మృణాల్ ప్యాకప్.. ఉగాది బరిలో శేష్ 'డెకాయిట్' పక్కా!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీస్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు.
By: M Prashanth | 21 Jan 2026 12:13 PM ISTటాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీస్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అతను నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'డెకాయిట్' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న మృణాల్ ఠాకూర్ తన పార్ట్ షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ టీమ్ అందరూ కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు.
శేష్, మృణాల్ కాంబినేషన్ అనగానే ఆడియన్స్‌లో ఒక రకమైన క్యూరియాసిటీ ఉంది. ఎందుకంటే ఇద్దరు కూడా యాక్టింగ్ లో ఆరితేరినవారే. కాబట్టి డ్రామా ఎపిసోడ్స్ మామూలుగా ఉండవని చెప్పవచ్చు. ఇక ఈ హై ఓల్టేజ్ డ్రామా షూటింగ్ రీసెంట్‌గా ఒక ఎగ్జైటింగ్ షెడ్యూల్‌తో ముగిసింది. మృణాల్ తన షూటింగ్ ఫినిష్ చేయడంతో ఇప్పుడు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరింత స్పీడ్ అందుకోనున్నాయి.
సీతారామం సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైన మృణాల్, ఈ సినిమాలో ఎలాంటి రోల్ ప్లే చేస్తోందో చూడాలి. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి కూడా ఎలాంటి డౌట్స్ కి తావివ్వకుండా మరో క్లారిటీ ఇచ్చారు. 'డెకాయిట్' సినిమాను ఇదే ఏడాది మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఉగాది పండుగ కానుకగా ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది. పండుగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ సినిమా తెలుగు హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద శేష్ మరోసారి తన మ్యాజిక్ రిపీట్ చేస్తారని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.
అడివి శేష్ తన కెరీర్‌లో ఎప్పుడూ వెరైటీ సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ ఉంటారు. ఈసారి 'డెకాయిట్' సినిమాతో ఒక రొమాంటిక్ యాక్షన్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇందులో శేష్ లుక్ చాలా కొత్తగా ఉండటంతో సినిమా రేంజ్ ఏంటో అర్థమైపోతోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు స్ట్రాంగ్ ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో ఉండబోతున్నాయని తెలుస్తోంది.
ఈ సినిమాకు షానీల్ డియో దర్శకత్వం వహిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. అనురాగ్ కశ్యప్, కమలక్ష్మి భాస్కర్ల వంటి స్టార్స్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం సినిమా వెయిటేజీని పెంచింది. సుప్రియ యార్లగడ్డ నిర్మాణంలో అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్ఎస్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. టెక్నికల్ గా కూడా ఈ సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని మేకర్స్ భరోసా ఇస్తున్నారు.
