74 ఏళ్ల వయసులో డాడీ తో కుమారుడు!
బాలీవుడ్ లో అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సీనియర్ దర్శకుడు డేవిడ్ ధావన్ `హై జవానీ తో ఇష్క్ హోనా హై` తో మళ్లీ మెగాఫోన్ పట్టిన సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 25 May 2026 1:00 AM ISTబాలీవుడ్ లో అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సీనియర్ దర్శకుడు డేవిడ్ ధావన్ `హై జవానీ తో ఇష్క్ హోనా హై` తో మళ్లీ మెగాఫోన్ పట్టిన సంగతి తెలిసిందే. వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో 74 ఏళ్ల వయసులో డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన 46వ చిత్రమిది.
ఈ తరం ప్రేక్షకులకు సరికొత్త కన్ఫ్యూజన్ కామెడీ- ఫ్యామిలీ డ్రామాను పరిచయం చేస్తూ 90ల నాటి వింటేజ్ బాలీవుడ్ మ్యాజిక్‌ను రీక్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే ట్రైలర్ ఘనంగా విడుదలైంది.
ఈ నేపథ్యంలో వరుణ్ ధావన్ డాడ్ ఈ వయసులో మరో సినిమా చేయడానికి గల ఓ కారణాన్ని పంచుకున్నారు. ప్రతి శుక్రవారం సినిమా భవితవ్యం గురించి అది బాక్సాఫీస్ వద్ద ఆడుతుందా? లేదా అనే ఎన్నో ప్రశ్నలు ఎదురవుతోన్న రోజులివి. ఇలాంటి విశ్లేషణలకు అతీతంగా పూర్తి నమ్మకంతో డాడీ ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు నడిపించిన చిత్రమిది. తమ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా? మంచి ఫలితాలు సాధిస్తుందన్నారు. ప్రజలను నవ్వించడమే తమ కుటుంబ ఏకైక లక్ష్యమని, తన తండ్రికి ప్రేక్షకులను అలరించడం మించిన ఆనందం మరొకటి లేదని వరుణ్ పేర్కొన్నారు.
తండ్రీకొడుకుల సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో వస్తోన్న నాల్గవ చిత్రం కావడం విశేషం. గతంలో ఇద్దరి కలయికలో రిలీజ్ అయిన `మై తేరా హీరో`, `జుడ్వా 2`, `కూలీ నెం. 1` చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఈ నేపథ్యంలో నాల్గవ చిత్రంతోనూ అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు భార్యల గర్భధారణ చుట్టూ తిరిగే ఓ క్లాసిక్ లవ్ ట్రయాంగిల్ గందరగోళాన్ని చూపించబోతున్నట్లు తెలుస్తోంది . గతంలో డేవిడ్ ధావన్ సూపర్ హిట్ చిత్రం లోని ఐకానిక్ `చునరీ చునరీ` వంటి క్లాసిక్ పాటలను రీమిక్స్ చేసి పాత జ్ఞాపకాలను గుర్తుచేశారు.
ఇదే వేడుకలో ఓ భావో ద్వేగ సన్నివేశం కూడా చోటుచేసుకుంది. వేదికపై తన కుమారుడు వరుణ్ ధావన్ గురించి మాట్లాడుతూ డేవిడ్ ధావన్ కన్నీటి పర్యంతం చెందారు. వరుణ్ నటుడిగానే కాకుండా ఒక కొడుకుగా తన జీవితంలో పోషించిన పాత్ర ఎంతో గొప్పదన్నారు.`ప్రతి ఒక్కరికీ వరుణ్ లాంటి కొడుకే పుట్టాలి` అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కుమారులు ఉన్నవారందరినీ కదిలించాయి. కెరీర్‌లో ఎన్ని విజయాలు అందుకున్నా? తండ్రిగా తన కొడుకును చూసి గర్వపడే క్షణమే అత్యున్నతమైనదని చాటిచేప్పారు.
కొన్నేళ్ల క్రితం డేవిడ్ ధావన్ తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన సమయంలో వరుణ్ ధావన్ చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆ క్లిష్ట సమయంలో వరుణ్ ఆసుపత్రిలోనే తండ్రి పక్కన ఉండి ప్రతీ క్షణం వదలకుండా కంటికి రెప్పలా చూసుకున్నాడని డేవిడ్ ధావన్ తెలిపారు. గ్లామర్ ప్రపంచానికి దూరంగా నిజ జీవితంలో ఇద్దరి మధ్య ఉన్న విడదీయరాని అనుబంధమే వెండితెరపై కూడా వారి కాంబినేషన్ విజయవంతం కావడానికి ప్రధాన కారణమని ఈ సందర్భంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మారుతోన్న కాలంతో పాటు సినిమా ట్రెండ్స్ ఎంతగా మారినా? కుటుంబ సమేతంగా కలిసి చూసే ప్యూర్ కామెడీ ఎంటర్టైనర్లకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని ఈ చిత్రం నిరూపించబోతోందుని నమ్ముతున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా తనలోని నమ్మకాన్ని, నవ్వుల సిద్ధాంతాన్ని నమ్ముకున్న ఒక సీనియర్ దర్శకుడి ప్రయత్నం నేటి ఆధునిక సినిమా మార్కెట్‌లో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూడాలి.
