దీపికా కి అంతటి అర్హత లేదు...!
ప్రస్తుతానికి ఈ సినిమా చర్చల దశలో ఉంది. విక్కీ కౌశల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ చర్చల దశలో ఉంది.
By: Ramesh Palla | 9 Dec 2025 12:01 PM ISTఛావా సినిమాతో బాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న హీరో విక్కీ కౌశల్. ప్రస్తుతం ఈ యువ హీరో నటించబోతున్న సినిమాలపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు విక్కీ కౌశల్ ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు. మరోసారి ఛావా వంటి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం కోసం అలాంటి స్ట్రాంగ్ పాత్రలను విక్కీ కౌశల్ వెతికి మరీ పట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా మహావతార్ అనే సినిమాలో పరశురాముడు పాత్రను చేసేందుకు గాను విక్కీ కౌశల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటూ వార్తలు వస్తున్నాయి. మాడక్ ఫిలిమ్స్ బ్యానర్లో అమర్ కౌశిక్ దర్శకత్వంలో రూపొందబోతున్న మహావతార్ సినిమాలో విక్కీ కౌశల్ పోషించబోతున్న పరశురాముడి పాత్రతో నట విశ్వరూపం చూస్తారని బాలీవుడ్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. అమర్ కౌశిక్ విభిన్నమైన స్క్రీన్ ప్లే తో మహావతార్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడట.
విక్కీ కౌశల్ హీరోగా...
ప్రస్తుతానికి ఈ సినిమా చర్చల దశలో ఉంది. విక్కీ కౌశల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ చర్చల దశలో ఉంది. మరోవైపు నటీనటుల ఎంపిక కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని స్వయంగా మాడక్ ఫిలిం సంస్థ ప్రతినిధులు అంటున్నారు. వచ్చే ఏడాది సినిమా పూర్తిస్థాయిలో పట్టాలక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ లోపు హీరోయిన్ విషయమై ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు. పరశురాముడి భార్య ధరణి పాత్రను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తో చేయించేందుకుగాను ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకోసం ఇప్పటికే పలువురి హీరోయిన్ల పేర్లు పరిశీలించారని చివరకు దీపిక పదుకొనేను ఎంపిక చేశారు అంటూ పుకార్ల షికార్లు చేస్తున్నాయి. విక్కీ కౌశల్ దీపిక మధ్య ఉన్న సంబంధం కారణంగా ఈ సినిమా ఎంత వరకు పట్టాలెక్కుతుంది. వీరిద్దరూ కలిసి నటించడం ఎంతవరకు సాధ్యమవుతుంది అంటూ బాలీవుడ్ వర్గాల వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీపికతో కలిసి నటించినందుకు విక్కీ కౌశల్ కి ఆయన భార్య కత్రినా కైఫ్ నుండి గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉందా అనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.
పరశురాముడు కథాంశం తో సినిమా...
వ్యక్తిగత విషయాలను పక్కన పెడితే దీపిక కచ్చితంగా ధరణి పాత్రకు సెట్ అవుతుందా అంటే అనుమానమే అని చాలా మంది నిర్మొహమాటంగా మాట్లాడేస్తున్నారు. ఆమె తీరుకి ధరణి పాత్ర ఏమాత్రం సెట్ కాదు అనేది వారి అభిప్రాయం. ఎందుకంటే ధరణి అంటే లక్ష్మీదేవి అవతారంగా పురాణాల్లో ఉంది. పరశురాముడి భార్య ధరణి అంటే ఒక దేవత పాత్ర.. అలాంటి దేవత పాత్రను దీపిక చేయడాన్ని కొందరు వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఆమె గతంలో తీసుకున్న నిర్ణయాలు, అలాగే ఆమె ఇంతకు ముందు చేసిన పాత్రలు ముందు పెట్టి చాలామంది సినిమాను అందులో దీపిక పోషించిన పాత్ర విషయంలో వివాదం చెలరేగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే దర్శకుడు అంతటి సాహసం చేయకపోవచ్చు అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి దీపిక ఒకవేళ పరశురాముడి భార్య ధరణి పాత్రలో విక్కీ కౌశల్ కి జోడిగా నటిస్తే ఖచ్చితంగా బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం కావడం గ్యారెంటీ.. అంతేకాకుండా సినిమా విడుదల సమయంలో ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలవడం కూడా గ్యారెంటీ అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
హీరోయిన్ గా దీపిక...
ఈ మధ్యకాలంలో దీపిక పలు వివాదాల కారణంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సినిమాలు చేసి దేశవ్యాప్తంగా స్టార్ హీరోయిన్గా నిలిచిన ఈమె హాలీవుడ్ నుండి కూడా అప్పుడప్పుడు ఆఫర్లు దక్కించుకుంటూ వస్తోంది. ఆ మధ్య ప్రభాస్ కి జోడిగా స్పిరిట్ సినిమాలో ఎంపిక అయిన ఈమె కొన్ని కారణాల వల్ల తప్పించబడింది అనే విషయం తెలిసిందే. పని గంటల విషయంలో ఈమె చాలా సీరియస్గా ఆందోళనను కొనసాగిస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇవన్నీ కారణాల వల్ల ఆమెకు వస్తున్న ఆఫర్స్ తగ్గుతున్నాయి, అదే సమయంలో ఆమె క్రేజ్ గతంతో పోలిస్తే తగ్గింది అంటూ కొందరు మాట్లాడుతున్నారు. కనుక విక్కీ కౌశల్ సినిమాలో ఈమె కాకుండా మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుంది అని చాలామంది అనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన చర్చలు మాత్రమే జరుగుతున్నాయి. నటీనటుల ఎంపిక విషయంలో ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. కనుక దర్శకుడు హీరోయిన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది మనకు మరి కొన్నాళ్ల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
