డిసెంబర్ లో డబ్బింగ్ దాడి!
సూర్య హీరోగా నటిస్తోన్న `కరిప్పు` భారీ అంచనాల మధ్య డిసెంబర్ లోనే రిలీజ్ అవుతుంది. వరుస పరాజయాల నేపత్యంలో సూర్య నుంచి రిలీజ్ అవుతున్న చిత్రమిది.
By: Srikanth Kontham | 22 Oct 2025 3:00 AM ISTతెలుగు సినిమా రిలీజ్ లకు కొన్ని ప్రత్యేక సీజన్లు ఉన్నప్పటికీ వాటిని స్టార్స్ అంతగా వినియోగించుకోవడంలేదు. వెసులుబాటును బట్టి రిలీజ్ లు జరుగుతున్నాయి. దీపావళి సీజన్ ముగిసింది. తదుపరి రిలీజ్ లు డిసెంబర్ లో కనిపిస్తున్నాయి. వీటితోపాటు డబ్బింగ్ చిత్రాలు కూడా రేసులో ఉన్నాయి. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తోన్న `అఖండ 2` భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది. అలాగే గుణశేఖర్ స్వీయా దర్శకత్వంలో నిర్మిస్తోన్న `యూఫోరియా` కూడా అదే నెలలో రిలీజ్ అవుతుంది.
ఇద్దరు రోషన్ లు పోటీ బరిలో:
ఇంకా యంగ్ హీరో అడవి శేష్ నటిస్తోన్న `డెకాయిట్` కూడా డిసెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకొస్తుంది. దాంతో పాటు ఆది సాయి కుమార్ నటిస్తోన్న `షంబాల` కూడా అదే సీజన్ టార్గెట్ గా రిలీజ్ అవుతుంది. రోషన్ మేకా నటిస్తోన్న `ఛాంపియన్`, అల్లరి నరేష్ నటిస్తోన్న `అల్కహాల్`, రోషన్ కనకాల నటిస్తోన్న `మోగ్లీ` కూడా డిసెంబర్ లోనే రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు, మరికొన్ని తెలుగు స్ట్రెయిట్ చిత్రాలు డిసెంబర్ టార్గెట్ గా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. అయితే వీటికి పోటీగా కొన్ని తమిళ సినిమాలు భారీ ఎత్తున రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.
అన్నదమ్ములిద్దరు ఒకే సారి:
సూర్య హీరోగా నటిస్తోన్న `కరిప్పు` భారీ అంచనాల మధ్య డిసెంబర్ లోనే రిలీజ్ అవుతుంది. వరుస పరాజయాల నేపత్యంలో సూర్య నుంచి రిలీజ్ అవుతున్న చిత్రమిది. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలన్నది సూర్య ప్లాన్ . దీనిలో భాగంగా పెద్ద ఎత్తున రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. వీలైనన్ని థియేటర్లు `కరిప్పు` ఆక్యుపై చేయాలని చూస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందీ చిత్రం. అలాగే కార్తీ నటిస్తోన్న `వా వాతియార్` కూడా డిసెంబర్ టార్గెట్ గా రిలీజ్ అవుతుంది. `సత్యం సుందరం` తర్వాత కార్తీ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.
యంగ్ హీరో తో గట్టి పోటీ:
అలాగే యంగ్ హీరో ప్రదీప్ రంగనాధ్ నటిస్తోన్న `ఎల్ ఐసీ` కూడా డిసెంబర్ లోనే రిలీజ్ అవుతుంది. యూత్ పుల్ ఎంటర్ టైనర్ ఇది. యువతలో క్రేజీ స్టార్ గా ప్రదీప్ వెలిగిపోతున్న సమయం ఇది. ఈ నేపథ్యంలో `ఎల్ ఐసీ` ని నయనతార అండ్ కో భారీ ఎత్తున తెలుగు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. రవి మోహన్ నటిస్తోన్న చిత్రం కూడా అదే నెలలో రిలీజ్ కు వస్తుంది. తమిళ్ నుంచి రిలీజ్ అవుతున్న ఈ నాలుగు సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగు సినిమాలకు ఓ మూడు సినిమాలు ప్రముఖంగా గట్టి పోటినిస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కంటెంట్ ఉంటే కటౌట్ తో పని లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తోన్న నేపథ్యంలో పెద్ద పెద్ద కటౌట్లు ఉన్న భయపడాల్సిన సన్నివేశం ఎదురవుతోంది.
