మాజీ ప్రియుడి డబుల్ గేమ్ నేర్పిన పాఠం
ఇప్పుడు అదే బాటలో సల్మాన్ హీరోయిన్ డైసీ షా కూడా చేరింది. తాను ప్రేమలో ఉన్నప్పుడు మాజీ ప్రియుడు ద్వంద్వ ప్రమాణాలను పాటించాడు.
By: Sivaji Kontham | 25 Aug 2025 5:00 AM ISTయుగయుగాలుగా స్త్రీ స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఎప్పుడూ చర్చల్లోని అంశం. మగాళ్లు పూర్తి స్వేచ్ఛను అనుభవిస్తూనే, స్త్రీ స్వేచ్ఛను అణచి వేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కానీ కాలక్రమంలో పురుషాహంకారం, ద్వంద్వ ప్రమాణాలను నిలదీసే మహిళల సంఖ్య కూడా పెరిగింది. తమ స్వేచ్ఛ, స్వాతంత్య్రాన్ని హరించే పురుషాధిక్యాన్ని తట్టుకోవడం అంత సులువు కాదనే సందేశాన్ని పంపిన కథానాయికలు ఎందరో ఉన్నారు.
ఇప్పుడు అదే బాటలో సల్మాన్ హీరోయిన్ డైసీ షా కూడా చేరింది. తాను ప్రేమలో ఉన్నప్పుడు మాజీ ప్రియుడు ద్వంద్వ ప్రమాణాలను పాటించాడు. అతడు స్వేచ్ఛగా ఉన్నాడు. ఇదే పరిశ్రమలో ఉండి కూడా మరో మగ నటుడితో డైసీ షా స్వేచ్ఛగా నటించడాన్ని ప్రశ్నించాడు. నియంత్రించడానికి ప్రయత్నించాడు. తన ఆశయాన్ని కూడా వదులుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. చివరికి ఇలా ముందుకు సాగడం కుదరదని భావించి, అతడిని వదులుకున్నానని, స్వేచ్ఛ సమానత్వం ఆలోచనల కారణంగానే అతడి నుంచి దూరమయ్యానని డైసీ షా తెలిపింది. బాలీవుడ్ అగ్రకథానాయకుడు సల్మాన్ ఖాన్ సరసన `జై హో` చిత్రంలో నటించిన డైసీ, ఆ తర్వాత కెరీర్ పరంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నా కానీ, పట్టుదలగా అవకాశాల్ని వెంబడిస్తోంది.
ద్వంద్వ ప్రమాణాలు పాటించే ప్రియుడిని దూరం పెట్టాక స్వేచ్ఛగా తన కలలను నిజం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నానని డైసీ షా తెలిపింది. నా భాగస్వామిని నేను సంవత్సరాలుగా భరించాను.. కానీ అతడు నన్ను భరించే పరిస్థితి లేదని డైసీ కనుగొన్నట్టు తెలిపింది. ఎవరైనా స్వీయ నిబంధనలతో ముందుకు సాగడం వ్యక్తిగత అభివృద్ధికి సహకరిస్తుంది. అందుకే మా పెళ్లిని వాయిదా వేయడం ద్వారా నన్ను నేను అన్వేషించుకునే అవకాశం కలిగిందని డైసీ షా పేర్కొంది. తిరిగి తన జీవితంపై తాను నియంత్రణను సాధించానని తెలిపింది. 2023లో ఒక సినిమాలో నటించిన డైసీ ఒక వెబ్ సిరీస్‌లోను తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 2024లో `రెడ్ రూమ్` అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఆ తర్వాత కొత్త ప్రాజెక్టును ప్రకటించలేదు. ప్రస్తుతం కథలు వింటున్నానని తెలిపింది. వెబ్ సిరీస్ లు, సినిమాలతో ముందుకు సాగాలనే తన నిర్ణయాన్ని ప్రకటించింది.
