Begin typing your search above and press return to search.

వాళ్లిద్ద‌రితో బ్రేకప్ ఎలా అంటే?

మొద‌టి ల‌వ్ లో నాలుగేళ్ల స‌మ‌యంలో పెళ్లి అనే ఆలోచ‌న రాలేదంది. త‌ర్వాత అదే ఆలోచ‌న రాకుండా ప్రియుడు చేసాడంది.

By:  Srikanth Kontham   |   24 Aug 2025 6:00 AM IST
వాళ్లిద్ద‌రితో బ్రేకప్ ఎలా అంటే?
X

సెల‌బ్రిటీ లైఫ్ లో డేటింగ్లు..మీటింగ్లు స‌హ‌జం. క‌లిసి ఉన్నంత కాలం సంతోషంగా ఉండ‌టం. విడిపోయిన త‌ర్వాత ఎవ‌రికి వారుగా వెళ్లిపోవ‌డం. స్వేచ్చ‌గా జీవించ‌డం అన్న‌ది సెలబ్స్ జీవితాల్లో ఎక్కువ‌గా క‌ని పిస్తుంటుంది. కానీ ఏ రిలేష‌న్ షిప్ బ్రేక్ అయిన అంద‌రి హృద‌యాలు గాయ‌ప‌డ‌వు. కొంత మంది బ్రేక‌ప్స్ లైట్ తీసుకుంటే ? మ‌రికొంత మంది ఆ జ్ఞాప‌కాల నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి ర‌క‌ర‌కాల మార్గాలు చూసు కుంటారు. తాజాగా బాలీవుడ్ న‌టి డైసీ షా బ్రేక‌ప్ అయిన రెండు రిలేష‌న్ షిప్స్ గురించి తొలిసారి ఓపెన్ అయింది.

అత‌డితో బాండింగ్ దారుణం:

మొద‌టి ల‌వ్ లో నాలుగేళ్ల స‌మ‌యంలో పెళ్లి అనే ఆలోచ‌న రాలేదంది. త‌ర్వాత అదే ఆలోచ‌న రాకుండా ప్రియుడు చేసాడంది. ఇక ఏడో సంవ‌త్స‌రంలోకి అడుగు పెట్ట‌గానే తాను సంతోషంగా లేదు అన్న విష యాన్ని గ్ర‌హించిన‌ట్లు తెలిపింది. రెండ‌వ సారి రిలేష‌న్ షిప్ మ‌రింత దారుణంగా ఉంద‌ని పేర్కొంది. అత‌డో అనుమాన‌పు అక్కు ప‌క్షి అట‌. నిరంత‌రం తాను ఏం చేస్తుంది? ఎవ‌రితో మాట్లాడుతుంది? బ‌య‌ట‌కు ఎలా వెళ్తుంది? ఇలా వీటిపైనే ప్రియుడితో ఎక్కువ డిస్క‌ష‌న్ న‌డిచేదంది.

న‌టి మ‌న‌సుకు గాయం:

అత‌డు కూడా సినిమా వాడు అయినా త‌న‌ను అర్దం చేసుకోవ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడంది. తొలిసారి ఇద్ద‌రు ఓ పార్టీలో తొలిసారి క‌లుసుకున్నారట‌. ఆ స‌మ‌యంలో స్నేహితుడు ఒక‌రు చేయి ప‌ట్టుకుని లాగి డాన్స్ చేస్తే దానిని కూడా అత‌డు త‌ప్పుగా భావించి గొడ‌వ‌కు దిగిన‌ట్లు తెలింది. దీంతో ఇలాంటి అను మాన‌పు ప‌క్షితో క‌లిసి జీవించ‌డం క‌ష్ట‌మ‌నిభావించి అక్క‌డితో అత‌డికి గుడ్ బై చెప్పిన‌ట్లు తెలిపింది. ఈ రెండు రిలేష‌న్ షిప్స్ బ్రేక్ అయ్యే స‌మ‌యంలో మ‌న‌సు మాత్రం చాలా గాయ‌ప‌డింద‌ని తెలిపింది.

అవ‌కాశాలు లేక ఖాళీగా:

రిలేష‌న్ షిప్ ని వ‌దులుకోవ‌డం అంత సుల‌భం కాద‌ని...బంధాల విలువ ఎలా ఉంటుంది? అన్న‌ది తెగిపోయే స‌మ‌యంలోనే తెలుస్తాదంది. దీంతో ఆ త‌ర్వాత ఎవ‌రితోనూ రిలేష‌న్ షిప్ పెట్టుకోలేద‌ని తెలిపింది. కొంత మంది ప్ర‌పోజ్ చేసినా ? వాటిని సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్లు డైసీ సా తెలిపింది. ఈ అమ్మ‌డు రెండేళ్ల‌గా అవ‌కాశాలు లేక ఖాళీగా ఉంటోంది. పాత్ర‌లు స‌హా స్పెష‌ల్ సాంగ్ ఆఫ‌ర్లు కూడా రాలేదు. `రెడ్ రూమ్` షో త‌ర్వాత టీవీ ఇండ‌స్ట్రీకి దూర‌మైంది. మ‌రి కొత్త ఛాన్సుల కోసం ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తుందో తెలియాలి.