Begin typing your search above and press return to search.

సొంత ఫ్రాంఛైజీలో స్టార్ హీరోకి అవమానం..

ఈ సినిమా అజయ్ దేవగణ్ 2019వ సంవత్సరంలో నటించిన దేదే ప్యార్ దే సినిమాకి సీక్వెల్ గా రొమాంటిక్ డ్రామా జానర్ లో రాబోతుంది.

By:  Madhu Reddy   |   5 Nov 2025 8:00 AM IST
సొంత ఫ్రాంఛైజీలో స్టార్ హీరోకి అవమానం..
X

అజయ్ దేవగణ్ నుండి రాబోతున్న కొత్త సినిమా దేదే ప్యార్ దే-2. ఈ సినిమా అజయ్ దేవగణ్ 2019వ సంవత్సరంలో నటించిన దేదే ప్యార్ దే సినిమాకి సీక్వెల్ గా రొమాంటిక్ డ్రామా జానర్ లో రాబోతుంది. ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు పాటలు విడుదల చేశారు. తాజాగా ఈరోజు ఈ సినిమా నుండి 3 షౌక్ అనే మూడో పాట కూడా రిలీజ్ చేశారు. అయితే అంతా బాగానే ఉంది కానీ చిత్ర బృందంపై మాత్రం సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దానికి ప్రధాన కారణం అజయ్ దేవగణ్ తన సొంత ఫ్రాంచైజీలో తక్కువగా కనిపించడమే. అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలలో కూడా మరో నటుడు మీజాన్ జాఫ్రీని స్పెషల్ గా చూపించారు.

అయితే తాజాగా విడుదల అయిన మూడో పాటకి సంబంధించిన పోస్టర్ లో కూడా మీజాన్ జాఫ్రీనే హైలెట్ అయ్యారు. తాజాగా దేదే ప్యార్ దే-2 చిత్ర యూనిట్ షేర్ చేసిన పోస్టర్ లో మీజాన్ జాఫ్రీ రెండు కార్లపై ఐకానిక్ ఫోజ్ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. దీంతో చిత్ర యూనిట్ షేర్ చేసిన ఈ పోస్టర్ పై సోషల్ మీడియాలో కొత్త చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఈ మూడో పాటలో కూడా మునపటి పాటల్లో లాగా అజయ్ దేవగణ్ కాకుండా మీజాన్ జాఫ్రీనే హైలెట్ అయ్యారని అభిమానులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ నుండి విడుదలైన మొదటి పాట రాత్ బర్ లో మీజాన్ జాఫ్రీ, రకుల్ ప్రీత్ సింగ్ ల మధ్య రొమాన్స్ ని చూపించారు. ఇందులో అజయ్ దేవగణ్ స్కోప్ తక్కువగా ఉంది.

అయితే తాజాగా విడుదలైన 3 షౌక్ లో కూడా మీజాన్ జాఫ్రీ హైలైట్ అవ్వడంతో అజయ్ దేవగణ్ అభిమానులు నిరాశ పడుతున్నారు. అజయ్ దేవగణ్ ఈ సినిమాలో ప్రధాన హీరో కానీ తన సొంత ఫ్రాంచైజీ లో ఈయనకే స్కోప్ తక్కువగా ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దే దే ప్యార్ దే -2 నుండి విడుదలైన మూడో పాటలో కూడా ఎందుకు మీజాన్ జాఫ్రీ ని హైలెట్ చేస్తున్నారనే చర్చలు సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. మేకర్స్ కావాలనే మీజాన్ జాఫ్రీని హైలెట్ చేస్తున్నారా అని చాలామంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. అంతేకాదు కొంతమందేమో అజయ్ దేవగణ్ ప్రమోషనల్ కంటెంట్ లో పరిమిత స్క్రీన్ ప్రజెన్స్ ని పొందితే దీనివల్ల సినిమాకి దెబ్బ పడుతుందని,అలాగే గతంలో అజయ్ దేవగణ్ నటించిన ఔరాన్ మే కహన్ దమ్ థా సినిమా రిజల్ట్ రిపీట్ అవుతుందని కొంతమంది అజయ్ దేవగన్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

ఎందుకంటే గతంలో ఈ సినిమా చేసినప్పుడు కూడా అజయ్ దేవగణ్ ఎక్కువగా హైలెట్ అవ్వకపోవడంతో సినిమా ఫ్లాఫ్ అయింది. ఇప్పుడు కూడా అజయ్ దేవగణ్ ని పక్కన పెట్టి మీజాన్ జాఫ్రీ ని హైలెట్ చేస్తున్నారు. కాబట్టి అదే రిజల్ట్ వస్తుందని ఆందోళన చెందుతున్నారు.అయితే మరి కొంత మంది మాత్రం చిత్ర యూనిట్ మీజాన్ జాఫ్రీని హైలెట్ చేయడానికి ఏదైనా ప్లాన్ ఉంది కావచ్చు అని నమ్ముతున్నారు. ఎందుకంటే దే దే ప్యార్ దే-2 సినిమాలో కంటెంట్ మొత్తం ఏజ్ మరియు ప్రేమతో ముడిపడి ఉంటుంది.అలాగే ఈ సినిమాలో అజయ్ దేవగణ్ వయసు రకుల్ ప్రీత్ సింగ్ వయసు కంటే చాలా పెద్దది కావడంతో రకుల్ తండ్రి అజయ్ దేవగణ్ కి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోడు.

అదే సమయంలో మీజాన్ జాఫ్రీని తీసుకువస్తాడు.అలా మీజాన్ జాఫ్రీ పాత్ర సినిమాలో ఆశ్చర్యకరమైన మలుపు తిప్పుతుంది.అందుకే మీజాన్ జాఫ్రీ పాత్రని హైలెట్ చేస్తున్నారని,దీనివల్ల సినిమాకి ప్లస్ అవుతుందని అంటున్నారు. మరి సొంత ఫ్రాంచైజీలో అజయ్ దేవగణ్ ని పక్కన పెట్టి వేరే హీరోని హైలెట్ చేయడం వల్ల సినిమాకి ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అనేది చూడాలి. సోషల్ మీడియాలో వివాదాలతో హైలెట్ గా నిలిచిన ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ 14న విడుదల కాబోతోంది.