Begin typing your search above and press return to search.

బ్రిటిష్ పాలన ఎదుర్కొంటూ మనోజ్ ఉగ్రరూపం..!

సెకండ్ ఇన్నింగ్స్‌లో మిరాయ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మనోజ్.. ఇప్పుడు మరో సీరియస్ కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   17 Dec 2025 5:55 PM IST
బ్రిటిష్ పాలన ఎదుర్కొంటూ మనోజ్ ఉగ్రరూపం..!
X

సెకండ్ ఇన్నింగ్స్‌లో మిరాయ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మనోజ్.. ఇప్పుడు మరో సీరియస్ కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. మనోజ్ హీరోగా నటిస్తున్న.. డేవిడ్ రెడ్డి సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. ఈ టీజర్ చూస్తేనే సినిమా ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో అర్థమవుతోంది. మంచి విజువల్స్.. బలమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. ఇంటెన్స్ డైలాగ్స్‌తో టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.

ఈ టీజర్.. ఒక చిన్న బాబు.. తన తండ్రిని ఒక ప్రశ్న అడగడంతో మొదలవుతుంది.. “నాన్న… మన ఫ్యాక్టరీలో రాత్రి కూడా శబ్దాలు ఎందుకు వస్తున్నాయి?” అని అడుగుతాడు. అందుకు తండ్రి.. వేగం తయారు చేస్తున్నాం.. అని చెబుతాడు. వేగం అంటే ఏమిటని పిల్లవాడు అడిగితే.. నీకు సుభాష్ చంద్రబోస్.. భగత్ సింగ్ తెలుసా.. ఇప్పుడు ఇంకొక శక్తివంతమైన వ్యక్తి గురించి తెలుసుకోవాలని.. చెబుతాడు. అతను బ్రిటిష్ వాళ్లకి శత్రువే.. ఇండియన్స్‌కీ శత్రువే.. అంటూ మనోజ్ పాత్రను పరిచయం చేస్తారు.

అప్పుడే స్క్రీన్‌పై మనోజ్ కనిపిస్తారు. అక్కడినుంచి ఆయన చెప్పే ప్రతి మాట.. డేవిడ్ రెడ్డి క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. బ్రిటిష్ పాలకులను ఎలా వణికించాడు.. ఎలా ఎదురించాడు అన్న విషయాలు టీజర్‌లో హింట్‌లుగా చూపిస్తారు. ఇక ఈ టీజర్ చూస్తే డేవిడ్ రెడ్డి పాత్ర ఎంత భయంకరంగా.. ధైర్యంగా ఉంటుందో స్పష్టంగా అర్థమవుతుంది.

టీజర్‌లో హైలైట్ సీన్ అంటే మనోజ్ “వైల్డ్ డాగ్” అనే బైక్‌ను స్టార్ట్ చేయడం. ఆ సీన్‌కు స్టైల్, ఎనర్జీ రెండూ కలిసి వచ్చాయి. చివర్లో మనోజ్ చెప్పే డైలాగ్ కూడా మరింత బలంగా ఉంటుంది. “ఇది బ్రిటిష్ ఇండియా కాదు… ఇది డేవిడ్ రెడ్డి ఇండియా,” అని మనోజ్ హిందీలో డైలాగ్ చెప్పడంతో టీజర్ ముగుస్తుంది.

ఈ కథ వరల్డ్ వార్ వన్ టైమ్‌లో.. అంటే 1897 నుంచి 1922 మధ్య కాలంలో జరుగుతుందని టీజర్‌లోనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. బ్రిటిష్ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న అన్యాయాలు, పోరాటాలు, త్యాగాలు..భావోద్వేగాలు ఈ సినిమాలో ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది.

ఈ సినిమాకు హనుమా రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మోటుకూరి భరత్, నల్లగంగుల వెంకట్ రెడ్డి ఈ చిత్రాన్ని వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు