Begin typing your search above and press return to search.

సాయి ప‌ల్ల‌విని సీత‌మ్మ పాత్ర‌లో ఊహించుకోలేక‌పోతున్న మ‌రో సీత‌మ్మ‌!

టెలివిజన్ చరిత్రలో రామాయణ సీరియల్‌తో సీతాదేవిగా దేశవ్యాప్తంగా అపారమైన కీర్తిని సంపాదించిన సీనియర్ నటి దీపికా చిఖ్లియా సాయిపల్లవి ఎంపికపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు.

By:  Srikanth Kontham   |   23 July 2026 1:15 AM IST
సాయి ప‌ల్ల‌విని  సీత‌మ్మ పాత్ర‌లో ఊహించుకోలేక‌పోతున్న మ‌రో సీత‌మ్మ‌!
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం `రామాయణం`పై అంచనాలు రోజురోజుకూ తారాస్థాయికి చేరుతున్నాయి. రాముడి పాత్ర‌లో ర‌ణ‌బీర్ క‌పూర్..సీత పాత్ర‌లో సాయి ప‌ల్ల‌వి జంట‌గా ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చిత్రాన్ని నితీష్ తివారీ తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ పాత్ర‌ల‌కు సంబంధిఆంచి ఫ‌స్టు లుక్ పోస్ట‌ర్స్ ...గ్లింప్స్ ప్రేక్ష‌కుల‌ముందుకొచ్చాయి. వాటికి ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే సాయిప‌ల్ల‌వి సీత పాత్ర పోషించ‌డం విష‌యంలో సీరియ‌ల్ సీత‌మ్మ ఎంత మాత్రం సంతృప్తిగా క‌నిపించ‌లేదు.

టెలివిజన్ చరిత్రలో రామాయణ సీరియల్‌తో సీతాదేవిగా దేశవ్యాప్తంగా అపారమైన కీర్తిని సంపాదించిన సీనియర్ నటి దీపికా చిఖ్లియా సాయిపల్లవి ఎంపికపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. సాయిపల్లవి నటిగా అద్భుతమైన ప్రతిభావంతురాలనడంలో ఎలాంటి సందేహం లేదని కొనియాడారు. ఆమె నటనపై తనకు పూర్తి గౌరవం ఉందని.. తెరపై ఆమె చూపించే సహజమైన అభినయం అందరినీ ఆకట్టుకుం టుందని దీపికా ప్రశంసించారు. అయితే సాయిపల్లవి ఎంత గొప్ప న‌టి అయినా? పౌరాణిక ఇతిహాసంలో సీత పాత్రకు ఆమె రూపం ఎంతవరకు సరిపోతుందనే విషయంలో తనకు కొన్ని సందేహాలున్నాయన్నారు.

సాంప్రదాయబద్ధమైన సీతాదేవి రూపంలో సాయిపల్లవిని తెరపై చూడటం ఎలా ఉంటుందో తాను ఇంకా ఊహించుకోలేకపోతున్నానని పేర్కొన్నారు. పౌరాణిక పాత్రల విషయంలో నటీనటుల అభినయంతో పాటు వారి బాడీ లాంగ్వేజ్ .. గెటప్ అత్యంత కీలకమన్నారు. ఐకానిక్ పాత్రను పోషించిన సీనియర్ నటి నుంచి ఇలాంటి కామెంట్స్ రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సాయిపల్లవి వంటి సహజ నటిని పౌరాణిక పాత్రలో చూడాలనే ఆత్రుత అభిమానుల్లో ఉంటే? మరోవైపు ఇలాంటి విశ్లేషణలు ప్రాజెక్ట్‌పై మరింత చర్చ జరిగేలా చేస్తున్నాయి.

దర్శకుడు నితీశ్ తివారీ ఈ పాత్రను ఎంత పర్ఫెక్ట్‌గా మలిచారనేది సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తుంది. భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎంతో మంది న‌టీమ‌ణులు...మ‌రెంతో మంది గొప్ప హీరోయిన్లు ఉన్నా? నితీష్ తివారీ వాళ్లంద‌ర్నీ ప‌క్క‌న‌బెట్టి సాయిప‌ల్ల‌ని సీత పాత్ర‌కు ఎంపిక చేసారంటే? అది చిన్న విష‌యం కాదు. కాస్టింగ్ లో నితీష్ తీవారీ ఏనాడు ఫెయిల్ అవ్వ‌లేదు. పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టు ప‌ర్పెక్ట్ న‌టీన‌టుల్ని ఎంపిక చేసి స‌క్సెస అయ్యారు. అలాంటి ద‌ర్శ‌కుడి అభిరుచిపైనే సీనియ‌ర్ సీత‌మ్మ సందేహం వ్య‌క్తం చేయ‌డం ఆస‌క్తిక‌రం. మ‌రి ఆమె డౌట్ నిజ‌మ‌వుతుందా? నితీష్ తివారీ ప‌ర్పెక్ట్ అనిపిస్తారా? అన్న‌ది సినిమా రిలీజ్ త‌ర్వాత డిసైడ్ అవుతుంది.