దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం అవార్డ్స్.. పూర్తి వివరాలివే!
దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2025 విజేతలను గురువారం ముంబై లో జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు.
By: Madhu Reddy | 1 Nov 2025 8:02 PM ISTదాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2025 విజేతలను గురువారం ముంబై లో జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు.ఇందులో బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్,విక్రాంత్ మాస్సే, వరుణ్ ధావన్,కృతి సనన్ లు బెస్ట్ యాక్టర్, యాక్ట్రెస్ లుగా నిలిచారు. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2025 లో స్త్రీ -2 మూవీ ఉత్తమ సినిమాగా.. ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా కల్కి 2898AD మూవీ అవార్డు అందుకోగా.. ఉత్తమ వెబ్ సిరీస్ గా పంచాయత్ 3.. ఉత్తమ నటుడిగా కార్తీక్ ఆర్యన్ లు అవార్డులను అందుకున్నారు.. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2025 10వ ఎడిషన్ అక్టోబర్ 29 , 30 తేదీలలో ముంబైలోని వర్లిలో ఈ కార్యక్రమం జరిగింది. గురువారం రోజు విజేతలను ప్రకటించారు. చలనచిత్రం, టెలివిజన్ పరిశ్రమలకు చెందిన అనేక మంది ప్రముఖులు అవార్డు ఫంక్షన్ లో హాజరయ్యారు.
అలా దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డులలో ఎవరెవరికి ఏ విభాగంలో అవార్డులు వచ్చాయో ఇప్పుడు చూద్దాం.. ఉత్తమ సినిమాగా బాలీవుడ్ మూవీ స్త్రీ-2 కు దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. ఉత్తమ నటుడిగా కార్తిక్ ఆర్యన్.. ఉత్తమ నటిగా కృతి సనన్..ఉత్తమ దర్శకుడిగా చందు.. ఛాంపియన్ మూవీకి దర్శకత్వం వహించిన కబీర్ ఖాన్ కి ఈ అవార్డు వరించింది.అలాగే ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD ఉత్తమ మూవీకి ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ అవార్డు వరించింది.
అంతేకాకుండా ఉత్తమ నిర్మాతగా దినేష్ విజన్ అవార్డు అందుకున్నారు.
ఉత్తమ క్రిటిక్స్ మూవీగా లపాటా లేడీస్..
ఉత్తమ క్రిటిక్ యాక్టర్ గా విక్రాంత్ మాస్సే(సెక్టర్ 36)..
ఉత్తమ క్రిటిక్స్ హీరోయిన్ గా నితాన్షి గోయల్ (లాపాటా లేడీస్),
ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ గా ఎమిలియా పెరెజ్,
ఉత్తమ అంతర్జాతీయ నటిగా కార్లా సోఫియా గాస్కాన్,
ఉత్తమ అంతర్జాతీయ నటుడిగా కోల్మన్ డొమింగో..
ఉత్తమ వెబ్ సిరీస్ గా హీరామండీ కి అవార్డులు వరించాయి..
ఉత్తమ వెబ్ సిరీస్ నటుడిగా పంచాయత్ 3 లో నటించిన జితేంద్ర కుమార్ కి అవార్డు వచ్చింది.
ఉత్తమ వెబ్ సిరీస్ నటిగా హుమా ఖురేషి,
ఉత్తమ వెబ్ సిరీస్ డైరెక్టర్ గా హీరామండి వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించిన సంజయ్ లీలా బన్సాలి..
ఉత్తమ క్రిటిక్స్ వెబ్ సిరీస్ గా పంచాయత్ సీజన్ 3,
ఉత్తమ క్రిటిక్స్ వెబ్ సిరీస్ నటుడిగా వరుణ్ ధావన్..
ఉత్తమ క్రిటిక్స్ వెబ్ సిరీస్ నటిగా సోనాక్షి సిన్హా లకి అవార్డులు వచ్చాయి.
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పుష్ప-2 మూవీకి మ్యూజిక్ అందించిన దేవిశ్రీప్రసాద్ కి ఈ అవార్డు వరించింది.
ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని ఏఆర్ రెహమాన్ అందుకోగా..
పెర్ఫామర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని స్టెబిన్ మ్యూజిక్ లో స్టెబిన్ బెన్ అందుకున్నారు..
టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని యే రిష్టా క్యా కెహ్లతా హై అనే సీరియల్ అవార్డు అందుకోగా..
బెస్ట్ టెలివిజన్ యాక్టర్ గా అర్జిత్ తనేజా..
బెస్ట్ టెలివిజన్ నటిగా దీపిక సింగ్ లు అవార్డులు అందుకున్నారు.
1969లో ఇండియన్ సినీ పితామహుడు దివంగత శ్రీ ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే జ్ఞాపకార్థం దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ అవార్డు లను ప్రారంభించారు.
