టాలీవుడ్ కు మరో పవన్ కళ్యాణ్.. డెబ్యూ షూటింగ్ అప్డేట్
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ అనే యువకుడు హీరోగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. పురుషహ టైటిల్ తో డెబ్యూ మూవీ చేస్తున్నారు పవన్.
By: M Prashanth | 2 Oct 2025 7:15 PM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ అనే యువకుడు హీరోగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. పురుషహ టైటిల్ తో డెబ్యూ మూవీ చేస్తున్నారు పవన్. అవుట్ అండ్ అవుట్ కామెడీ స్టోరీతో రూపొందుతున్న ఆ సినిమాతో అసోసియేట్ డైరెక్టర్ గా సుపరిచితులైన వీరు ఉలవల డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.
వీరు ఉలవల గతంలో మళ్లీ రావా, జెర్సీ, మసూద వంటి పలు టాలీవుడ్ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రాబోతున్న డెబ్యూ సినిమా పురుషహకు బత్తుల కోటేశ్వరరావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఆయన సినిమాను రూపొందిస్తున్నారు.
బ్రహ్మచారి.. భర్త కావాలని నిర్ణయించుకున్న తర్వాత జీవితం యుద్ధభూమిగా మారుతుందనే పాయింట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కొన్ని నెలల క్రితం పూజా కార్యక్రమాలు జరిపిన మేకర్స్ షూటింగ్ ను మొదలుపెట్టారు. ఆ కార్యక్రమానికి అప్పుడు గౌతమ్ తిన్ననూరి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.
తన శిష్యుడు వీరు కోసం టైటిల్ లోగో, పోస్టర్ ను రిలీజ్ చేయగా.. ఆడియన్స్ ను సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే విభిన్నమైన కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న పురుషహ సినిమా షూటింగ్ ను శరవేగంగా జరిపిన మేకర్స్.. తాజాగా కంప్లీట్ చేశారు. ఈ మేరకు ఆ విషయాన్ని గురువారం మధ్యాహ్నం అధికారికంగా వెల్లడించారు.
స్పెషల్ సాంగ్ షూటింగ్ తో చిత్రీకరణను పూర్తి చేసిన మేకర్స్.. గుమ్మడికాయ కొట్టేశారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారు. వాటిని కూడా శరవేగంగా నిర్వహించాలని చూస్తున్నారు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు. 2025లోనే సినిమా రిలీజ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది.
మూవీ విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్ తో పాటు సప్తగిరి, కాసిరెడ్డి రాజ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్, అనంత్ శ్రీరామ్, పమ్మీ సాయి, మిర్చి కిరణ్ వంటి ప్రసిద్ధ నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వైష్ణవి కొక్కురు, విశిక, హాసిని సుధీర్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. గబీ రాక్, అనైర్ గుప్తా కాస్త గ్లామర్ టచ్ ను యాడ్ చేస్తుండగా.. శ్రవణ్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
