దాదాసాహెబ్ ఫాల్కే గౌరవం కొందరికి మాత్రమే ఎందుకు?
ముంబై, మద్రాసు కేంద్రాలుగా తొలి నాళ్లలో సినీపరిశ్రమలు అభివృద్ధి చెందుతున్న క్రమంలో కేవలం కొన్ని పేర్లు మాత్రమే లెజెండరీల జాబితాలో ఉన్నాయి.
By: Sivaji Kontham | 21 Sept 2025 11:00 PM ISTముంబై, మద్రాసు కేంద్రాలుగా తొలి నాళ్లలో సినీపరిశ్రమలు అభివృద్ధి చెందుతున్న క్రమంలో కేవలం కొన్ని పేర్లు మాత్రమే లెజెండరీల జాబితాలో ఉన్నాయి. అలాంటి ప్రముఖులలో కూడా సెలక్టివ్ గా కొందరిని మాత్రమే దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లభించింది. సత్యజిత్ రే, రాజ్ కపూర్, లతా మంగేష్కర్, దిలీప్ కుమార్- శివాజీ గణేషన్- ఆశా భోంస్లే వంటి హిందీ చిత్రసీమ ప్రముఖులకు ఫాల్కే పురస్కారాలు దక్కాయి. తెలుగు సినీప్రముఖులలో కొందరు దిగ్గజాలను ఫాల్కే పురస్కారం వరించింది. నిర్మాత బి.ఎన్ రెడ్డి దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం (1974) అందుకున్న తొలి తెలుగు ప్రముఖుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎల్.వి.ప్రసాద్ (1982), బి. నాగిరెడ్డి (1986), అక్కినేని నాగేశ్వరరావు(1990), డి.రామానాయుడు(2009), కె.విశ్వనాథ్ (2016)కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాలు లభించాయి.
అమితాబ్ కు పురస్కారం దక్కాక, రజనీకాంత్ కి కూడా ఫాల్కే గౌరవం దక్కింది. అటుపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కూడా ఫాల్కే దక్కితే, మూడు ఇండస్ట్రీల్లో సమకాలిక హీరోలకు గొప్ప గౌరవం దక్కినట్టేనని అభిమానులు భావించారు. పురస్కారాలు ఎల్లపుడూ రాజకీయాలతో ముడిపడినవి. కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలత ఉంటేనే ఇలాంటి పురస్కారాలు ప్రాంతీయ ప్రముఖులకు దక్కుతాయనేది అందరికీ తెలిసిన నిజం.
ఫాల్కే అవార్డు ఎప్పుడు ప్రారంభమైంది?
సినీపరిశ్రమలో దశాబ్ధాల పాటు గొప్ప సేవలందించిన వారికి ఇచ్చే పురస్కారాల్లో దాదా సాహెబ్ ఫాల్కే అత్యున్నతమైన గౌరవం. దేశ వినోదరంగ అభివృద్ధికి కృషి చేసిన వారికి ఫాల్కే అవార్డు ఒక బహుమానం. భారతీయ సినిమా పితామహుడిగా గౌరవించబడే ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే పేరు మీద ఈ అవార్డు 1969 లో స్థాపించారు. గ్రహీతకు స్వర్ణ కమల్ (గోల్డెన్ లోటస్) పతకం- శాలువ .. రూ .10 లక్షల నగదు బహుమతి లభిస్తుంది. ఈ పురస్కారం ఇప్పటికే భారతదేశంలో అరుదుగా కొందరు ప్రతిభావంతులను మాత్రమే వరించింది.
