Begin typing your search above and press return to search.

అడివి శేష్, జోనిత.. 'చిచ్చుబుడ్డి' మేకింగ్ వీడియో చూశారా?

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డెకాయిట్ ఇప్పటికే ఆడియన్స్ లో మంచి ఆసక్తి రేకెత్తిస్తోంది.

By:  M Prashanth   |   2 April 2026 4:57 PM IST
అడివి శేష్, జోనిత.. చిచ్చుబుడ్డి మేకింగ్ వీడియో చూశారా?
X

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డెకాయిట్ ఇప్పటికే ఆడియన్స్ లో మంచి ఆసక్తి రేకెత్తిస్తోంది. షానియల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా రివెంజ్ డ్రామా.. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందుతోంది. కథ, ట్రీట్మెంట్ పరంగా కొత్తదనాన్ని చూపించేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోందని ఇప్పటికే క్లియర్ గా తెలుస్తోంది. చిత్రంలో అడివి శేష్ సరసన మృణాల్ ఠాకూర్ నటించడం మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై మంచి బజ్‌ ను సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 10వ తేదీన మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన చిచ్చుబుడ్డి పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఆ పాటకు భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించారు.

విజయ్ పొలాకి కొరియోగ్రఫీ చేసిన ఆ డ్యాన్స్ నంబర్‌ కు జోనిత గాంధీ, రామ్ మిర్యాల స్వరాలు కలిశాయి. పాటలో జోనిత గాంధీతో కలిసి అడివి శేష్ వేసిన స్టెప్పులు అందరినీ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా స్పెషల్ సాంగ్స్ కోసం స్టార్ హీరోయిన్ ను ఎంపిక చేస్తున్న నేపథ్యంలో.. డెకాయిట్ మేకర్స్ సింగర్‌ నే సెలెక్ట్ చేయడం విశేషం. ఆ పాటతోనే జోనిత గాంధీ వెండితెరపై తొలిసారి కనిపించబోతుండటం విశేషంగా మారింది.

తాజాగా విడుదలైన చిచ్చు బుడ్డి పాట మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌ గా మారింది. ఆ వీడియోలో కనిపించిన సెట్స్, లైట్ సెటప్, డ్యాన్స్ మూమెంట్స్.. మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జోనిత గాంధీ ప్రెజెన్స్‌ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే అడివి శేష్ డ్యాన్స్ ప్రాక్టీస్ ఎంతో శ్రద్ధతో చేసినట్లు కనిపిస్తోందని కామెంట్లు పెడుతున్నారు.

ఇక సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో రూపొందిస్తున్నారు. తెలుగు తోపాటు హిందీలో కూడా చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్, బాలీవుడ్ దర్శకుడు- నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో కనిపించనుండటం విశేషం.

వారిద్దరి పాత్రలు కథలో కీలక మలుపులు తీసుకురానున్నాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తుండగా, టెక్నికల్ పరంగా కూడా సినిమా ఉన్నత ప్రమాణాలతో రూపొందుతోందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఏదేమైనా.. యాక్షన్, రొమాన్స్, రివెంజ్ ఎలిమెంట్స్ తో గ్రాండ్ గా తెరకెక్కుతున్న డెకాయిట్ సినిమా విడుదలకు ముందే మంచి హైప్‌ ను సొంతం చేసుకుంది. మరి రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో అంతా వేచి చూడాలి.