Begin typing your search above and press return to search.

త‌ల్లి దండ్రుల‌కు దూరంగా స్వీట్ డాట‌ర్ అందుకేనా?

పిల్ల‌ల‌కు క‌ష్టాలు తెలియాలి. అప్పుడే జీవితం విలువేంటో తెలుస్తుంది అన్న‌ది డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ ఎప్పుడూ బ‌లంగా చెప్పే మాట‌.

By:  Srikanth Kontham   |   29 Sept 2025 4:00 PM IST
త‌ల్లి దండ్రుల‌కు దూరంగా స్వీట్ డాట‌ర్ అందుకేనా?
X

పిల్ల‌ల‌కు క‌ష్టాలు తెలియాలి. అప్పుడే జీవితం విలువేంటో తెలుస్తుంది అన్న‌ది డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ ఎప్పుడూ బ‌లంగా చెప్పే మాట‌. తాను ఇండ‌స్ట్రీలో ఎలా క‌ష్ట‌ప‌డి ఎదిగాడు అన్న‌ది అంద‌రికీ తెలిసిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎక్కడో మారుమూల ఏజెన్సీ ప్రాంతం నుంచి వ‌చ్చి అమితాబ్ లాంటి లెజెండ్ ని డైరెక్ట్ చేసే స్థాయికి చేరాడంటే? తానెంత క‌ష్ట‌ప‌డి ఉంటాడు. ఆ కష్టం విలువేంటో త‌న పిల్ల‌ల‌కు తెలియాల‌నుకున్నాడు. అంద‌రి త‌ల్లిదండ్రుల్లా తాను ఆలోచించ‌లేదు. అందుకే కుమారుడు..కుమార్తెల‌ను చిన్న వ‌య‌సులోనే హాస్ట‌ల్ లో ఉంచి పెంచాడు.

పూరి అభిప్రాయం ఇలా:

తమ‌ బ‌ట్ట‌లు తామే ఉతుక్కోవాలి. త‌న ప‌నులు తానే చేసుకోవాలి. కుదిరితే పార్ట్ టైమ్ జాబ్ చేసి చ‌దువుకోవాలి. క‌ష్టం అంటే ఏంటో తెలిసిన‌ప్పుడే జీవితం విలువ తెలుస్తుంద‌న్న‌ది ఆయ‌న ఉద్దేశం. రిచ్ కిడ్స్ క‌న్నా పూర్ కిడ్స్ ఎంతో తెలివైన వారు..చురుకుగా ఉంటారు? అన్న‌ది పూరి అభిప్రాయం. ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదురైనా ఎదురెళ్లే ధైర్యం వాళ్ల‌లో ఉంటుంద‌న్న‌ది పూరి బ‌లంగా చెబుతారు. తల్లిదండ్రులు కోట్లు సంపాదించి ఇస్తే పిల్ల‌లు అవి ఖ‌ర్చు పెట్టుకుని సోమ‌రి పోతుల్లా త‌యార‌వ్వ‌డం త‌న‌కెంత మాత్రం న‌చ్చ‌ద‌ని చాలా సంద‌ర్భాల్లో పూరి చెప్పారు.

అక్క‌డి వ‌ర‌కూ అంతా స‌వ్యంగానే :

తాజాగా ఓ పెద్దింటి న‌టి త‌ల్లిదండ్రుల‌కు దూరంగా ఉంటోన్న ఉదంతం వెలుగులోకి వ‌చ్చింది. ఆ న‌టి చిన్న‌ప్ప‌టి నుంచి త‌ల్లిదండ్రులతోనే గ‌డిపింది. ఒకే ఒక్క కుమార్తె కావ‌డంతో ఎంతో గారాబంగా పెంచి చ‌దివించారు. అడిగిం దేది కాద‌న‌కుండా ఇచ్చారు. త‌ల్లిదండ్రుల కోరిక మేర‌కు ఆ కుమార్తె కూడా పెద్ద‌లు చూసిన పెళ్లి సంబంధాన్నే చేసుకున్నారు. కానీ ఆ బంధం ఎంత కాలం నిల‌వ‌లేదు. విబేధాల‌తో ఆ దంప‌తులు వేర‌య్యారు. అనంత‌రం ఆ కుమార్తె మ‌ళ్లీ త‌ల్లిదండ్రుల చెంత‌కే చేరారు. మ‌ళ్లీ సినిమాల‌తో బిజీ అయ్యారు.

క‌ష్టం తెలిస్తేనే జీవితం విలువ‌:

అయితే ఇటీవ‌లే తాను త‌ల్లిదండ్రుల‌తో ఉండ‌లేద‌ని స‌ప‌రేట్ గా ఉంటున్న‌ట్లు తెలిపారు. రెండు మూడు రోజుల‌కు త‌ల్లిదండ్రుల ఇంటికి వ‌చ్చి చూసెళ్లిపోవ‌డం త‌ప్ప అదే ఇంట్లో తాను మునుప‌టిలా ఉండ‌లేద‌న్నారు. దీంతో ఆ న‌టిలో ప‌రివ‌ర్త‌న క‌లిగిన‌ట్లు తెలుస్తోంది. కుటుంబంతో ఉండ‌టం వేరు. సింగిల్ గా లైఫ్ లీడ్ చేయ‌డం వేరు. సింగిల్ గా ఉంటే ఉద‌యం మొద‌లు రాత్రి ప‌డుకునే వ‌ర‌కూ చుట్టూ ఎవ‌రూ ఉండ‌రు. ఈ ద‌శ‌లో ర‌క‌ర‌కాల ప‌రిస్థితులు ఎదుర‌వుతుంటాయి. వాటిని దాటుకుని ముందుకెళ్లాలి. మాస‌సిక ప‌రిప‌క్వ‌త పెర‌గ‌డం...ధృఢంగా మార‌డం వంటివి అల‌వాటు అవుతాయి. పెట్టుకుంటే ఇంటి కోసం ప‌నిచేసే సిబ్బంది ఉంటారు. లేక‌పోతే ఆ ప‌నులు వాళ్లే స్వ‌యంగా చేసుకోవాలి. ఇలా ప‌నులు అల‌వాటు చేసుకుంటే? క‌ష్టం తెలుస్తుంది. అటుపై జీవితం విలువ తెలియ‌డానికి పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్ట‌దు.