బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో మరింత అందంగా దక్ష నగర్కర్!
ప్రస్తుతం దక్ష నగర్కర్ కి సంబంధించిన ఈ గెట్ రెడీ విత్ మీ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
By: Madhu Reddy | 3 Oct 2025 12:00 AM ISTఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు ఏ చిన్న పని చేసినా కూడా దాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే కొంతమంది నటీనటులు షేర్ చేసే ఫోటోల కారణంగా విమర్శలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇదంతా పక్కన పెడితే.. తాజాగా మేకప్ వేసుకుంటూ ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది ఓ హీరోయిన్. అందులోనూ బ్లాక్ అండ్ వైట్ లో షేర్ చేసిన ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఇవి కూడా నెట్టింట్లో పెట్టాలా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు సౌత్ బ్యూటీ దక్ష నగర్కర్.
ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా వచ్చిన జాంబిరెడ్డి సినిమాతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న దక్ష నగర్కర్.. ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. అయితే తాజాగా ఈ హీరోయిన్ మేకప్ వేసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక మేకప్ అంటే మొహానికి మాత్రమే కాదు నడుముకి మేకప్ వేసుకున్న ఫోటోని షేర్ చేయడంతో పాటు గెట్ రెడీ విత్ మీ అని క్యాప్షన్ ఇవ్వడంతో చాలామంది ఈ ఫొటోస్ చూసి హాట్ ఎమోజీ లు షేర్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఫొటోస్ లో దక్ష నగర్కర్ తన నడుము, నాభి అందాలను హైలైట్ చేస్తూ ఫోజులు ఇచ్చింది. ఈ నడుము అందాలతో పాటు ఎద అందాలు కూడా హైలెట్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది..
ప్రస్తుతం దక్ష నగర్కర్ కి సంబంధించిన ఈ గెట్ రెడీ విత్ మీ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
దక్ష నగర్కర్ సినీ కెరియర్ విషయానికి వస్తే..ఈ హీరోయిన్ సినీ ఇండస్ట్రీలోకి 2014లో వచ్చిన ఏకే రావు పీకే రావు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హోరాహోరి, హుషారు, జాంబిరెడ్డి, బంగార్రాజు, స్వాగ్,రావణాసుర, విమానం వంటి సినిమాల్లో నటించింది. అలా జాంబిరెడ్డి సినిమాతో పాపులర్ అయిన ఈ హీరోయిన్.. పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణిస్తోంది.
దక్ష నటించిన ఎక్కువ శాతం సినిమాల్లో గ్లామర్ నటిగానే పేరు తెచ్చుకుంది. అలా ఓవైపు సినిమాల్లో కీ రోల్స్ పోషిస్తూనే.. మరోవైపు స్పెషల్ సాంగ్ లు చేస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా నిలుస్తోంది. సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. ప్రస్తుతం తెలుగుతోపాటు అటు ఇతర భాషల్లో కూడా అవకాశాలు అందుకుంటూ మరింత బిజీగా మారిపోయింది దక్ష.
