Begin typing your search above and press return to search.

ఒక మూవీ లో మల్టీపుల్ జానర్స్ ను ఆడ్ చేయలేమా? అలా చేసే ఒకే ఒక దర్శకుడెవరంటే...

ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాల్లో '7' మూవీ డిటెక్టివ్ ఎలిమెంట్స్ తో ముందుకు సాగిన కూడా అందులో హార్రర్ సీన్స్ కూడా ఉంటాయి.

By:  Tupaki Entertainment Desk   |   19 Sept 2026 4:00 AM IST
ఒక మూవీ లో మల్టీపుల్ జానర్స్ ను ఆడ్ చేయలేమా? అలా చేసే ఒకే ఒక దర్శకుడెవరంటే...
X

ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే అందులో ఏముండాలి. ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటే ఆ సినిమా ప్రేక్షకుడికి నచ్చుతుంది. ప్రస్తుతం ఉన్న మేకర్స్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించడానికి ఏ జానర్ లో సినిమాలు చేస్తున్నారు అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం ఉన్న ట్రెండును బట్టి చూస్తే ప్రతి దర్శకుడు తన కథకి అద్భుతమైన స్క్రీన్ ప్లే ని రాసుకొని దాన్ని తెరమీద ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక దర్శకుడు ఒక జానర్ లోనే కథను తీసుకొని అదే జానర్ కి స్టిక్ అయి సినిమాలు చేసి సక్సెస్ ని సాధిస్తున్నారు. కొంతమంది ఆ సబ్జెక్ట్ లను డీల్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. తద్వారా సినిమా ఫలితం తేడా కొడుతుంది. ఇక ఈ క్రమంలోనే హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన 'డేవిడ్ ఫించర్ ' ఒక కథలోనే మల్టిపుల్ జానర్స్ ను మిక్స్ చేసి సక్సెస్ లను సాధిస్తున్నాడు. నిజానికి డేవిడ్ ఫించర్ చేసిన సినిమాలన్నింటిలో కూడా మనకు ఈ జానర్ షిఫ్టింగ్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. చివరి వరకు ఒకే జానర్ లో సినిమా వెళ్తుందని ఆడియన్ అనుకున్నప్పటికి ప్రీ క్లైమాక్స్ లో గాని, క్లైమాక్స్ లో గాని ఆ సినిమా జోనర్ ని షిఫ్ట్ చేసి ప్రేక్షకుడికి ఒక థ్రిల్ ఫిల్ ఇవ్వడంలో డేవిడ్ ఫించర్ సిద్ధహస్తుడు...

ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాల్లో '7' మూవీ డిటెక్టివ్ ఎలిమెంట్స్ తో ముందుకు సాగిన కూడా అందులో హార్రర్ సీన్స్ కూడా ఉంటాయి. మొత్తానికైతే సెవెన్ సినిమాను కూడా ఆయన జానర్ షిఫ్ట్ చేస్తు సక్సెస్ ఫుల్ గా నిలిపాడు...ది ఫైట్ క్లబ్, గాన్ గర్ల్, ది సోషల్ నెట్ వర్క్ అనే సినిమాల్లో కూడా మల్టిపుల్ జానర్స్ ను మిక్స్ చేసి సక్సెస్ లను సాధించాడు. నిజానికి సినిమా చూసే ప్రేక్షకులకు జానర్ షిఫ్ట్ అయిన విషయం తెలియకుండానే వాళ్ళను ఆ ట్రాన్స్ లోకి తీసుకెళ్లి జానర్ షిఫ్ట్ చేసి ప్రేక్షకుడికి ఒక హై ఫీల్ ఇస్తాడు... ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు సైతం ఆయన మాదిరిగానే మల్టీపుల్ జానర్స్ ని మిక్స్ చేసి సినిమా చేయచ్చు కదా! అలా అయితే ప్రేక్షకుడికి ఒక కొత్త అనుభూతిని ఇచ్చినవారు అవుతారు.

స్క్రీన్ ప్లే రాసే విధానాన్ని కూడా మార్చుకొని కథకి తగ్గట్టుగా చాలా అత్యుత్తమమైన పద్దతి లో స్క్రీన్ ప్లే ఉంటే సినిమాకి వచ్చే రెస్పాన్స్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. ఇలా చేస్తే మూవీ రైటింగ్ పరంగా చాలా స్ట్రాంగ్ అవుతుంది. మేకింగ్ విషయంలో ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సినిమా ఈజీగా సక్సెస్ అవుతుంది. ఇలాంటివి ఫాలో అవనన్ని రోజులు మూస ధోరణిలో వెళ్లే సినిమాలని మనం చూడాల్సి ఉంటుంది. ఎప్పుడైతే కొత్తదనానికి ప్రేక్షకుడు అలవాటు పడిపోయాడో వాళ్ళ అభిరుచిని బట్టే దర్శకుడు సినిమా చేస్తే దానికి ఎక్కువ రీచ్ ఉంటుంది. అంతే తప్ప దర్శకులు మనకు నచ్చిన సినిమాలు మనం చేద్దాం ఆడియన్స్ చూస్తే చూస్తారు లేకపోతే లేదు అంటే మాత్రం ప్రేక్షకుడు వచ్చిన సినిమాను వచ్చినట్టుగా రిజెక్ట్ చేస్తూ ఉంటాడు...