డెకాయిట్ బాక్సాఫీస్.. 2వ రోజు లెక్క ఎలా ఉందంటే?
ఓవర్సీస్ మార్కెట్ లో అడివి శేష్ మరోసారి తన సత్తా చాటారు. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా 1 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది.
By: M Prashanth | 12 April 2026 9:48 AM ISTఅడివి శేష్ బాక్సాఫీస్ వద్ద తన సక్సెస్ ట్రాక్ రికార్డును ‘డెకాయిట్’ చిత్రంతోనూ కొనసాగిస్తున్నారు. శుక్రవారం విడుదలైన ఈ యాక్షన్ రోమాంటిక్ డ్రామా ప్రేక్షకుల నుంచి మంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంటోంది. ఈ సినిమా కథనం ఎమోషన్స్ విషయంలో ఒక వర్గం నుంచి మిక్స్ ట్ టాక్ వచ్చినప్పటికీ, వసూళ్ల పరంగా మాత్రం శేష్ తన కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంటున్నాడు.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, నార్త్ ఇండియా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ సినిమా బలంగా నిలబడటం విశేషం.
సాధారణంగా ఏ సినిమాకైనా మొదటి రోజు కంటే రెండో రోజు వసూళ్లు కొంత తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ‘డెకాయిట్’ విషయంలో సీన్ వేరేలా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజుకు సమానంగా రెండో రోజు కూడా కలెక్షన్లు రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. శనివారం చాలా సెంటర్లలో షోలు సోల్డ్ అవుట్ అయ్యాయి.
మృణాల్ ఠాకూర్ క్రేజ్ శేష్ కు ఉన్న థ్రిల్లర్ మూవీస్ ఇమేజ్ ఈ సినిమాకు ప్రధాన బలంగా మారాయి. అసలు విషయానికి వస్తే, ‘డెకాయిట్’ విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 28 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. మొదటి రోజు రూ. 15 కోట్లు రాబట్టగా, రెండో రోజు రూ. 13 కోట్లను తన ఖాతాలో వేసుకుంది. ఒక మీడియం రేంజ్ హీరో సినిమాకు రెండు రోజుల్లో ఈ స్థాయి కలెక్షన్లు రావడం అంటే అది ఒక బిగ్గెస్ట్ ఓపెనింగ్ అనే చెప్పాలి.
ముఖ్యంగా ఏ, బి సెంటర్లలోని మల్టీప్లెక్సుల్లో ఆక్యుపెన్సీ చాలా పాజిటివ్ గానే ఉంది. హిందీ బెల్ట్ లో కూడా అడివి శేష్ తన మార్కెట్ ను పెంచుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. హిందీ వెర్షన్ వసూళ్లు మొదటి రోజు రూ. 1.3 కోట్లు ఉండగా, రెండో రోజు అది రూ. 1.75 కోట్లకు పెరగడం గమనార్హం. నార్త్ ఇండియాలో మృణాల్ ఠాకూర్ కు ఉన్న పాపులారిటీ కూడా ఈ సినిమా వసూళ్లకు ప్లస్ పాయింట్ అయింది. అక్కడ మౌత్ టాక్ బాగుండటంతో ఆదివారం నాడు ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
ఓవర్సీస్ మార్కెట్ లో అడివి శేష్ మరోసారి తన సత్తా చాటారు. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా 1 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. శేష్ కెరీర్ లోనే ఫాస్టెస్ట్ గా ఈ రికార్డు అందుకున్న చిత్రంగా ‘డెకాయిట్’ నిలిచింది. అక్కడ సండే వసూళ్లు కూడా తోడైతే ఈ సినిమా ఓవర్సీస్ లో ఒక భారీ వసూళ్లను సాధించిన చిత్రంగా మారుతుంది. క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాను బాగానే చూస్తున్నారు.
ఇక ‘డెకాయిట్’ వీకేండ్ ని బాగానే యుజ్ చేసుకుంటోంది. సుప్రియ యార్లగడ్డ నిర్మాణ విలువలు, భీమ్స్ సంగీతం సినిమాను కమర్షియల్ గా నిలబెట్టడంలో తోడ్పడ్డాయి. ఆదివారం బుకింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండటంతో, వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా రూ. 40 కోట్ల మార్కును చేరుకునే అవకాశం ఉంది. మరి లాంగ్ రన్ లో ఈ ‘డెకాయిట్’ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.
