Begin typing your search above and press return to search.

నా వద్ద సరిపడా డబ్బు ఉంది.. సినిమాల్లోకి రావడం అందుకే!

కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు పలు భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి డైసీ బోపన్న చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు.

By:  Srikanth Kontham   |   1 Oct 2026 6:00 PM IST
నా వద్ద సరిపడా డబ్బు ఉంది.. సినిమాల్లోకి రావడం అందుకే!
X

కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు పలు భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి డైసీ బోపన్న చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు. కాలక్షేపం కోసం .. ఆర్థిక అవసరాల కోసం మళ్లీ నటనారంగంలోకి రాలేదని ఆమె స్పష్టం చేశారు. తన వద్ద సరిపడా డబ్బు ఉందని, కేవలం మంచి పాత్రలు, బలమైన స్క్రిప్ట్ నచ్చడం వల్లే మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డైసీ రీఎంట్రీ వెనుక ఉన్న అసలు కారణాలను పంచుకున్నారు.

గతంలో సినిమాలకు దూరంగా ఉండటానికి కారణాలు రివీల్ చేసారు. మూస పద్ధతిలో సాగే పాత్రలు .. ప్రాధాన్యం లేని గ్లామర్ రోల్స్‌లో నటించడానికి ఇష్టపడలేదని డైసీ తెలిపారు. నటిగా తనలోని సత్తా చాటుకునేలా, విభిన్నమైన ఛాలెంజింగ్ పాత్రలు వస్తేనే చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రీఎంట్రీ ఇచ్చే క్రమంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేదని, తన మనసుకు నచ్చిన కథలను మాత్రమే ఎంచుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

ప్ర‌స్తుతం శ్రీని దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న కొత్త చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో తనది విలన్ పాత్ర అయినా? సాంప్రదాయ పద్ధతిలో కాకుండా చాలా వినూత్నంగా డిజైన్ చేశారని తెలిపారు. నేటితరం దర్శకుల ఆలోచనా విధానం, వారు సృష్టించే సినిమాటిక్ వరల్డ్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ప్రశంసించారు.

దర్శకుడు శ్రీని టేకింగ్, ఆయన నడిపించే విధానం బాగా నచ్చాయని, అందుకే ఈ ప్రాజెక్ట్‌లో నటించడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పారు. తన పాత్రకు ఉన్న నెగెటివ్ కోణం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచు తుందని.. సినిమాపై పూర్తి నమ్మకం ఉందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రేక్షకులు తన రీఎంట్రీని ఎలా ఆదరిస్తారనే దానిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.

గతంలో నటించిన చిత్రాలు, ప్రేక్షకులు తనకు ఇచ్చిన `స్పైసీ డైసీ` వంటి బిరుదులు ఎంతో మధురమైన జ్ఞాప కాలని తెలిపారు. వివాహం , కుటుంబ జీవితం కారణంగా సినిమాలకు కొంత విరామం ఇచ్చినా? నటనపై ఉన్న మమకారం తనను మళ్లీ ఇండస్ట్రీ వైపు న‌డిపించింద‌న్నారు. అయితే ఈసారి తన ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయని స్పష్టం చేశారు. డైసీ బోపన్న చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. డబ్బు.. పాపులారిటీ కోసం కాకుండా, ఆర్టిస్ట్‌గా తృప్తినిచ్చే పవర్‌ఫుల్ పాత్రల కోసం అమ్మ‌డు చేస్తున్న సెకండ్ ఇన్నింగ్స్ యువ నటీమణులకు స్పూర్తిగా నిలుస్తుందని చెప్పొచ్చు.