Begin typing your search above and press return to search.

అడివి శేష్ 'డెకాయిట్'.. ఆ హీరో రివ్యూతో బిగ్ బూస్ట్..

తాజాగా సినిమాపై నేచురల్ స్టార్ నాని ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. డెకాయిట్ ను ఆయన ట్రూ బ్లాక్‌ బస్టర్ గా అభివర్ణించారు.

By:  M Prashanth   |   10 April 2026 11:12 AM IST
అడివి శేష్ డెకాయిట్.. ఆ హీరో రివ్యూతో బిగ్ బూస్ట్..
X

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్‌, క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్ లో రూపొందిన సినిమా డెకాయిట్. షానియల్‌ డియో దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఆ సినిమా పాజిటివ్‌ రెస్పాన్స్‌ అందుకుంటోంది. యాక్షన్, ఎమోషన్స్, లవ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఆ మూవీ ఆకట్టుకుంటోంది.

తాజాగా సినిమాపై నేచురల్ స్టార్ నాని ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. డెకాయిట్ ను ఆయన ట్రూ బ్లాక్‌ బస్టర్ గా అభివర్ణించారు. తన ట్వీట్‌ లో సినిమా గురించి ప్రశంసలు కురిపిస్తూ, ఇది తప్పక థియేటర్లలో చూడాల్సిన అనుభవమని పేర్కొన్నారు. ముఖ్యంగా అడివి శేష్ నటనను ఆయన ప్రత్యేకంగా కొనియాడుతూ, ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఇదే ఆయన బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని తెలిపారు.

అలాగే రచయిత అబ్బురి రవి అందించిన స్క్రీన్‌ ప్లేకు కూడా నాని ప్రశంసలు అందించారు. స్టోరీలో ఉన్న బలం, ఎమోషనల్ కనెక్ట్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన పాత్రలో పూర్తిగా లీనమై నటించారని, ఆమెకు ఇది మరో విజయంగా నిలుస్తుందని పేర్కొన్నారు. సినిమాను నిర్మించిన సుప్రియ యార్లగడ్డపై కూడా నాని ప్రశంసలు కురిపించారు.

మూవీని ఎంతో క్వాలిటీతో తీసుకురావడంలో ఆమె హార్డ్ వర్క్ స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. చక్కటి దర్శకత్వం, అద్భుతమైన సంగీతం, అమేజింగ్ విజువల్స్ అంటూ ప్రశంసలు కురిపించారు. మొత్తంగా చిత్ర బృందం అందరికీ అభినందనలు తెలిపారు. అయితే నాని పోస్ట్‌ కు అడివి శేష్ రిప్లై ఇచ్చారు. ఆ రివ్యూ చూసిన తర్వాత తన హృదయం ఆనందంతో నిండిపోయిందని తెలిపారు.

అంతే కాదు.. డెకాయిట్‌ టీమ్‌ మరింత ఉత్సాహంగా ఉందన్నారు. అదే సమయంలో మూవీ కేవలం యాక్షన్ సినిమాగా మాత్రమే కాకుండా, ప్రేమకథగా కూడా ప్రేక్షకుల హృదయాలను తాకుతోందని రివ్యూలు వస్తున్నాయి. కథ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగుతూ, ప్రతి సన్నివేశం ఆసక్తిని రేకెత్తించేలా ఉందని సమాచారం. ముఖ్యంగా అడివి శేష్ సినిమాలో తనకు అలవాటైన సస్పెన్స్, థ్రిల్లర్ ఇమేజ్‌ ను దాటి, మాస్ అవతార్ లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్రతి ఫ్రేమ్ విజువల్‌ గా ఆకట్టుకునేలా ఉండటం, భావోద్వేగ సన్నివేశాల్లో సంగీతం బలాన్ని చేకూర్చడం ప్రేక్షకులను మరింతగా సినిమాతో కనెక్ట్ అయ్యేలా చేస్తోందట. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందని సినీ ప్రియులు చెబుతున్నారు. మొత్తం మీద డెకాయిట్ ఒక గ్రిప్పింగ్ యాక్షన్ డ్రామాగా, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చిన ప్రేమకథగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని తెలుస్తోంది. అయితే సెలబ్రిటీల నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్.. ముఖ్యంగా నాని వంటి స్టార్ నుంచి వచ్చిన మొదటి రివ్యూ సినిమాకు మరింత బూస్ట్ ఇచ్చినట్లు కనిపిస్తోంది