Begin typing your search above and press return to search.

టెన్షన్ లో రకుల్ కెరియర్.. బయటపడుతుందా?

ఎందుకంటే గత 6 సంవత్సరాల నుండి రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ కావడం లేదు.

By:  Madhu Reddy   |   12 Oct 2025 5:00 PM IST
టెన్షన్ లో రకుల్ కెరియర్.. బయటపడుతుందా?
X

నటి రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం అజయ్ దేవగన్ తో నటించిన దే దే ప్యార్ దే -2 మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ దే దే ప్యార్ దే సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. అయితే 2019లో విడుదలైన ఈ సినిమా రొమాంటిక్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ సినిమాలోని హాస్యానికి, నటనకి ప్రశంసలు దక్కినప్పటికీ సినిమా ఎందుకో ప్రేక్షకులను అలరించలేకపోయింది. దాంతో ఈ సినిమాకి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ వచ్చింది.

అయితే అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ రాబోతోంది. మరి సినిమా కథాంశం ఏంటి.. ఈ సినిమా రకుల్ కెరీర్ ని డిసైడ్ చేస్తుందా అనేది ఇప్పుడు చూద్దాం.. అన్షుల్ శర్మ డైరెక్షన్ చేసిన దే దే ప్యార్ దే -2 మూవీ నవంబర్ 14న విడుదల కాబోతోంది.ప్యార్ వర్సెస్ పరివార్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ మూవీ ప్రేమ, కుటుంబ సంఘర్షణల కథాంశంతో తెరకెక్కింది.

ఆశిష్ మెహ్రా పాత్రలో నటించిన అజయ్ దేవగణ్ తన చిన్ననాటి స్నేహితురాలు అయినటువంటి అయేషా పాత్రలో నటించే రకుల్ ప్రీత్ సింగ్ కుటుంబాన్ని కలిసిన సమయంలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇందులో మెయిన్ గా చూపించబోతున్నారు. ఈ సినిమాలో కూడా మొదటి సినిమాలో లాగా కామెడీని ప్రధానంగా తీసుకోబోతున్నారు. అయితే ఈ కామెడీ రిఫ్రెష్ గా ఉంటే ఏం కాదు.కానీ పాత చింతకాయ పచ్చడి లాగా ఉంటే కచ్చితంగా మునపటి రిజల్టే పునరావృతం అవుతుంది అని సినీ విశ్లేషకులు అంటున్నారు. దే దే ప్యార్ దే 2 సినిమా లో అజయ్ దేవగన్,రకుల్ ప్రీత్ సింగ్,ఆర్.మాధవన్ లు ప్రధాన పాత్రల్లో నటించారు.

అయితే ఈ సినిమా రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ని డిసైడ్ చేసుకునే చివరి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 6 సంవత్సరాల నుండి రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ కావడం లేదు. ఈమె చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ లో వరుస సినిమాలు డిజాస్టర్ గా నిలుస్తున్నాయి. దాంతో రకుల్ ప్రీత్ సింగ్ కి అవకాశాలు కూడా రావడం లేదు. అందుకే రకుల్ కెరియర్ ని డిసైడ్ చేసే సినిమాగా దే దే ప్యార్ దే-2 సినిమాని చెప్పుకోవచ్చు. ఈ సినిమా హిట్ అయితే ఆమెకు ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి. ఒకవేళ ఫ్లాప్ అయితే మాత్రం ఇక రకుల్ ప్రీత్ సింగ్ కెరియర్ ఇండస్ట్రీలో క్లోజ్ అయినట్టే అర్థం చేసుకోవచ్చు. మరి చూడాలి ఈ సినిమా రకుల్ ప్రీత్ సింగ్ కెరియర్ ని నిలబెడుతుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది. మరి ఈ ఉత్కంఠ నుంచి సినిమా సక్సెస్ సాధించి, రకుల్ బయట పడాలని, వరుస అవకాశాలు అందుకోవాలని అభిమానులు ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు.