హిట్ అయినా చీవాట్లు తప్పలేదన్న హీరోయిన్!
కానీ సినిమా చూసిన చాలా మంది తనని తిట్టుకున్నారని అభిప్రాయ పడింది. ప్రణవ్ లాల్ పక్కన తాను సెట్ అవ్వలేదని విమర్శలు ఎదుర్కుటన్నట్లు తెలిపింది.
By: Srikanth Kontham | 21 Aug 2025 6:00 AM ISTసినిమా హిట్ అయితే ప్రశంసలు సహజం. ఏ నటికైనా హిట్ మాత్రమే కీలకం. విజయం ముంగిట అన్ని చిన్నబోతాయి. విమర్శ అనే మాటే వ్యకమవ్వదు. కానీ మలయాళం బ్యూటీ దర్శనా రాజేంద్రన్ మాత్రం విజయం అందుకున్నా? ప్రశంసతో పాటు విమర్శలు..చీవాట్లు కూడా తిన్న నటిగా పేర్కొంది. మలయాళ చిత్రం `హృదయం` లో అమ్మడు ప్రణవ్ లాల్ కి జోడీగా నటించిన సంగతి తెలిసిందే. యూత్ పుల్ స్టోరీ మంచి విజయం సాధించింది. `దర్శనా` సాంగ్ తో తెలుగింట బాగా పాపులర్ అయింది.
మనసు గాయపడేలా:
కానీ సినిమా చూసిన చాలా మంది తనని తిట్టుకున్నారని అభిప్రాయ పడింది. ప్రణవ్ లాల్ పక్కన తాను సెట్ అవ్వలేదని విమర్శలు ఎదుర్కుటన్నట్లు తెలిపింది. ఇండస్ట్రీలో కొందరు తన ముందు మాట్లా డకపోయినా? వెనక విమర్శలు చేసారంది. ఆ విమర్శలకు తానెంతో బాధపడినట్లు తెలిపింది. సినిమా హిట్ అయింది కాబట్టి ఆ మాత్రమైనా ఉండగలిగానని, లేదంటే? మరిన్ని విమర్శలతో మనసు మరింత గాయపరిచేవారంది. తన అందాన్ని ఉద్దేశించి చేసిన కామెంట్లు మాత్రం తనని ఎంతగానో బాధపెట్టాయని , కొన్ని రోజుల పాటు ఆ మాటలు గుర్తొచ్చి క్షోభకు గురైనట్లు తెలిపింది.
విమర్శలు సహజం:
సోషల్ మీడియాలో వచ్చిన ప్రతీ కామెంట్ చదివానని తెలిపింది. అయితే ఎన్ని విమర్శలు ఎదుర్కున్నా? ఏ నాడు ఆత్మ విశ్వాసం కోల్పోలేదని , నటనా రంగంలో ఇలాంటివి సహజంగా భావించి ముందు కెళ్తు న్నట్లు తెలిపింది. తాజాగా ఈ బ్యూటీ `పరదా` సినిమాతో టాలీవుడ్ లో రీలాంచ్ అవుతోంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, దర్శన రాజేంద్రన్ కీలక పాత్ర పోషిస్తుంది.
దర్శనా రాజేంద్రన్ మంచి పెర్పార్మర్ కావడంతోనే `పరదా`లో ఛాన్స్ ఇచ్చినట్లు దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల తెలిపారు.
పదేళ్ల క్రితమే టాలీవుడ్ లో:
`పరదా` కంటే ముందే అమ్మడు పదేళ్ల క్రితమే తెలుగు లో ఎంట్రీ ఇచ్చింది. `మూడు ముక్కల్లో చెప్పా లంటే` అనే సినిమాలో నటించింది. సినిమాలో కీర్తి పాత్ర పోషించింది. తమిళ్ , తెలుగులో ఈ చిత్రాన్ని మధు మిత తెరకెక్కించారు. ఎస్. పి చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కానీ సినిమా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. మరి `పరదా`తోనైనా దర్శన టాలీవుడ్ కెరీర్ పట్టాలెక్కుతుందేమో చూడాలి. కానీ తెలుగు పరిశ్రమలో నటీమణుల మధ్య పోటీ ఎలా ఉందో తెలిసిందే. ఆ పోటీని తట్టుకుని దర్శన నిలబడాలి సుమీ.
