దీపికా పదుకొనె 100 రోజుల యుద్ధం.. కండీషన్స్ అప్లై..!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకినె సౌత్ సినిమాల మీద ఆసక్తి చూపిస్తుంది. అమ్మడు ఇప్పటికే ప్రభాస్ తో కల్కి 2898 AD సినిమాలో నటించింది.
By: Ramesh Boddu | 20 Aug 2025 9:38 AM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకినె సౌత్ సినిమాల మీద ఆసక్తి చూపిస్తుంది. అమ్మడు ఇప్పటికే ప్రభాస్ తో కల్కి 2898 AD సినిమాలో నటించింది. ఆ సినిమాలో సుమతి రోల్ లో తన మార్క్ చాటింది. కల్కి 2 లో కూడా దీపిక ఉంటుందని తెలిసిందే. కల్కి తర్వాత దీపికా పదుకొనె పుష్ప రాజ్ మూవీ అదే మన అల్లు అర్జున్ 22వ సినిమాలో ప్లేస్ అయ్యింది. అట్లీతో అల్లు అర్జున్ చేస్తున్న సైఫై మూవీ లో దీపిక పదుకొనె భాగం అవుతుంది. ఆమెతో పాటు రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ కూడా ఈ సినిమాలో ఉంటారని టాక్.
అల్లు అర్జున్ 3 వేరియేషన్స్ లో..
వాళ్లందరిలో దీపిక పదుకొనేదే మెయిన్ రోల్ అని తెలుస్తుంది. మిగతా ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ ది జస్ట్ క్యామియో రోల్ లా ఉంటాయట. అట్లీ ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్నాడు. హాలీవుడ్ రేంజ్ ట్రీట్ మెంట్ తో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. అంతేకాదు సినిమాలో కనిపిస్తారట. ఐతే ఈ సినిమా కోసం దీపిక పదుకొనె బల్క్ డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
సినిమాలో ఆమె వారియర్ రోల్ లో నటిస్తుంది. ఈ సినిమాను మోషన్ కాప్చర్ టెక్నాలజీతో షూట్ చేస్తున్నారు. ఇండియన్ తెర మీద ఇలాంటి సినిమాలు చాలా అరుదు. ఐతే ఈ సినిమా కోసం దీపిక పదుకొనె 100 రోజుల పాటు డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో హండ్రెస్డ్ డేస్ అల్లు అర్జున్ సినిమాకే దీపిక పనిచేయాల్సి ఉంటుంది. తప్పకుండా దీపిక పదుకొనె ఈ సినిమాకు ప్లస్ అవుతుందని అంటున్నారు.
దీపికా 100 డేస్ డేట్స్..
దీపికా 100 డేస్ డేట్స్ కి భారీ మొత్తంలోనే ఛార్జ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీపిక పదుకొనె సౌత్ సినిమాల్లో నటించడం ఆమె ఫ్యాన్స్ కి కూడా క్రేజీగా ఉంది. ఐతే ఇప్పుడు సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ఇండియన్ సినిమాగా చూస్తున్నారు కాబట్టి తప్పకుండా బాలీవుడ్ స్టార్ హీరొయిన్స్ అంతా కూడా సౌత్ సినిమాల్లో నటించే ఛాన్స్ ఉంది. దీపికా ఇచ్చిన 100 డేస్ లో షూటింగ్ పూర్తి చేయాలి లేదంటే మళ్లీ కష్టమవుతుందని మేకర్స్ భావిస్తున్నారట.
కల్కి తర్వాత వెంటనే అల్లు అర్జున్ సినిమా ఓకే చేయడం చూస్తుంటే దీపిక తెలుగులో కూడా మరిన్ని సినిమాలు చేసే ప్లాన్ లోనే ఉందనిపిస్తుంది. మరి AA 22 సినిమాకు దీపిక ఎంత మేరకు ప్లస్ అవుతుంది అన్నది చూడాలి.
