ఎన్టీఆర్ - పవన్ ఫ్యాన్స్ మధ్యలో చిచ్చుపెట్టేలా..
తాజాగా ఆయన పేరుతో ఉన్న ఒక ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓజీ సినిమాకు మద్దతు ఇస్తున్నట్లు ఓ పోస్ట్ ఉంది.
By: M Prashanth | 25 Sept 2025 1:16 PM ISTగత నెల వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడినట్లుగా ఒక వాయిస్ రికార్డు వైరలైంది. ఇందులో ఆయన హీరో జూనియర్ ఎన్టీఆర్ ను దూషిస్తున్నట్లు ఉంది. దీనిపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంతటితో ఆగకుండా ఆయన ఇంటికి వెళ్లి మరీ నిరసన చేపట్టారు. తాజాగా ఆయన పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఇది కాంట్రవర్సీ అయ్యింది.
తాజాగా ఆయన పేరుతో ఉన్న ఒక ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓజీ సినిమాకు మద్దతు ఇస్తున్నట్లు ఓ పోస్ట్ ఉంది. ఇందులో పవన్ కళ్యాణ్ ను పొడిగినట్లుగా, ఎన్టీఆర్ ను నిందిస్తున్నట్లుగా ఉంది. సార్ పవన్ కళ్యాణ్ గారిది అదేమీ క్రేజ్ సార్. దగ్గరుంది చూసుకుందాం అనుకున్నా, అప్పటికే వెయ్యి మంది ఫోన్ చేశారు టికెట్ల కోసం. అదే క్రేజ్ సార్! కానీ కొంతమంది ఉంటారు, తాత పేరు చెప్పుకొని మా TDP పార్టీ పార్టీ అని చెప్పి టికెట్లు అమ్ముకుంటారు అని ట్వీట్ వేసి ఉంది.
ఇది ఎన్టీఆర్ - పవన్ ఫ్యాన్స్ మధ్య వివాదం రాజేశాలా ఉంది. అయితే అది ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అఫీషియల్ అకౌంట్ కాదని తెలిసింది. ఆయన పేరు మీద ఎవరో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి ఎమ్మెల్యే టీమ్ స్పందించింది. అది ప్రసాద్ గారి అధికారిక ఎక్స్ అకౌంట్ కాదని.. కావాలనే ఎవరో ఫేక్ క్రియేట్ చేసి కాంట్రవర్సీ సృష్టిస్తున్నారని క్లారిటీ ఇచ్చింది. అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ పేరు మీద కొందరు ఫేక్ అకౌంట్ ను క్రియేట్ చేసి, పోస్టులు చేస్తున్నారు.
ఈ ఫేక్ అకౌంట్లను టిడిపి నాయకులు ఎవరు నమ్మవద్దని కోరుతున్నాము. అని ఎమ్మెల్యే టీమ్ క్లారిటీ ఇచ్చింది. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులను ఎమ్మెల్యే టీమ్ ఆశ్రయించనుంది. కాగా, ఇటీవల ఎన్టీఆర్ వార్ సినిమా రిలీజ్ సందర్భంగా ఒక ఆడియో బయటకు వచ్చింది. ఇందులో ఓ వ్యక్తి హీరో ఎన్టీఆర్ ను దూషిస్తున్నట్లుగా ఉంది. ఇది ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాదే అని ఫ్యాన్స్ ఆరోపించారు. కానీ, ఎమ్మెల్యే దీనిపై స్పందించి.. అది తాను కాదని, ఎవరో తనపై కుట్ర ప్రకారం ఇలా చేశారని వివరణ ఇచ్చారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు
కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీలో ఫ్యాన్ వార్స్ ఎక్కువయ్యాయి. సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక హీరో ఫ్యాన్స్ ఇంకో హీరో సినిమాపై నెగెటివిటీ చేయడం పరిపాటిగా మారింది. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో ఇది మారీ ఎక్కువైంది. ఒకరకంగా ఇది హీరోలు, నిర్మాతలు ఎవరికీ మంచిది కాదు. ఎప్పటికి ఈ తీరు మారుతుందో మరి చూడాలి.
