Begin typing your search above and press return to search.

అడివి శేష్ అండ్ కో.. స్పీడ్ పెంచితే..

ప్రేమ, యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు, రొమాన్స్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఆ సినిమా మొదటి నుంచి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

By:  M Prashanth   |   18 April 2026 2:01 PM IST
అడివి శేష్ అండ్ కో.. స్పీడ్ పెంచితే..
X

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన డెకాయిట్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంట్రెస్టింగ్ జర్నీ కొనసాగిస్తోంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ చిత్రం విడుదలకు ముందే మంచి హైప్ సంపాదించుకుంది. ప్రేమ, యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు, రొమాన్స్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఆ సినిమా మొదటి నుంచి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

రిలీజ్ తర్వాత ఆ చిత్రానికి మిక్స్‌ డ్ టాక్ వచ్చినప్పటికీ, ఆ తర్వాత పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. బాక్సాఫీస్ వద్ద గట్టి కలెక్షన్లు నమోదు చేసి ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుని లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా వీకెండ్ లో ప్రేక్షకులు థియేటర్లకు రావడంతో వసూళ్లు బాగానే వచ్చాయి. అయితే వర్కింగ్ డేస్ ప్రారంభమైన తర్వాత కలెక్షన్లు కొంత తగ్గడం కనిపించింది. అయినప్పటికీ ఫస్ట్ వీక్‌ ను సినిమా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకోవడం గమనించదగ్గ విషయం.

అదే సమయంలో ఈ వారం పలు చిన్న సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. కిరణ్ అబ్బవరం నటించిన తిమ్మరాజు పల్లి టీవీ, నాగశౌర్య నటించిన బ్యాడ్ బాయ్ కార్తీక్, తిరువీర్ పాపం ప్రతాప్ వంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ సినిమాలు ప్రమోషన్స్ ద్వారా మంచి బజ్ సృష్టించినప్పటికీ, ఓపెనింగ్స్ మాత్రం మోస్తరు స్థాయిలోనే వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

ఇప్పటి వరకు వచ్చిన రివ్యూలను పరిశీలిస్తే, కొత్త చిత్రాల్లో ఏదీ బ్లాక్‌ బస్టర్ రేంజ్ లో రెస్పాన్స్ స్పందన పొందలేదని తెలుస్తోంది. దీంతో డెకాయిట్ చిత్రానికి ఇది ప్లస్ పాయింట్‌ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్ద పోటీ లేకపోవడం, మిగతా సినిమాలు కూడా ఇంకా పికప్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో డెకాయిట్ కు రెండో వారంలో కూడా మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉందని చెప్పాలి.

అయితే ఆ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలంటే సినిమా టీమ్ ప్రమోషన్స్‌ ను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించేలా వరుస ప్రమోషన్స్ చేపట్టాలి. ముఖ్యంగా సోషల్ మీడియా, ఇంటర్వ్యూలు, ఈవెంట్ల ద్వారా సినిమాపై మరింత దృష్టి సారిస్తే కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే స్పీడ్ పెంచితే లాభం పక్కా అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

ఏదేమైనా డెకాయిట్ చిత్రం మొదటి వారం తర్వాత కీలక దశలో ఉంది. బాక్సాఫీస్ వద్ద పోటీ తక్కువగా ఉండటం కలిసొస్తున్నా.. రెండో వారంలో కలెక్షన్లు నిలబెట్టుకోవడం కోసం ప్రమోషన్స్ కీలకంగా మారాయి. టీమ్ వేగం పెంచితే ఆ సినిమా లాభాల బాటలో మరింత ముందుకు సాగే అవకాశం ఉంది. దీంతో మేకర్స్.. వినూత్నంగా ప్రమోషన్స్ పై దృష్టి పెడితే లాభం చేకూరే ఛాన్స్ ఉందనే చెప్పాలి.