Begin typing your search above and press return to search.

డిసెంబర్ - 2025.. బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడబోతున్న చిత్రాలివే !

ఈ ఏడాది ఎండింగ్ లో అంటే డిసెంబర్ నెలలో చాలా సినిమాలు విడుదల కాబోతున్నాయి.. వివిధ భాషల్లో దాదాపు 15 సినిమాలు విడుదల కాబోతున్నాయి.

By:  Madhu Reddy   |   26 Oct 2025 3:06 PM IST
డిసెంబర్ - 2025.. బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడబోతున్న చిత్రాలివే !
X

ఈ ఏడాది ఎండింగ్ లో అంటే డిసెంబర్ నెలలో చాలా సినిమాలు విడుదల కాబోతున్నాయి.. వివిధ భాషల్లో దాదాపు 15 సినిమాలు విడుదల కాబోతున్నాయి. అలా ఒకే నెలలో ఏకంగా 15 సినిమాలు విడుదల కాబోతున్నాయంటే ఏ సినిమా హిట్ అవుతుంది.. ఏ సినిమా ఫ్లాప్ అవుతుంది అని నిర్మాతల్లో భయం పట్టుకుంటుంది. ఇక డిసెంబర్ నెల అంటే చాలామంది దర్శక నిర్మాతలు క్రిస్మస్ పండగని టార్గెట్ గా పెట్టుకుంటారు. అలా ఈ ఏడాది క్రిస్మస్ పండుగ సందర్భంగా ఏకంగా 15 సినిమాలు విడుదల కాబోతున్నాయి.. మరి డిసెంబర్ లో విడుదల కాబోతున్న సినిమాలు ఏంటి.. ? ఎప్పుడెప్పుడు విడుదల కాబోతున్నాయి? అనేది ఇప్పుడు చూద్దాం..

ఈ ఏడాది డిసెంబర్లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల నుండి చాలా సినిమాలు విడుదల కాబోతున్నాయి. ప్రత్యేకించి తెలుగు విషయానికి వస్తే.. ఈ ఏడాది చివర్లో విడుదల కాబోయే అతిపెద్ద మూవీ అఖండ -2 అని చెప్పుకోవచ్చు. బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న తాజా మూవీ అఖండ -2. ఈ సినిమా 2023లో వచ్చిన అఖండ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ డిసెంబర్ 5న విడుదల కాబోతోంది.అలా డిసెంబర్లో నందమూరి ఫ్యాన్స్ కి అఖండ-2 మూవీ పూనకాలు తెప్పించబోతుంది.

అదే రోజు అంటే డిసెంబర్ 5న బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ నటించిన 'దురంధర్' మూవీ కూడా విడుదల కాబోతోంది.. అలాగే తమిళంలో కార్తీ హీరోగా నటిస్తున్న వా వాతియర్ మూవీ కూడా డిసెంబర్ 5నే విడుదల కాబోతుంది. డిసెంబర్ 5న ఏకంగా తమిళ, తెలుగు, హిందీ నుండీ మూడు సినిమాలు విడుదలకాబోతున్నాయి.

డిసెంబర్ 12న సుమ రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల నటించిన మోగ్లీ మూవీ విడుదల కాబోతుంది.ఈ సినిమాకి కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు.

డిసెంబర్ 18న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన టైసన్ నాయుడు మూవీ విడుదల కాబోతుంది. అలాగే అదే రోజు నయనతార భర్త విజ్ఞేశ్ శివన్ డైరెక్షన్ చేసిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(LIC) అనే తమిళ చిత్రం కూడా విడుదల కాబోతోంది.ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించారు. కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అలా ఒకే రోజు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ లు తలపడబోతున్నారు.

ఒక రోజు తేడాతో అనగా డిసెంబర్ 19న హాలీవుడ్ మూవీ అవతార్: ఫైర్ అండ్ యాష్ విడుదల కాబోతోంది..

అలాగే డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ సందర్భంగా ఏకంగా తొమ్మిది సినిమాలు విడుదల కాబోతున్నాయి. అదే రోజు విశ్వక్ సేన్,రోషన్ శ్రీకాంత్,ఆది,కిచ్చా సుదీప్,అలియా భట్ లు బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నారు.

అలా డిసెంబర్ 25న విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఫంకీ మూవీ విడుదల కాబోతోంది. అలాగే ఆది పినిశెట్టి నటించిన శంభాల మూవీ కూడా అదే రోజు విడుదల కాబోతోంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన స్పోర్ట్స్ డ్రామా జానర్లో తెరకెక్కిన ఛాంపియన్ మూవీ కూడా డిసెంబర్ 25నే విడుదల కాబోతోంది.. అలాగే గుణశేఖర్ డైరెక్షన్లో వస్తున్న ఆనందం మూవీ కూడా అదే రోజు విడుదల కాబోతోంది. స్పోర్ట్స్ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న పతంగ్ మూవీ కూడా డిసెంబర్ 25న విడుదల కాబోతోంది..

అంతే కాకుండా కన్నడ నటుడు కిచ్చా సుదీప్ నటించిన మార్క్ మూవీ కూడా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కాబోతోంది.అలాగే తమిళ సినిమా 7G రెయిన్ బో కాలనీ-2, బాలీవుడ్ నటి అలియా భట్ నటించిన ఆల్ఫా అనే హిందీ మూవీ తో పాటు హాలీవుడ్ మూవీ అయినటువంటి ది అనకొండ కూడా డిసెంబర్ 25న విడుదల కాబోతోంది. అలా డిసెంబర్ 25న ఏకంగా 9 సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి.

ఈ తొమ్మిది సినిమాల్లో ఏ సినిమా హిట్ అవుతుందో.. క్రిస్మస్ విన్నర్ ఎవరో అవుతారో చూడాలి. ఇక ఓవరాల్ గా డిసెంబర్ నెలలో వివిధ భాషల నుండి దాదాపు 15సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరి ఈ 15 సినిమాల్లో ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ గా ఏ సినిమా నిలవబోతుంది అనేది చూడాలి.