దిండు, దుప్పటి ఇచ్చినా పరిస్థితి మళ్లీ మొదటికేనా?
కన్నడ నటుడు దర్శన్ బెయిల్ రద్దు నేపథ్యంలో మళ్లీ జైలుకు పరిమితమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే జడ్జ్ ముందు తన బాధను వెళ్లగక్కాడు.
By: Srikanth Kontham | 30 Sept 2025 4:56 PM ISTకన్నడ నటుడు దర్శన్ బెయిల్ రద్దు నేపథ్యంలో మళ్లీ జైలుకు పరిమితమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే జడ్జ్ ముందు తన బాధను వెళ్లగక్కాడు. జైల్లో అత్యంత దుర్బురంగా ఉన్నట్లు.. సరైన సౌకర్యాలు లేకపోవడంతో విషమిస్తే తనువు చాలిస్తానని గోడు వినిపించుకున్నాడు. దీంతో కోర్టు కొన్ని సౌకర్యాలు కల్పించింది. జైలు నిబంధనల ప్రకారం దర్శన్ కు ప్రాధమిక సౌకర్యాలు కల్పించాలని బెంగుళూరు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు జైలు అధికారులను ఆదేశించింది.
దీంతో దిండు, దుప్పటి , మంచం వంటి సౌకర్యాలకు అనుమతి లభిచింది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి దర్శన్ జైలు జీవితం తెరపైకి వచ్చింది. ఉగ్రవాదులను ఉంచే సెల్ లో ఉంచి దర్శన్ కు నరకం చూపిస్తున్నారని ఆయన తరుపు న్యాయవాది కర్ణాటక సివీల్ కోర్టులో వాదించారు. ఇతరులు వినియోగించిన పరుపు, దిండు, దుప్పటి ఇవ్వడం వల్ల దర్శన్ కు ఇన్పెక్షన్ అయిందన్నారు. అలాగే గదిలో ఎండ తగలకపోవడంతో? దుస్తులు దుర్వాసన వస్తున్నాయని, గోడలపై ఫంగస్ చేరడంతో గదంతా దుర్వాసనతో నిండినట్లు కోర్టు ముందుకు తీసుకెళ్లారు.
అయితే ఈ వాదనని ప్రభుత్వం తరుపు న్యాయవాది ఖండించారు. జైల్లో లగ్జరీ బెడ్ ఇవ్వడం కుదరదన్నారు. కోర్టు అదేశాల ప్రకారం ప్రాధమిక సౌకర్యాలు కల్పించామన్నారు. ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసామన్నారు. గోల్డెన్ కాట్ అడిగితే ఇవ్వడం వీలుపడదన్నారు. దర్శన్ కు కల్పించిన సౌకర్యాలు జైలు మాన్యువల్ నిబంధన ప్రకారం ఉన్నాయన్నారు. దీంతో ఇరు వైపులా వాదనలు ఉన్న కోర్టు విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది. మరి తదుపరి విచారణలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
దర్శన్ అరెస్ట్ అవ్వడంతో ఆయన నటించాల్సిన సినిమాలన్నీ ఎక్కడిక్కడ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. బెయిల్ పై బయటకు వచ్చిన నేపథ్యంలో కొంత గ్యాప్ అనంతరం మళ్లీ ఆగిపోయిన సినిమాలు పట్టాలెక్కించేలా ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. కానీ అనూహ్యంగా హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీం కోర్టు రద్దు చేయడంతో కథ మళ్లీ మొదటికే వచ్చింది.
