Begin typing your search above and press return to search.

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

దీపికా పదుకొణె తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను తాజాగా గుర్తుచేసుకున్నారు. మోడలింగ్ పోర్ట్‌ఫోలియో షూట్ కోసం తల్లి దగ్గర రూ.10 వేలు అప్పుగా తీసుకున్నానని తెలిపారు. ఆ డబ్బు తిరిగి ఇచ్చి తల్లిని గర్వపడేలా చేస్తానని మాటిచ్చినట్లు వెల్లడించారు. షారుఖ్ ఖాన్‌తో ‘ఓం శాంతి ఓం’తో హీరోయిన్‌గా పరిచయమై స్టార్‌గా ఎదిగారు.

By:  Srikanth Kontham   |   13 Nov 2026 1:00 AM IST
10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!
X

బాలీవుడ్ లో దీపికా ప‌దుకొణే జ‌ర్నీ ఎలా మొద‌లైంద‌న్న‌ది చెప్పాల్సిన‌ ప‌నిలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా0 ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన అమ్మ‌డు తొలుతు క్యాలెండ‌ర్ గాళ్ గా పాపుల‌ర్ అయి అటుపై న‌టిగా ప్ర‌మోట్ అయింది. ఎదిగే క్ర‌మంలో ఎన్నో అవ‌మానాలు..ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కుంది. భారీ ఎత్తు కార‌ణంగా హీరోయిన్ అవ‌కాశాలు రాని ప‌రిస్థితులు ఎదుర్కుంది. కానీ నేడు దీపిక రేంజ్ ఏంటి? అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. ఒక్క సినిమాకే కోట్లు పారితో షికం అందుకుంటుంది. బ్రాండ్ ను ఎండార్స్ చేస్తూ సంపాదిస్తుంది. ఇలా రెండు చేతులా సంపాద‌నే.

న‌టిగా స్థిర‌ప‌డి అనంత‌రం ర‌ణ‌వీర్ సింగ్ ను పెళ్లాడి స్థిర‌ప‌డింది. ప్ర‌స్తుతం సినిమాలతో పాటు ఓ ఇంటికి ఇల్లాలిగా బాధ్య‌త‌లు నెర‌వ‌ర్తిస్తుంది. మాతృత్వ‌పు గ‌డియలు ఆస్వాదిస్తుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా దీపిక కెరీర్ ఆరంభం గురించి మ‌రికొన్ని విష‌యాలు పంచుకున్నారు. దీపిక తండ్రి ప్రకాష్ పదుకొనే బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా దేశం గర్వించదగ్గ కీర్తిని తెచ్చిన సంగతి తెలిసిందే. ఆ కాలంలో ఎవరినడిగినా డాక్టర్ లేదా లాయర్ కావాలని కోరుకునేవారని కానీ తన తండ్రి మాత్రం పూర్తిగా భిన్నమైన క్రీడా రంగాన్ని ఎంచుకుని విజయం సాధించారని గుర్తు చేసుకున్నారు.

ఒకవేళ తాను కూడా తండ్రి బాటలోనే క్రీడా రంగంలోకి అడుగుపెట్టి ఉంటే ఆయన సంతో షించేవారేమోనని.. కానీ తన మనసు మాత్రం ఎప్పుడూ నటన వైపే ఉండేద‌ని వెల్లడించారు. 16 ఏళ్లు నిండేసరికే వెండితెరపై నటిగా రాణించాలనే పట్టుదలతో ఉన్నానని దీపికా తెలిపారు. కెమెరా ముందుకు రావాలనే కోరిక చిన్నతనంలోనే బలపడిందని.. ఆ రంగమే తనకు అసలైన ఆనందాన్ని ఇస్తుందని భావించారు. అయితే మోడలింగ్, ఫోటోషూట్ల కోసం తొలి అడుగు వేయడానికి దీపిక‌ ఆర్థికంగా కుటుంబం నుంచి చిన్న సాయం అవసరమైందన్నారు.

ఈ నేప‌థ్యంలో తల్లి దగ్గరికి వెళ్లి పోర్టోఫోలియో షూట్ కోసం ప‌దివేలు అప్పుగా తీసుకున్న‌ట్లు గుర్తు చేసుకున్నారు. `నేను ఒకరోజు మీకు ఈ డబ్బు తిరిగి ఇస్తాను. అంతేకాదు మిమ్మల్ని గర్వపడేలా చేస్తాను` అని తల్లితో చెప్పినట్లు దీపిక గుర్తు చేసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం కొంత కాలానికి షారుఖ్ ఖాన్ సరసన `ఓ శాంతి ఓ శాంతి` చిత్రంతో ఛాన్స్ అందుకున్నారు. అక్క‌డ నుంచి దీపిక కెరీర్ లో వెన‌క్కి తిరిగి చూద‌డ‌లేదు.

`పద్మావత్`, `పీకు`, `బాజీరావ్ మస్తానీ`, `పఠాన్`, `కల్కి 2898 ఏడీ` వంటి ఎన్నో చిత్రాల్లో న‌టించి అగ్రతారగా ఎదిగారు. ప్ర‌స్తుతం దీపిక న‌టిస్తోన్న రెండ‌వ తెలుగు సినిమా `రాకా`. ప్ర‌భాస్ స‌ర‌స‌న `స్పిరిట్` చిత్రంలో అవ‌కాశం వ‌చ్చినా వ‌దుల‌కున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో `రాకా` విజ‌యంతో త‌న‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌న్నింటికి బ‌ధులివ్వాల‌ని క‌సిగా మందుకెళ్తున్నారు.