తోటి ఖైదీలతోనూ దర్శన్ గొడవలా?
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ బెంగుళూరు పరప్పన్ అగ్రహారం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 9 Dec 2025 8:00 PM ISTఅభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ బెంగుళూరు పరప్పన్ అగ్రహారం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా జైల్లోనూ దర్శన్ దూకుడు ఏమాత్రం తగ్గలేదని తెలుస్తోంది. దర్శన్ తోటి ఖైదీలతో ఘర్షణకు గాడు. ఇదే కేసులో అరెస్ట్ అయిన నిందితులు అనూకుమార్, జగ్గ, ప్రద్యుష్, లక్ష్మణ్ లలో ఒకరిని దర్శన్ వేధిస్తున్నాడట. దర్శన్ తో సంబధం లేకుండా తనని మరోక జైలుకు తరలించాల్సిందిగా అధికారుల్ని బాధితుడు కోరినట్లు తెలిసింది.
దర్శన్ వద్దనే ఉంటే తనకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని..తానెంతో భయంతో ఉన్నట్లు అధికారులకు విన్నవించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. దీంతో జైలు అధికారులు దర్శన్ ఉన్న బరాక్ ను నిశితంగా పరిశీ లించిడం.. పర్యవేక్షించడం జరుగుతోందని సమాచారం. బరాక్ వద్ద ఘర్ణణ వాతావరణం అలుముకోవడంతో? అధికారులు అదనపు భద్రతను ఏర్పాటు చేసినట్లు వార్తలొస్తున్నాయి. దర్శన్ కు రెండో దఫా బెయిల్ రద్దవ్వడంతో అతడిలో అసహనం పెరిగిపోయినట్లు జైలు వర్గాలు పేర్కొంటున్నాయి.
అగ్రహారం జైలు తొలి నుంచి వివాదాస్పదంగా మారుతోన్న సంగతి తెలిసిందే. తొలుత జైలులోనూ విశ్రాంతి వాతావరణంలో దర్శన్ టీ తాగుతోన్న ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమ య్యాయి. అటుపై మరో ఖైదీ మోబైల్ ఫోన్ వినియోగించడం జైలు నుంచి లీకైంది. దీంతో అగ్రహారం జైలు పై ప్రత్యేక నిఘా ఏర్పాటైంది. అలాగే దర్శన్ జైలు కెళ్లినప్పటి నుంచి నిత్యం అతడిపై మీడియాలో కథనాలు వైరల్ అవుతూనే ఉన్నాయి.
విచారణ సందర్భంలో న్యాయమూర్తులతో వాదన వినిపించుకునే తీరు.. జైల్లో సౌకర్యాలు సరిగ్గా లేవని విషమిచ్చి చంపేయండి అంటూ దర్శన్ కోరడం ఎంత సంచలనమైందో తెలిసిందే. దీంతో కోర్టు కొన్ని రకాల వసతులు కూడా కల్పించాలని జైలు అధికారులను ఆదేశించింది. ఇంటి నుంచి భోజనం...దిండు, దుప్పటి వంటి వాటికి అనుమతిచ్చింది. అలాగే దర్శన్ అరెస్ట్ అవ్వడంతో ఆయన నటించా ల్సిన సినిమా షూటింగ్ లు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
