కల్కి 2.. ఆ ఛాన్స్ ఎవరికి..?
కల్కి 1 లో ఉండే దీపికా పదుకొనె సుమతి రోల్ లో మెప్పించింది. ఐతే కల్కి 2లో ఆమెను తప్పించారు. సినిమా కోసం దీపిక డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతుందని ఆమెను సినిమా నుంచి తొలగించారు.
By: Ramesh Boddu | 15 Dec 2025 3:00 PM ISTరెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడి సినిమా సంచలన విజయం అందుకుంది. విజువల్ ఫీస్ట్ గా వచ్చిన ఈ సినిమా పార్ట్ 2 కూడా ఉంటుందన్న విషయం తెలిసిందే. సుప్రీం యాక్సిన్ వర్సెస్ భైరవ ఫైట్ కల్కి పార్ట్ 2 లో ఉండబోతుంది. ఐతే కల్కి మొదటి పార్ట్ కాదు రెండో పార్ట్ లోనే అసలు కథ ఉంటుందని తెలుస్తుంది. నాగ్ అశ్విన్ కూడా కల్కి 2 కోసం చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. ఐతే కల్కి 2 సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్నది సస్పెన్స్ గా ఉంది.
దీపిక ప్లేస్ లో ఎవరు..
కల్కి 1 లో ఉండే దీపికా పదుకొనె సుమతి రోల్ లో మెప్పించింది. ఐతే కల్కి 2లో ఆమెను తప్పించారు. సినిమా కోసం దీపిక డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతుందని ఆమెను సినిమా నుంచి తొలగించారు. ఐతే కల్కి 2లో దీపిక ప్లేస్ లో ఎవరు నటిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. కల్కి సినిమాకు బాలీవుడ్ లో మైలేజ్ వస్తుందనే దీపికా పదుకొనెని తీసుకున్నారు. కానీ కల్కి 2 లో ఆమె లేదన్న క్లారిటీ వచ్చేసింది.
కల్కి 2లో దీపిక పాత్రలో ఎవరు నటిస్తారన్నది తెలియాల్సి ఉంది. ఐతే ఈమధ్యనే వారణాసి సినిమాలో ప్రియాంకా చోప్రా నటిస్తుండగా ఆమెనే కల్కి 2లో కూడా తీసుకుంటారన్న టాక్ నడుస్తుంది. ఐతే రాజమౌళి తన హీరో హీరోయిన్స్ ని తన సినిమా ఉన్నప్పుడు వేరే ప్రాజెక్ట్ చేయనివ్వడు. ఎందుకంటే తనకు కావాల్సినప్పుడు డేట్స్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో అలా అగ్రిమెంట్ చేసుకుంటారు. ప్రియాంక చోప్రాతో కూడా అలాంటి డీల్ తోనే అప్రోచ్ అయ్యి ఉండొచ్చు.
ప్రియాంక చోప్రా హాలీవుడ్ కమిట్మెంట్స్..
అదీగాక పీసీ ఓ పక్క హాలీవుడ్ కమిట్మెంట్స్ తో బిజీగా ఉంది. వారణాసి సినిమాకే ఆమె టైం తీసుకుని డేట్స్ ఇచ్చింది ఈ టైం లో కల్కి 2కి అయితే చాలా కష్టమే అని తెలుస్తుంది. ఇప్పుడు కల్కి 2 సినిమాలో దీపిక ప్లేస్ లో ప్రియాంక చోప్రా అన్నది అసలు ఛాన్స్ లేదని తెలుస్తుంది. ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అయిన కల్కి 2లో హీరోయిన్ పై జరుగుతున్న ఈ డిస్కషన్ మేకర్స్ ని కూడా కన్ ఫ్యూజన్ లో పడేస్తుంది.
దీపిక బదులు ఆప్షన్ లో ఉన్నది ఎవరు.. కల్కి 2లో ఎవరిని తీసుకోవాలని చూస్తున్నారు అన్నది తెలియాల్సి ఉంది. కల్కి 2 నుంచి ఎగ్జిట్ అయిన దీపిక మరో సౌత్ సినిమా అల్లు అర్జున్ 22 సినిమాలో ఛాన్స్ పట్టేసింది. సో కల్కి 2 లో మిస్సైన దీపిక ఫ్యాన్స్ అల్లు అర్జున్ సినిమాతో ఖుషి అయ్యే ఛాన్స్ ఉంటుంది.
