టైటిల్ సెంటిమెంట్‌తో బాలయ్య ఫ్యాన్స్ సంబరాలు..!
'వీర సింహా రెడ్డి' తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో భారీ అంచనాల నడుమ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.
By: Ramesh Palla | 7 Sept 2026 12:13 PM IST'వీర సింహా రెడ్డి' తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో భారీ అంచనాల నడుమ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఇన్ని రోజులు NBK111 అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు టైటిల్‌ను కన్ఫర్మ్ చేశారు. దర్శకుడు గోపీచంద్ మలినేని పవర్ ఫుల్ టైటిల్‌ను బాలకృష్ణ మూవీ కోసం ఫైనల్ చేయడంతో పాటు, అభిమానుల ముందుకు తీసుకు వచ్చాడు. బాలకృష్ణ ను 'దాదా' గా చూపించబోతున్నట్లు గ్లిమ్స్ విడుదల చేసి మరీ ప్రకటించారు. బాలకృష్ణ అభిమానులతో పాటు రెగ్యులర్ సినీ ప్రేక్షకులు 'దాదా' టైటిల్ విషయంలో సానుకూలంగా ఉన్నారు. ముఖ్యంగా బాలకృష్ణ వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోకు 'దాదా' టైటిల్ సరిగ్గా సరిపోతుందనే అభిప్రాయంను ఫ్యాన్స్, ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. కథానుసారంగా దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాకు 'దాదా' అయితే అన్ని విధాలుగా బాగుంటుంది అని భావించాడట.
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని మూవీ 'దాదా'...
బాలకృష్ణ మూవీకి 'దాదా' అనే టైటిల్‌ను ఖరారు చేయడం పట్ల నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో రెండు లెటర్స్ టైటిల్స్‌కి మంచి స్పందన ఉంటుంది. చిరంజీవి కాకా, అల్లు అర్జున్ రాకా సినిమాలతో రాబోతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ 'పెద్ది' సినిమాతో వచ్చి ఆకట్టుకున్న విషయం తెల్సిందే. అందుకే బాలకృష్ణ దాదా టైటిల్‌తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే అభిప్రాయంను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. పైగా బాలకృష్ణకు రెండు అక్షరాల టైటిల్ సెంటిమెంట్ ఉంది. సింహా సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. అలాగే దర్శకుడు గోపీచంద్ మలినేని సైతం రెండు అక్షరాల టైటిల్స్‌తో వచ్చి హిట్ కొట్టాడు. అందులో ఒకటి క్రాక్ కాగా, మరోటి జాట్ మూవీ. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో దాదా సైతం కచ్చితంగా హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
బాలకృష్ణ కోసం పవర్ ఫుల్ టైటిల్..
'దాదా' టైటిల్‌తో బాలకృష్ణ మరోసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడం ఖాయం అనే అభిప్రాయంను చిత్ర యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో టైటిల్స్ విషయంలో ఫిల్మ్ మేకర్స్ ఏ స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలిసిందే. అందుకే ఈ టైటిల్ విషయంలోనూ దర్శకుడు గోపీచంద్ మలినేని చాలా ఆలోచించాడు, ఈ టైటిల్‌ను కొన్ని వారాల ముందే అనుకున్నప్పటికీ అభిమానుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అని ఎదురు చూశాడు. టైటిల్‌ను లీక్ చేసి అభిమానుల స్పందన తెలుసుకున్నాడు. దాదాతో పాటు మరికొన్ని టైటిల్స్‌ను సైతం లీక్ చేయడం జరిగింది. అయితే ఎక్కువ శాతం అభిమానులు దాదా టైటిల్‌పై మక్కువ చూపడంతో పాటు, బాలయ్య ఇమేజ్‌కి సరైన టైటిల్ అనే అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఫైనల్ గా ఈ టైటిల్ వైపు వెళ్లినట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల నుంచి సమాచారం అందుతోంది.
కాజల్ అగర్వాల్ హీరోగా దాదా...
బాలకృష్ణకు జోడీగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఇంకా ఈ సినిమాలో మంచు హీరో మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్న నేపథ్యంలో దాదా సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో తమిళ స్టార్ ఆర్ శరత్ కుమార్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలకృష్ణ సినిమాలకు వరుసగా సంగీతాన్ని అందిస్తూ బ్యాక్ గ్రౌండ్ బద్దలు కొడుతున్న థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. దాదాకు థమన్ అందిస్తున్న సంగీతం ప్లస్ అవుతుందనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈమధ్య కాలంలో బాలకృష్ణ చేసిన ప్రతి సినిమా మినిమం గ్యారెంటీ అన్నట్లుగా హిట్ అయ్యాయి. అందుకే దాదా విషయంలో అభిమానులతో పాటు, ఏ ఒక్కరిలోనూ అనుమానం లేదు. కచ్చితంగా దాదా బాక్సాఫీస్ వద్ద హిట్ కాబోతుందని నమ్మకంగా ఉన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో క్రిస్మస్ కానుకగా రాబోతున్న 'దాదా' ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుంది చూడాలి.
