Begin typing your search above and press return to search.

డిసెంబర్: విడుదలకు 21 చిత్రాలు.. అందరి దృష్టి వాటిపైనే!

ఈ ఇయర్ ఎండింగ్ లో చాలా సినిమాలు విడుదల కాబోతున్నాయి. డిసెంబర్ నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

By:  Madhu Reddy   |   3 Dec 2025 12:08 PM IST
డిసెంబర్: విడుదలకు 21 చిత్రాలు.. అందరి దృష్టి వాటిపైనే!
X

ఈ ఇయర్ ఎండింగ్ లో చాలా సినిమాలు విడుదల కాబోతున్నాయి. డిసెంబర్ నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అఖండ-2 మొదలు అవతార్ 3 వరకు ఎన్నో సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరి ఇంతకీ డిసెంబర్లో ఏ ఏ సినిమాలు ఎప్పుడు విడుదల కాబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం.

అఖండ-2:

బోయపాటి శ్రీను డైరెక్షన్లో 2022లో వచ్చిన అఖండ మూవీకి సీక్వెల్ గా అఖండ -2 తెరకెక్కింది. బాలకృష్ణ, సంయుక్త మీనన్ ల కాంబోలో వస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న విడుదల కాబోతోంది.

ధురంధర్:

ఆదిత్య ధర్ డైరెక్షన్లో రణ్ వీర్ సింగ్ హీరోగా..సంజయ్ దత్, మాధవన్,అర్జున్ రాంపాల్ కీలకపాత్రలు పోషించిన దురంధర్ మూవీ డిసెంబర్ 5న విడుదల కాబోతోంది.

లాక్ డౌన్:

ఏ ఆర్ జీవా డైరెక్షన్లో వచ్చిన లాక్ డౌన్ మూవీలో అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ పోషించింది. ఈ సినిమా కూడా డిసెంబర్ 5నే విడుదల కాబోతోంది.

వా వాతియార్:

కోలీవుడ్ నటుడు కార్తీ హీరోగా.. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన వా వాతియార్ మూవీ కూడా డిసెంబర్ 5న విడుదల కాబోతోంది.ఈ సినిమాకి నలన్ కుమార స్వామి దర్శకత్వం వహించారు.

కలమకవల్:

మలయాళ స్టార్ మమ్ముట్టి నటించిన క్రైమ్ థ్రిల్లర్ కలమకవల్.. జితిన్ కె జోస్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ డిసెంబర్ 5న విడుదల కాబోతోంది.

మిస్స్టీరియస్:

మహి కోమటిరెడ్డి డైరెక్షన్ లో వస్తున్న మిస్స్టీరియస్ మూవీ వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 12న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో రోహిత్, మేఘన రాజ్పుత్, రియా కపూర్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సఃకుటుంబానాం:

ఉదయ్ శర్మ డైరెక్షన్లో రామ్ కిరణ్,మేఘ ఆకాష్ లు హీరో హీరోయిన్లుగా..బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్ లు కీరోల్స్ పోషిస్తున్న సఃకుటుంబానాం మూవీ డిసెంబర్ 12న విడుదల కాబోతోంది.

మోగ్లీ:

కలర్ ఫోటో ఫేమ్ డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వంలో యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా.. సాక్షి సాగర్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 12న విడుదల కాబోతోంది.

ప్రభుత్వ సారాయి దుకాణం:

నరసింహ నంది డైరెక్షన్లో విక్రమ్ జిత్, సదన్ హాసన్, వినయ్ బాబు,నరేష్ రాజు లు హీరోలుగా.. మోహన సిద్ధి,శ్రీలు దాసరి, అదితి మైకేల్ లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ డిసెంబర్ 12న విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది.

LIK:

నయనతార భర్త విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో ప్రదీప్ రంగనాథన్ హీరోగా .. కృతి శెట్టి హీరోయిన్గా తెరకెక్కిన ఎల్ఐకే మూవీ డిసెంబర్ 18న విడుదల కాబోతోంది.

బైకర్:

శర్వానంద్ హీరోగా నటించిన బైకర్ మూవీ డిసెంబర్ 6న విడుదల కావల్సి ఉండగా.. మేకర్స్ వాయిదా వేశారు. అయితే ఈ సినిమాని డిసెంబర్ 19న విడుదల చేస్తున్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

జగన్నాథ్:

బాహుబలి ప్రభాకర్ డైరెక్షన్లో హరత్ సంతోష్,నిత్య, పీలం భరత్ లు ప్రధాన పాత్రలు పోషించిన జగన్నాథ్ మూవీ డిసెంబర్ 19న విడుదల కాబోతోంది.

అవతార్-3:

జేమ్స్ కామెరూన్ డైరెక్షన్లో వస్తున్న అవతార్ :3 ఫైర్ అండ్ యాష్ డిసెంబర్ 19న మన ముందుకు రాబోతోంది.

దేవగుడి:

బెల్లం రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో అభినవ్ శౌర్య,అనుశ్రీ, నరసింహ ప్రధాన పాత్రలో నటిస్తున్న దేవగుడి మూవీ కూడా డిసెంబర్ 19న విడుదల కాబోతోంది.

యుఫోరియా:

గుణశేఖర్ దర్శకత్వం వహించిన యుఫోరియా మూవీ డిసెంబర్ 25న విడుదల కాబోతోంది. భూమిక చావ్లా,సారా అర్జున్,గౌతమ్ మీనన్, నాజర్ లు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఛాంపియన్:

నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక హీరోగా.. అనస్వర రాజన్ హీరోయిన్ గా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో వచ్చిన ఛాంపియన్ మూవీ డిసెంబర్ 25న విడుదల కాబోతోంది.

శంబాల :

ఆది సాయికుమార్ హీరోగా.. అర్చన అయ్యర్, స్వాసిక విజయ్, మధునందన్ కీ రోల్స్ పోషించిన శంబాల మూవీకి ఉగంధర్ ముని దర్శకత్వం వహించారు.ఈ సినిమా కూడా డిసెంబర్ 25నే విడుదల కాబోతోంది.

వృషభ:

మోహన్ లాల్ హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా మూవీ వృషభ.. నందకిషోర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ డిసెంబర్ 25న విడుదల కాబోతోంది.

పతంగ్:

ప్రణీత్ ప్రతిపాటి దర్శకత్వంలో వంశీ పూజిత్, ప్రీతి పగడాల హీరో హీరోయిన్లుగా నటించిన పతంగ్ మూవీ డిసెంబర్ 25న విడుదల కాబోతోంది.

దండోరా:

మురళి కాంత్ డైరెక్షన్లో నటుడు శివాజీ,బిందు మాధవి, నవదీప్ , నందు, రవికృష్ణ, మౌనిక రెడ్డి, రాధ్యాలు కీలక పాత్రలు పోషించిన దండోరా మూవీ కూడా డిసెంబర్ 25న విడుదల కాబోతోంది.

ఇక్కీస్:

అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్యానంద డైరెక్షన్లో వచ్చిన ఇక్కీస్ మూవీ కూడా డిసెంబర్ 25న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో రీసెంట్ గా మరణించిన ధర్మేంద్ర కూడా కీరోల్ పోషించారు.

ఇలా మొత్తంగా ఈ ఏడాది చివర్లో భారీగా సినిమాలు విడుదల కాబోతున్నాయి.మరి ఈ సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకులను అలరించి ఇయర్ ఎండింగ్లో విజేతగా నిలుస్తుందో చూడాలి.