Begin typing your search above and press return to search.

తండ్రీ కొడుకుల మ‌ధ్యే అండర్ స్టాండింగ్ లేదే!

బాలీవుడ్ క్లాసిక్ చిత్రం `మైనే ప్యార్ కియా` విడుదలై దశాబ్దాలు గడిచినా? ఆ సినిమా చుట్టూ ఉన్న ఆసక్తికర విషయాలు ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి.

By:  Srikanth Kontham   |   27 April 2026 8:00 AM IST
తండ్రీ కొడుకుల మ‌ధ్యే అండర్ స్టాండింగ్ లేదే!
X

బాలీవుడ్ క్లాసిక్ చిత్రం `మైనే ప్యార్ కియా` విడుదలై దశాబ్దాలు గడిచినా? ఆ సినిమా చుట్టూ ఉన్న ఆసక్తికర విషయాలు ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. ఇటీవల సంగీత దర్శకుడు అమాల్ మాలిక్ తన తండ్రి దబూ మాలిక్ గురించి చేసిన ఓ వ్యాఖ్య ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ పోషించిన ఐకానిక్ ప్రేమ్ పాత్రకు తొలుత తన తండ్రిని ఎంపిక చేశారని అయితే చివరి నిమిషంలో సల్మాన్ ఆయనను రీప్లేస్ చేశారని అమాల్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తండ్రీకొడుకుల మధ్య భిన్నమైన వాదనలు తెరపైకి వచ్చాయి.

అయితే ఈ వ్యాఖ్యలను దబూ మాలిక్ ఖండించారు. తనను సల్మాన్ ఖాన్ రీప్లేస్ చేశారన్న వార్తల్లో నిజం లేదన్నారు. సల్మాన్ ఖాన్ ఆ పాత్రకు ఎంతో సరిపోతారని, ఆయనను తీసిసి తనను పెట్టుకోవాలని ఎవరూ అనుకోలేదని వెల్ల‌డించారు. అమాల్ కు ఆ విషయం ఎలా తెలిసిందో? తనకు తెలియదని బహుశా ఏదో పొరపాటు జరిగి ఉంటుందని దబూ మాలిక్ అభిప్రాయపడ్డారు. దీనితో ఈ వివాదానికి ముగింపు పలికినట్లయింది. దబూ మాలిక్ అసలు విషయాన్ని వివరిస్తూ `తను ఆ సమయంలో రాజశ్రీ ప్రొడక్షన్స్ కార్యాలయానికి వెళ్ళిన మాట వాస్తవమేన‌న్నారు. కానీ అది హీరో పాత్ర కోసం కాదన్నారు.

`మైనే ప్యార్ కియా` సినిమాలో చిన్న పాత్ర కోసం తాను ఆడిషన్ ఇచ్చానని అది కూడా సల్మాన్ స్నేహితుడి పాత్ర కోసమేనని వెల్ల డించారు. సల్మాన్ ఖాన్‌ను అప్పటికే హీరోగా ఖరారు చేశారని ఆయన స్థానంలో తాను నటిస్తాననే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు. సినిమా చరిత్రలో జరిగిన కొన్ని విషయాలు కాలక్రమేణా మారుతూ ప్రచారంలోకి వస్తుంటాయని పేర్కొన్నారు. అమాల్ మాలిక్ తన తండ్రి పట్ల ఉన్న గౌరవంతో తనకు తెలిసిన అరకొర సమాచారంతో ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ‌చ‌ని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా సినిమా రంగంలో ఒక పాత్ర కోసం అనేకమంది పేర్లను పరిశీలిస్తుంటారు.

బహుశా ఆ క్రమంలో తన తండ్రి పేరు కూడా వినిపించి ఉంటుందని అమాల్ భావించి ఉండొచ్చు. కానీ ఒక క్లాసిక్ సినిమాకు సంబంధించిన కీలకమైన కాస్టింగ్ వివరాలను తప్పుగా చెప్పడం వల్ల అనవసరమైన వివాదాలు తలెత్తుతాయని ఈ ఘటన నిరూపించింది. సల్మాన్ ఖాన్ ను ఈ చిత్రం రాత్రికి రాత్రే స్టార్‌గా మార్చేసింది. ఆ పాత్రలో సల్మాన్ తప్ప మరొకరిని ఊహించుకోవడం కూడా నేటి ప్రేక్షకులకు కష్టమే. దబూ మాలిక్ కూడా సల్మాన్ ప్రతిభను , ఆ సినిమా విజయాన్ని ఎప్పుడూ గౌరవిస్తాన‌న్నారు. ప్రస్తుతం అమాల్ మాలిక్ బాలీవుడ్ లో టాప్ సంగీత దర్శకుడిగా రాణిస్తు న్నారు. అలాంటి ఆయ‌న‌ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు సూచిస్తున్నారు.