గుబులు పుట్టిస్తున్న దక్ష బాస్ లేడీ వైబ్స్
తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న యువ కథానాయిక దక్షా నగర్కార్ మరోసారి సోషల్ మీడియా వేదికగా వార్తల్లో నిలిచింది.
By: Sivaji Kontham | 11 Oct 2026 12:42 PM ISTతెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న యువ కథానాయిక దక్షా నగర్కార్ మరోసారి సోషల్ మీడియా వేదికగా వార్తల్లో నిలిచింది. హుషారు, జాంబీ రెడ్డి తెలుగు పరిశ్రమలో తనకు మంచి గుర్తింపునిచ్చిన సినిమాలు. వీటితో పాటు నిరంతర ఫోటోషూట్లు, అవార్డ్ ఈవెంట్లతోను యూత్ లోకి దూసుకెళ్లింది ఈ ఉత్తరాది భామ. ఈ బ్యూటీ నిత్యం డిఫరెంట్ ఫోటోషూట్లతో అభిమానులను అలరిస్తోంది. తాజాగా దక్ష ఇన్ స్టా ఖాతాలో పంచుకున్న కొత్త ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఈ లేటెస్ట్ ఫోటోషూట్‌లో దక్షా నగర్కార్ తనదైన శైలిలో క్లాసీ అండ్ గ్లామరస్ లుక్‌తో కనిపించి నెటిజన్లను కట్టిపడేసింది. ఆధునిక ఫ్యాషన్ దుస్తుల్లో బోల్డ్ అండ్ ఎలిగెంట్ పోజులతో ఆకట్టుకుంటూ.. గ్లామర్‌తో పాటు కాన్ఫిడెన్స్ కలబోసిన తన మేకోవర్‌ను ప్రదర్శించింది. ఆ స్టైలింగ్, ఆటిట్యూడ్ చూసిన అభిమానులు ఫిదా అవుతూ ఈ ఫోటోలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఫోటోలు షేర్ చేసిన కొద్ది సమయంలోనే కామెంట్ సెక్షన్ అభిమానుల స్పందనలతో నిండిపోయింది. వేల సంఖ్యలో లైకులు, హార్ట్ అండ్ ఫైర్ ఎమోజీలతో నెటిజన్లు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ``దివి నుంచి దిగివచ్చిన దేవకన్యలా ఉంది``, ``ఎలిగెన్స్ విత్ ఆటిట్యూడ్`` అంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో దక్షా అందాన్ని ఆకాశానికెత్తేస్తున్నారు.
కేవలం గ్లామరస్ ఫోటోషూట్లే కాకుండా... సినిమాల్లోనూ వైవిధ్యమైన పాత్రలతో మెప్పించేందుకు దక్షా నిరంతరం ప్రయత్నిస్తోంది. `బంగార్రాజు` చిత్రంలో మెరుపు తీగలా ప్రత్యేక గీతంలో అలరించిన ఈ భామ.. రవితేజ `రావణాసుర` వంటి బిగ్ ప్రాజెక్టులలోను తన నటనతో ఆకట్టుకుంది. ఇటీవల నాగబంధం చిత్రంలో అలాగే కొరియన్ కనకరాజు సినిమాలో అతిథి పాత్రలోను దక్ష ప్రదర్శన అందరినీ మెప్పించింది. సోషల్ మీడియాలో వచ్చే ఈ భారీ క్రేజ్ ఈ బ్యూటీ సినీ కెరీర్‌కు మరింత మైలేజ్ నిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సినిమాల పరంగా కాస్త గ్యాప్ వచ్చినా... సోషల్ మీడియా ద్వారా నెటిజన్లతో క్రమం తప్పకుండా టచ్‌లో ఉంటూ తన ఫాలోయింగ్‌ను నిలబెట్టుకుంటోంది. ప్రస్తుతం సరైన మాస్ కమర్షియల్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ ముద్దుగుమ్మకు... ఈ రేంజ్ గ్లామర్ అట్రాక్షన్ తో రానున్న రోజుల్లో మరిన్ని క్రేజీ ఆఫర్లు అందుతాయని టాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
