కుటుంబం కోసమే దీపిక స్పీడ్ తగ్గిస్తుందా?
దీపికా పదుకొణే సినిమాల స్పీడ్ తగ్గించిందా? కొత్త కమిట్ మెంట్ల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోందా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది
By: Srikanth Kontham | 12 Aug 2025 3:00 PM ISTదీపికా పదుకొణే సినిమాల స్పీడ్ తగ్గించిందా? కొత్త కమిట్ మెంట్ల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోందా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది. ఏడాది క్రితం వరకూ దీపిక స్పీడ్ ఎలా ఉండేదన్నది చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాది ఏకంగా మూడు సినిమాలో ప్రేక్షకుల్ని అలరించింది. `ఫైటర్`, `కల్కి 2898`, `సింగం ఎగైన్` లాంటి చిత్రాలతో మెస్మరైజ్ చేసింది. కానీ 2025 లో మాత్రం ఇంత వరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు. రెండు...మూడు సినిమాలు సెట్స్ లో ఉండగానే మరో రెండు ...మూడు చిత్రా లకు కమిట్ అయ్యేది.
సొంత బ్యానర్ సినిమాకు నో:
వాటి అధికారిక ప్రకటనతో బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యేది. కానీ ఎనిమిది నెలల కాలగా దీపిక స్తబ్దుగా ఉంది. ఇటీవలే సొంత నిర్మాణ సంస్థలో అమెరికన్ కామెడీ డ్రామా ది ఇన్ టెన్ ని రీమేక్ చేస్తున్న ట్లు ప్రకటించింది. ఇదే సినిమాలో దీపిక కూడా నటిస్తుందని ప్రచారం జరిగింది. లెజెండరీ నటుడు అమి తాబచ్చన్ భాగమవ్వడంతో ఆయనతో దీపిక కూడా తెరను పంచుకుంటుందని అభి మానులు ఆశించారు. దీపిక కూడా సానుకూలంగానే స్పందించింది. కానీ అమ్మడిప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పు కున్నట్లు వార్తలొస్తున్నాయి.
కుటుంబం కోసమే త్యాగమా:
తాను కేవలం నిర్మాతగా మాత్రమే కొనసాగుతుందని...నటిగా కనిపించదనే ప్రచారం జరుగుతోంది. `స్పి రిట్` చిత్రాన్ని పని గంటల కారణంగా వదులుకుంది. అది బయట నిర్మాణ సంస్థ కాబట్టి కొన్ని కండీ షన్లకు లోబడి పని చేయాలి? కాబట్టి అక్కడ కొన్ని రకాల ఇబ్బందులుంటాయి. కానీ సొంత నిర్మాణ సంస్థలో సినిమాకు కూడా మ్యాకప్ వేసుకోవడానికి సిద్దంగా లేకపోవడం సర్వత్రా చర్చకు దారి తీస్తోంది. దీంతో దీపిక కుటుంబం కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందా? అన్న అంశం తెరపైకి వస్తోంది.
అప్పటివరకూ వెయిటింగ్ తప్పదా?
భర్త రణవీర్ సింగ్..బేబి కోసమే ఎక్కువగా సినిమాలు కమిట్ అవ్వడం లేదన్నది మరో వెర్షన్. కమిట్ అయిన చిత్రం ఏదైనా ఉందా? అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 22వ చిత్రం. పాన్ ఇండియాలో భారీ కాన్వాస్ పై తెరకెక్కుతోన్న చిత్రమిది. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతోంది. కానీ దీపిక ఇంకా సెట్స్ కు వెళ్లలేదు. ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఎలా లేదన్నా? ఏడాదిన్నర సమయం పడుతుంది. మరి అంత వరకూ దీపిక అభిమానుల్ని వెయిట్ చేస్తుందా? మధ్యలో మరో సినిమాతో సర్ ప్రైజ్ చేస్తుందా? అన్నది చూడాలి.
