డెకాయిట్ మూవీ వాయిదా.. అసలు కారణం ఇదే..
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్.. వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకున్నారు.
By: M Prashanth | 6 Oct 2025 6:21 PM ISTటాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్.. వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. బాక్సాఫీస్ వద్ద పలు చిత్రాలతో హిట్స్ అందుకుని మెప్పించారు. ఇప్పుడు రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి గూఢచారి సీక్వెల్ జీ 2 కాగా.. మరొకటి డెకాయిట్.
రెండు సినిమాల్లో డెకాయిట్ ముందు రిలీజ్ కానున్నట్లు ఆ మూవీ మేకర్స్ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. శరవేగంగా షూటింగ్ జరుగుతుందని.. సినిమాను క్రిస్మస్ కానుకగా తీసుకొస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు చెబుతూ.. మూవీ నుంచి గ్లింప్స్ కూడా విడుదల చేశారు.
అయితే సినిమా ఇప్పుడు వాయిదా పడినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ అవ్వడం లేదు. మరికొద్ది రోజుల్లో మేకర్స్ కొత్త విడుదల తేదీని అధికారికంగా అనౌన్స్ చేయనున్నారట. ఇటీవల అడివి శేష్ గాయపడ్డారు. ఇంకా ఆయన గాయం నుంచి కోలుకోలేదు. దీంతో సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది.
ముఖ్యంగా భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయాల్సింది. అడివి శేష్ గాయపడడంతో పెండింగ్ లో ఉండిపోయింది. ఇప్పుడు ఇంకా గాయం మానకపోవడంతో సినిమాను రిలీజ్ ను వాయిదా వేస్తున్నారు మేకర్స్. వచ్చే ఏడాది.. సరైన తేదీన విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ విషయంలో ఇప్పటికే చర్చలు జరుపుతుండగా.. త్వరలో అనౌన్స్ చేయనున్నారు.
కాగా, డెకాయిట్ మూవీ విషయానికొస్తే.. షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి శేష్ నటించిన క్షణం , గూఢచారి సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. ఇప్పుడు డెకాయిట్ కు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సుప్రియ యార్లగడ్డ , సునీల్ నారంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మూవీలో అనురాగ్, ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, జాయిన్ మారి ఖాన్, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్ గా ముందు శృతి హాసన్ ను తీసుకున్నారు మేకర్స్. టైటిల్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఆమె తప్పుకోవడంతో మృణాల్ ఠాకూర్ ను బోర్డులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఆమెనే హీరోయిన్ గా కనిపించనున్నారు.
