DDLJ 30వ వార్షికోత్సవంలో కళ్లు చెదిరే ట్రీట్
షారుఖ్ ఖాన్ - కాజోల్ జంటగా నటించిన `దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే` (డిడిఎల్‌జే) భారతీయ సినిమా చరిత్రలో గొప్ప ప్రేమకథలలో ఒకటిగా హృదయాలను గెలుచుకుంది.
By: Sivaji Kontham | 4 Dec 2025 11:41 PM ISTషారుఖ్ ఖాన్ - కాజోల్ జంటగా నటించిన `దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే` (డిడిఎల్‌జే) భారతీయ సినిమా చరిత్రలో గొప్ప ప్రేమకథలలో ఒకటిగా హృదయాలను గెలుచుకుంది. ముఖ్యంగా షారూఖ్- కాజోల్ జంట కెమిస్ట్రీ సినిమాలోని మరపురాని సంభాషణలు, అద్భుత సంగీతం డిడిఎల్‌జే ని కేవలం సినిమాగా కాకుండా ఒక గొప్ప అనుభూతిగా మార్చాయి.

ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించిన డిడిఎల్‌జే బాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. నేటికీ ఎంపిక చేసిన థియేటర్లలో ప్రదర్శితమవుతున్న గొప్ప సినిమాగా ఇది చరిత్రకెక్కింది. మహా రాష్ట్రలోని మరాఠా మందిర్ థియేటర్ లో ఇప్పటికీ ఈ సినిమా ఆడుతూనే ఉంది.
ఈ ఏడాదితో డిడిఎల్‌జే విడుదలై 30 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్బంగా లండన్ లీసెస్టర్ పరిసరాల్లో షారూఖ్ - కాజోల్ జంట కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించగా, ఈ వేడుక కోసం నిజమైన జంట లండన్ లో వాలిపోయింది. ఆ ఇద్దరూ జంటగా ఫోజులిచ్చిన కొన్ని పోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. కాజోల్ ఈ వయసులోను రివీలింగ్ ఔట్ ఫిట్ తో మతులు చెడగొట్టింది. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.
షారూఖ్ బ్లాక్ సూట్‌లో అందంగా కనిపించగా, కాజోల్ నీలిరంగు చీరలో చక్కదనంతో మెరిసింది. అభిమానులు ఈ ఫోటోలపై వేగంగా స్పందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. ఒక గొప్ప సినిమా మూడు దశాబ్ధాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాల్లో ఈ మూవీ నుంచి క్లిప్ లను షేర్ చేస్తున్నారు.
షారుఖ్ ఖాన్ ప్రస్తుతం కింగ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇది గ్యాంగ్ స్టర్ డ్రామా. కింగ్‌లో అభిషేక్ బచ్చన్, దీపికా పదుకొనే, రాణి ముఖర్జీ, జైదీప్ అహ్లవత్, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, అర్షద్ వార్సీ, రాఘవ్ జుయల్, సౌరభ్ శుక్లా, అభయ్ వర్మ, కరణ్‌వీర్ మల్హోత్రా , సుహానా ఖాన్ వంటి భారీతారాగణం నటిస్తోంది. ఈ చిత్రం 2026లో గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. బహుశా షారుఖ్ ఖాన్ ఇప్పటివరకు చేసిన సినిమాలలో అత్యంత ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా ఈ సినిమాకు స్థానం ఉంది. కాజోల్ కెరీర్ మ్యాటర్ కి వస్తే, ట్వింకిల్ ఖన్నాతో కలిసి బుల్లితెర షోను విజయవంతంగా నడిపిస్తోంది. ఇటీవల హర్రర్ థ్రిల్లర్ `మా`లోను కాజోల్ కనిపించింది.
