ఫరా (X) దీపిక: ఇద్దరిలోను ఎందుకింత తొట్రుపాటు?
అయితే ఈ పుకార్లపై ఇప్పుడు ఫరా ఖాన్ స్పందించారు. దీపిక తాను చాలా కాలంగా సోషల్ మీడియాల్లో ఒకరినొకరు అనుసరించడం లేదని ఫరా తెలిపారు.
By: Sivaji Kontham | 2 Oct 2025 8:15 AM ISTదీపిక పదుకొనే లైఫ్ జర్నీలో ఈ దశ అత్యంత సంక్లిష్ఠంగా మారిన సంగతి తెలిసిందే. అగ్ర కథానాయికగా బాలీవుడ్ ని ఏలిన దీపిక మామ్ అయ్యాక కొన్ని కండిషన్లతో మాత్రమే సినిమాల్లో నటించేందుకు ఇష్టపడుతోంది. అయితే ఇది దర్శకనిర్మాతల ఆలోచనలతో సింక్ అవ్వడం లేదు. ఫలితంగా ఇప్పటికిప్పుడు దీపికను రెండు భారీ సినిమాల నుంచి నిర్మాతలు తొలగించారు.
ఆ తర్వాత ఎనిమిది గంటల పనిదినం గురించి చాలా చర్చ సాగిన సంగతి తెలిసిందే. అయితే ఓ పాడ్ కాస్ట్ లో దీపికకు అత్యంత సన్నిహితురాలు, గురువు అయిన ఫరా ఖాన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిగ్గా మారాయి. దీపిక ఇకపై ఎనిమిది గంటలు పని చేస్తుందని, తన షోకి రావడానికి సమయం సరిపోదని ఫరా వ్యాఖ్యానించింది. అయితే ఆ ఎగతాళి వ్యాఖ్యలకు దీపిక హర్టయిందని, ఆ తర్వాత దీపిక, ఫరా సోషల్ మీడియాల్లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారని, ఇద్దరి మధ్యా చెడిందని ప్రచారమైంది.
అయితే ఈ పుకార్లపై ఇప్పుడు ఫరా ఖాన్ స్పందించారు. దీపిక తాను చాలా కాలంగా సోషల్ మీడియాల్లో ఒకరినొకరు అనుసరించడం లేదని ఫరా తెలిపారు. దానికి బదులుగా ఏం మాట్లాడాలనుకున్నా, ఒకరికొకరం మెసేజ్ లు ఇచ్చుకోవాలని ఒక నియమం పెట్టుకున్నామని కూడా ఫరా తెలిపారు. మెసేజ్ లు లేదా కాల్ లో మాట్లాడుకోవడానికే మేం ఇష్టపడుతున్నామని ఫరా తెలిపింది. సోషల్ మీడియాలను అనుసరించడం దీపికకు ఇష్టం లేదని కూడా తెలిపింది. ఫరా వ్యాఖ్యానానికి ప్రతి స్పందనగా దీపిక పదుకొనే వ్యాఖ్యానిస్తూ `ఆమెన్` (చేతులు ముడుచుకున్న ఈమోజీతో) అనే రిప్లయ్ ఇచ్చింది.
ఎనిమిది గంటల షిఫ్ట్ విషయంలో దీపికను నేను తప్పు పట్టలేదని కూడా ఫరా వివరణ ఇచ్చింది. నా వ్యాఖ్య తప్పు కాదు... దీపికతో మంచి సంబంధాలున్నాయి. దువా పుట్టినప్పుడు దీపికను పరామర్శించిన మొదటి వ్యక్తిని నేను అని కూడా ఎవరికీ తెలియదు. ఇన్‌స్టాగ్రామ్ కామెంట్ల కోసం ఏదీ జరగదు! అని ఫరా సీరియస్ అయింది.
అంతకుముందు హోమ్‌బౌండ్ ప్రీమియర్‌లో ఆయుష్ శర్మను విస్మరించిందని ఫరాపై ఆరోపణలు వచ్చాయి. అయితే గుంపులో అతడిని చూడలేదని ఫరా పేర్కొంది. ప్రతిదానిని విమర్శించే తప్పుడు కాలమిదని కూడా ఫరా సీరియస్ అయింది. ఓం శాంతి ఓం చిత్రంతో దీపికను వెండితెరకు పరిచయం చేసారు ఫరా ఖాన్. హ్యాపీ న్యూ ఇయర్ చిత్రానికి కలిసి పని చేసారు. ఇతర చిత్రాల్లోను కలిసి పని చేసారు. ఆ ఇద్దరి మధ్యా ఎప్పుడూ గొప్ప అనుబంధం ఉంది.
