అడివి శేష్ 'డెకాయిట్'.. ఇప్పటి వరకు లెక్క ఎంతంటే?
టాలెంటెడ్ అండ్ యంగ్ హీరో అడివి శేష్, క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా డెకాయిట్. రీసెంట్ గా రిలీజైన ఆ మూవీ స్టార్టింగ్ లో కాస్త మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి వసూళ్లు సాధిస్తోంది.
By: M Prashanth | 18 April 2026 5:41 PM ISTటాలెంటెడ్ అండ్ యంగ్ హీరో అడివి శేష్, క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా డెకాయిట్. రీసెంట్ గా రిలీజైన ఆ మూవీ స్టార్టింగ్ లో కాస్త మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి వసూళ్లు సాధిస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఆ సినిమా కలెక్షన్ల పరంగా సత్తా చాటుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ చిత్రం ఫస్ట్ వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగా సాలిడ్ కలెక్షన్లు రాబట్టింది. ఓపెనింగ్ డే రోజునే దాదాపు రూ.15 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి మంచి ఆరంభాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత కూడా అదే ఊపును కొనసాగిస్తూ మొదటి ఐదు రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.30.75 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది.
మొదటి వారం పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల మార్క్ ను డెకాయిట్ దాటడం విశేషం. అడివి శేష్ కెరీర్ లో ఒకే వారంలో ఆ రేంజ్ వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తవ్వగా.. ప్రాఫిట్ జోన్ లోనే ఉంది. ఇక ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఆ సినిమా మంచి స్పందన తెచ్చుకుంది. ముఖ్యంగా అమెరికాలో మొదటి వారంలో మిలియన్ డాలర్ల మార్క్ దాటడం గమనార్హం.
దీంతో అమెరికాలో వేగంగా ఆ మైల్ స్టోన్ ను అందుకున్న శేష్ సినిమాగా రికార్డు నమోదు చేసింది. అయితే ఇప్పటికే సెకండ్ వీక్ లోకి డెకాయిట్ వెళ్లగా.. అడ్వాన్స్ బుకింగ్స్ సాలిడ్ గా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందుకే రెండో వారంలో స్టేబుల్ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే.. డెకాయిట్ మూవీ ఫుల్ రన్ లో భారీ కలెక్షన్స్ సాధించే ఛాన్స్ ఉంది.
ఇక సినిమాను షానిల్ డియో దర్శకత్వం వహించగా, ప్రకాష్ రాజ్, సునీల్, అనురాగ్ కశ్యప్, అతుల్ కులకర్ణి తదితరులు నటించారు. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందించగా, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. కథ విషయానికి వస్తే.. హరిదాస్ (శేష్) తన ప్రాణంగా ప్రేమించిన సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాల్ ఠాకూర్) వల్ల మోసపోయి ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు.
తనపై జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడే తన మాజీ ప్రేయసి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది. ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుని జూలియట్‌పై పగ తీర్చుకోవాలని హరిదాస్ ప్లాన్ చేస్తాడు. వీరిద్దరూ శత్రువులుగా మారారు? జూలియట్ చేసిన మోసం వెనుక అసలు నిజం ఏమిటి? ఆమె భర్తకు ఈ కథలో ఉన్న సంబంధం ఏంటి? అనే అంశాలు సినిమాలో ఆసక్తికరంగా చూపించారు. మొత్తానికి డెకాయిట్ మిక్స్‌డ్ టాక్ మధ్య కలెక్షన్ల పరంగా నిలకడగా ముందుకు సాగుతూ బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తోంది.
