Begin typing your search above and press return to search.

కడుపులో బిడ్డ.. కెమెరా ముందు యాక్షన్.. మీ నిబద్ధతకు దాసోహం!

సినిమా గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్ల జీవితం బయటకు కనిపించినంత సరదాగా ఏమీ ఉండదు.

By:  Madhu Reddy   |   12 Feb 2026 1:00 PM IST
కడుపులో బిడ్డ.. కెమెరా ముందు యాక్షన్.. మీ నిబద్ధతకు దాసోహం!
X

సినిమా గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్ల జీవితం బయటకు కనిపించినంత సరదాగా ఏమీ ఉండదు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో శారీరక ఇబ్బందులను తట్టుకుంటూ, ప్రాణ సమానమైన బిడ్డను కడుపులో మోస్తూ కెమెరా ముందుకు రావడం మామూలు విషయం కాదు. మండుతున్న ఎండలు, భారీ సెట్లు, ఎమోషనల్ సీన్లు.. వీటన్నింటినీ అధిగమించి షూటింగ్‌లు పూర్తి చేసిన మన తారల నిబద్ధత నిజంగా గ్రేట్. నేటి తరం స్టార్ల నుంచి అలనాటి అందాల తారల వరకు ఈ ప్రయాణంలో వారు చూపిన ధైర్యం అందరికీ స్ఫూర్తిదాయకం. వివరాలు మీకోసం..

నేటి తరం ధీరవనితలు:

ప్రస్తుత తరం హీరోయిన్లు ప్రెగ్నెన్సీని కెరీర్‌కు అడ్డంకిగా భావించకుండా ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. ఆలియా భట్ తన హాలీవుడ్ డెబ్యూ 'హార్ట్ ఆఫ్ స్టోన్' కోసం గర్భవతిగా ఉన్నప్పుడే రిస్కీ యాక్షన్ సీన్లలో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక దీపికా పదుకొణె 'కల్కి 2898 AD'లో గర్భవతిగా నటిస్తున్నప్పుడే గర్భవతి అయినా సినిమా లో నటించారు. ఇక అంతేకాక 'సింగమ్ ఎగైన్' షూటింగ్‌లో కూడా ఆమె అదే పట్టుదలతో పాల్గొన్నారు. అటు యంగ్ హీరోయిన్ యామీ గౌతమ్ 'ఆర్టికల్ 370' షూటింగ్ సమయంలో ప్రెగ్నెంట్ అని తెలిసినా, ఏమాత్రం అధైర్యపడకుండా షూటింగ్ పూర్తి చేసి తన అంకితభావాన్ని చాటుకున్నారు.

టాలీవుడ్‌లోనూ అదే బాట:

టాలీవుడ్ అందాల నటి లావణ్య త్రిపాఠి కూడా ఈ జాబితాలో చేరారు. పెళ్లి తర్వాత తన కెరీర్‌ను అద్భుతంగా కొనసాగిస్తున్న లావణ్య, 'సతీ లీలావతి' అనే ఫీల్ గుడ్ ఎమోషనల్ చిత్రం షూటింగ్ సమయంలో గర్భవతిగా వుండి షూటింగ్ పూర్తి చేసారు. దేవ్ మోహన్ సరసన నటిస్తున్న ఈ సినిమా కోసం ఆమె తన ప్రెగ్నెన్సీని పక్కన పెట్టి వృత్తికి న్యాయం చేస్తున్నారు. పెళ్లి, పిల్లలు అనేవి కెరీర్‌కు బ్రేక్ కాదని, పక్కా ప్లానింగ్‌తో రెండింటినీ బ్యాలెన్స్ చేయవచ్చని లావణ్య వంటి హీరోయిన్లు నిరూపిస్తున్నారు. నిర్మాతలకు, దర్శకులకు ఇబ్బంది కలగకుండా షెడ్యూల్స్ పూర్తి చేయడంలో వారు చూపే శ్రద్ధ అభినందనీయం.

అలనాటి తారల అంకితభావం:

ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు, సీనియర్ నటీమణులు కూడా ఎంతో కష్టపడి షూటింగ్‌లు పూర్తి చేశారు. కాజోల్ 'వి ఆర్ ఫ్యామిలీ' షూటింగ్ సమయంలో తన రెండో బిడ్డను మోస్తూనే సినిమా పూర్తి చేశారు. అంతకుముందు 'కభీ ఖుషీ కభీ ఘమ్' సమయంలో అబార్షన్ వంటి విషాదాన్ని ఎదుర్కొన్నా, ఆమె వృత్తి పట్ల వెనకడుగు వేయలేదు. అలాగే జూహీ చావ్లా 'ఏక్ రిష్తా' సమయంలో గర్భవతి అని తెలిసినప్పుడు అమితాబ్ బచ్చన్ వంటి సహ నటులు, దర్శకులు ఆమెకు అండగా నిలిచారు. బేబీ బంప్ కనిపించక ముందే షెడ్యూల్స్ సర్దుబాటు చేసి ఆమెకు మద్దతుగా నిలవడం సినీ పరిశ్రమలోని మానవత్వానికి నిదర్శనం.