ఆ ఇద్దరి భామల మెరుపులు వచ్చే ఏడాదే?
బాలీవుడ్ అందాలు దీపికా పదుకొణే..అలియాభట్ కెరీర్ మొదలు పెట్టిన నాటి నుంచి ఏడాదికి ఒక సినిమా చొప్పున రిలీజ్ ఉండేలా చూసుకుంటూ వస్తోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 5 Nov 2025 12:00 AM ISTబాలీవుడ్ అందాలు దీపికా పదుకొణే..అలియాభట్ కెరీర్ మొదలు పెట్టిన నాటి నుంచి ఏడాదికి ఒక సినిమా చొప్పున రిలీజ్ ఉండేలా చూసుకుంటూ వస్తోన్న సంగతి తెలిసిందే. కనీసం ఏడాదికి ఒక్క రిలీజ్ అయినా? ఉండాలి? అన్న నేపథ్యంలో గ్యాప్ లేకుండా రిలీజ్ ప్లాన్ చేసుకుని ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇప్పటి వరకూ ఇద్దరి ప్రయాణం అలాగే సాగింది. అయితే 2025 ని మాత్రం ఇద్దరు బ్యూటీలు వదిలేసారు. ఆ భామలిద్దరు నటించిన ఏ సినిమా కూడా ఈ ఏడాది రిలీజ్ అవ్వలేదు. దీపికా పదుకొణే గత ఏడాది ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల మధ్యలోనే ఉంది.
మరోసారి సెంటిమెంట్ స్టార్ తో:
`ఫైటర్` ,` కల్కి 2`, `సింగం` చిత్రాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో రెండు చిత్రాలు మంచి విజయం సాధించగా `సింగం` యావరేజ్ గా ఆడింది. అటుపై దీపిక పోస్ట్ డెలివిరీ కారణంగా సినిమాలు చేయలేకపోయింది. దీంతో గ్యాప్ తప్పలేదు. పాపాయి ఆలనా పాలనా అంటూ ఇంటికే పరిమితమైంది. కానీ వచ్చే ఏడాది మాత్రం రెండు సంచలన చిత్రాలతో ప్రేక్షకుల్లోనే ఉంటుంది. షారుక్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తోన్న `కింగ్` లో హీరోయిన్ గా నటిస్తోంది. షారుక్ అంటే దీపికకు సెంటిమెంట్ హీరో. అతడితో ఏ సినిమా చేసినా అది హిట్ అన్నట్లే.
రెండు రిలీజ్ లతో :
బిడ్డ పుట్టి నేపథ్యంలో రిలీజ్ అవుతోన్న తొలి షారుక్ సినిమా కావడంతో హిట్ ఖాయమనే అంచనాలు బలంగా ఉన్నాయి. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరెక్కుతోన్న చిత్రంలోనూ దీపిక హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. అన్ని పనులు పూర్తి చేసుకుని వచ్చే ఏడాది ముగింపులో ఈ సినిమా రిలీజ్ కానుంది. అలియాభట్ గత ఏడాది `జిగ్రా`తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాలు సాధించలేదు. దీంతో ఈ ఏడాది `ఆల్పా`తో అలరిచడం పక్కా అనుకున్నారంతా.
పెళ్లి తర్వాత భర్తతో:
కానీ ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ అవ్వడం కష్టమంటున్నారు. చిత్రీకరణ పూర్తయిన అనివార్య కారణాలతో రిలీజ్ సాధ్యపడదనే మాట బలంగా వినిపిస్తోంది. ఈనేపథ్యంలో వచ్చే ఏడాది ఆరంభంలో `ఆల్పా` రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే అలియా నటిస్తోన్న `లవ్ అండ్ వార్ కూడా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. `బ్రహ్మస్త్ర` తర్వాత హబ్బీ రణబీర్ కపూర్ తో అలియా నటిస్తోన్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
