ఓటీటీలోకి డానీ బోయ్‌లే వింతైన చిత్రం
అందుకే అతడు తెరకెక్కించిన `28 ఇయర్స్ లేటర్` భారతదేశంలో ఓటీటీలో స్ట్రీమింగుకి రాబోతోంది. ఇది పోస్ట్-అపోకలిప్టిక్ కమింగ్-ఆఫ్-ఏజ్ హారర్ చిత్రం.
By: Sivaji Kontham | 20 Sept 2025 10:49 PM ISTడానీ బోయ్‌లే పరిచయం అవసరం లేదు. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంతో ఆస్కార్‌లు కొల్లగొట్టిన ప్రముఖ దర్శకుడు. ఈ సినిమాకి సంగీతం అందించిన భారతీయ సంగీత దిగ్గజం ఏ.ఆర్.రెహమాన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఆస్కార్ ని గెలుచుకున్నారు. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రాన్ని ప్రతి సామాన్యుడు గుర్తుంచుకునేంత సరళంగా, భాషతో సంబంధం లేకుండా అభిమానించేంత గొప్పగా తెరకెక్కించిన డానీ బోయ్ లే పనితనం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
అందుకే అతడు తెరకెక్కించిన `28 ఇయర్స్ లేటర్` భారతదేశంలో ఓటీటీలో స్ట్రీమింగుకి రాబోతోంది. ఇది పోస్ట్-అపోకలిప్టిక్ కమింగ్-ఆఫ్-ఏజ్ హారర్ చిత్రం. 28 డేస్ లేటర్, 28 వీక్స్ లేటర్ తర్వాత రిలీజైన చిత్రమిది. ఈ హారర్ చిత్రం బోల్డ్ ఫిల్మ్ మేకింగ్ కారణంగా నిరంతరం చర్చల్లో నిలిచింది. దాదాపు 60 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా 151 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.
థియేటర్లలో అద్భుత వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, బుక్ మై షో స్ట్రీమ్ -ఆపిల్ టీవీలో వచ్చింది.. కానీ అద్దె చెల్లింపు విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు దీనిని ఫ్రీగా వీక్షించేందుకు నెట్ ఫ్లిక్స్ అవకాశం కల్పిస్తోంది. జోడీ కమెర్, ఆరోన్ టేలర్-జాన్సన్, ఆల్ఫీ విలియమ్స్ - రాల్ఫ్ ఫియన్నెస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ పంపిణీ చేయగా, కొలంబియా పిక్చర్స్, డెసిబెల్ ఫిల్మ్స్ , డిఎన్ఏ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. హారర్ థ్రిల్లర్ కథాంశంతో గగుర్పాటుకు గురి చేయడం ద్వారా భారీ వసూళ్లను తేవడం కష్టం కాదని బోయ్ లే నిరూపించడం ఆసక్తికరం.
