దసరా రాజు సొంతమా? రాణీ సొంతమా?
దసరా ధమాకాలు సిద్దమయ్యాయి. తెలుగు నుంచి ఎలాంటి సినిమాలు రిలీజ్ కు లేవు గానీ పరభాషల నుంచి మాత్రం కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
By: Srikanth Kontham | 30 Sept 2025 11:00 PM ISTదసరా ధమాకాలు సిద్దమయ్యాయి. తెలుగు నుంచి ఎలాంటి సినిమాలు రిలీజ్ కు లేవు గానీ పరభాషల నుంచి మాత్రం కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఏ భాష సినిమా అయినా అక్కున చేర్చుకోవడం తెలుగు ప్రేక్షకుల ప్రత్యేకత. ఈ నేపథ్యంలో పర పరిశ్రమలు కూడా తెలుగు మార్కెట్ అంటే అంతే ఉత్సాహాన్ని చూపిస్తాయి. పెద్ద ఎత్తున రిలీజ్ లు ప్లాన్ చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో దసరా కానుకగా కన్నడ నుంచి `కాంతార చాప్టర్ వన్`- బాలీవుడ్ నుంచి ` సన్నీ సంస్కారీకి తులసీ కుమారి` చిత్రాలు రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే.
రెండు సినిమాలు సరిగ్గా దసరా రోజునే రిలీజ్ అవుతున్నాయి. ఈనేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద వార్ నడుస్తుందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. రిషబ్ శెట్టి వర్సెస్ జాన్వీ కపూర్ అంటూ పెద్ద చర్చే సాగుతోంది. ఈ దసరా రాజు సొంతమవుతుందా? రాణి సొంతమవుతుందా? అంటూ డిబేట్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోటీపై జాన్వీ కపూర్ స్పందించింది. `రెండు విభిన్నమైన సినిమాలని...వేర్వేరు పరిశ్రమల నుంచి రిలీజ్ అవుతున్న చిత్రాలుగా పేర్కొంది.
రెండింటి మధ్య పోటీ అంటే? ఓపెన్ హైమర్-బార్బీలను పోల్చడమే అన్నారు. `కాంతార` డిఫరెంట్ సబ్జెక్ట్. భారీ బడ్జెట్ తో నిర్మించారు. మాది ఫ్యామిలీ స్టోరీ. రెండింటికీ పోటీ లేద`న్నారు. అలాగే `సన్నీ సంస్కారీకి తులసీ కుమారి`లో హీరోగా నటిస్తోన్న వరుణ్ ధావన్ కూడా స్పందించాడు. `ఇప్పుడు కాకపోతే మా చిత్రాన్ని దీపావళికి రిలీజ్ చేయాలి. కానీ అప్పుడు అగ్ర హీరోల చిత్రాలు రిలీజ్ అవుతాయి. అందుకే ఈ తేదీకి వస్తున్నాం. పోటీగా ఎంత మాత్రం భావించొద్దు అన్నాడు.
రిలీజ్ అన్నది తాము తీసుకున్న నిర్ణయం కాదని నిర్మాణ సంస్థ తీసుకుంటుందని..అందులో తమ ప్రమేయం ఏదీ ఉండదన్నాడు. అలాగే ఒకేసారి రెండు సినిమాలు రిలీజ్ అయిన సందర్బాలు ఎన్నో ఉన్నాయన్నాడు. రెండు మంచి విజయం సాధించాలని ఆకాంక్షించాడు. మరి ఈ ప్రచారం పై రిషబ్ శెట్టి ఎలా స్పందిస్తాడో చూడాలి. రిలీజ్ కు ఇంకా కొన్ని గంటలే సమయం మిగిలింది. ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలున్నాయి.
