపికా కూడా ఒంటరి అవుతోందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఇలాంటి సమయంలోనైనా దీపికా స్పందించాలని అభిమానులు కోరుతూ ఉండడం గమనార్హం. మొత్తానికి అయితే అప్పుడు స్పిరిట్, ఇప్పుడు కల్కి 2 సినిమాల నుంచి తప్పించడంపై దీపిక స్పందించి నెగెటివిటీకి చెక్ పెడుతుందేమో చూడాలి.