'గర్ల్‌ఫ్రెండ్' ఎంగేజ్మెంట్ గురించి నాకు అనవసరం..!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు వివాహ నిశ్చితార్థం అయింది అని జాతీయ మీడియాలోనూ వార్తలు వచ్చాయి.
By: Ramesh Palla | 21 Nov 2025 4:42 PM ISTరౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు వివాహ నిశ్చితార్థం అయింది అని జాతీయ మీడియాలోనూ వార్తలు వచ్చాయి. వచ్చే ఏడాది ఆరంభంలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అని, ఇద్దరూ ఎంగేజ్‌మెంట్ రింగ్స్ పెట్టుకుని తిరుగుతున్నారు అని కూడా ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య రష్మిక మందన్న ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో చాలా మంది విజయ్ దేవరకొండ గురించి ప్రశ్నించిన సమయంలో ఆమె నవ్వుతూ, సిగ్గుపడుతూ మెలికలు తిరగడంతో మొత్తం విషయం అర్థం అయింది. ఇద్దరి మధ్య ప్రేమ మాత్రమే కాకుండా అంతకు మించి ఉంది, అది నెక్ట్స్ లెవల్‌కి వెళ్లబోతుంది అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మధ్య కాలంలో రష్మిక, విజయ్ దేవరకొండ తరచు కలిసి కనిపించడం ద్వారా ఇద్దరి మధ్య రిలేషన్ పై క్లారిటీ వచ్చింది అనే విషయం తెల్సిందే.
ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాతో రష్మిక మందన్న...
తాజాగా రష్మిక మందన్న 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమాలో హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే. సినిమాకు కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో మంచి ఫలితం రాలేదు. కానీ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక మంచి ప్రయత్నం, ఒక అమ్మాయి జీవితంలో ఎదుర్కొంటున్న పరిస్థితులను గురించి చక్కగా చూపించారు అంటూ చాలా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. చూసిన కొందరు ప్రేక్షకులు కూడా పాజిటివ్‌గా రెస్పాన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తే హీరోగా దీక్షిత్ శెట్టి నటించిన విషయం తెల్సిందే. అతడి నటన సైతం ఆకట్టుకుంది. అతడి యొక్క చూపులతో పాటు, అతడి యొక్క యాక్టింగ్ విషయమై చర్చ జరిగింది. ఇప్పుడు అతడు బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో దీక్షిత్ పాల్గొంటున్నాడు.
హీరో దీక్షిత్ శెట్టి ఇంటర్వ్యూలో...
బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి సినిమా ప్రమోషన్‌లో భాగంగా దీక్షిత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్మిక మందన్న గురించి స్పందించాడు. ఆసమయంలోనే ఇంటర్వ్యూ హోస్ట్ అందరిలో ఉన్న ప్రశ్న అయిన రష్మిక మందన్న ఎంగేజ్‌మెంట్, ఆమె ప్రేమ వ్యవహారం గురించి ప్రశ్నించారు. దాంతో దీక్షిత్ ఆ సమయంలో సమయస్ఫూర్తితో స్పందించాడు. రష్మిక మంచి నటి, ఆమెతో సినిమా షూటింగ్ సమయంలో కేవలం సినిమాల గురించి మాత్రమే మాట్లాడటం జరిగేది. ఎప్పుడు కూడా ఆమె యొక్క పర్సనల్ విషయాలను గురించి అడగలేదు. ఎప్పుడూ నేను ఆమె ప్రేమ వ్యవహారం గురించి ప్రశ్నించలేదు. కనుక నాతో గర్ల్‌ఫ్రెండ్ గా నటించినప్పటికీ ఆమె ప్రేమ వ్యవహారం గురించి తెలియదు అన్నాడు. అయినా అలాంటి విషయాలు నాకు అనవసరం అన్నట్లుగా దీక్షిత్ చాలా సైలెంట్ గా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నాడు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి...
రష్మిక మందన్న యానిమల్, పుష్ప, ఛావా సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఈ ఏడాది లో వచ్చిన సినిమాలతో ఆకట్టుకుంది. సల్మాన్ ఖాన్ తో చేసిన సికిందర్ సినిమా తీవ్రంగా నిరాశ పరిచిన కూడా ఆ సినిమా రష్మిక ఆఫర్లను తగ్గించలేక పోయింది. మొత్తానికి హీరోయిన్‌గా రష్మిక మందన్న బాలీవుడ్‌తో పాటు, అన్ని భాషల ఇండస్ట్రీలోనూ బిజీ బిజీగా సినిమాలు చేస్తోంది. ఒక వైపు పెద్ద హీరోలతో, వందల కోట్ల బడ్జెట్ సినిమాలు చేస్తూనే మరో వైపు నటిగా తనను తాను నిరూపించుకోవడం కోసం ఇలా గర్ల్‌ఫ్రెండ్ తరహా సినిమాలు చేస్తోంది. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో రష్మిక సినిమా ఎంపిక కాస్త తగ్గించిందనే వార్తలు వస్తున్నాయి. అందుకే ఈమె చేతిలో కొత్త సినిమాలు ఎక్కువ లేవు. పెళ్లి తర్వాత చిన్న గ్యాప్ తీసుకుని రష్మిక మరిన్ని సినిమాలు చేస్తుందేమో చూడాలి.
